iDreamPost

Best Horror Thriller In OTT: దెయ్యాల అడవిలో ఆడపిల్ల పోరాటం! OTTలో సూపర్ హర్రర్ మూవీ!

  • Published May 28, 2024 | 4:57 PMUpdated May 28, 2024 | 4:57 PM

OTT Movie Suggestion: కొత్త కథలను చూడాలనుకుంటే పాత సినిమాలను చూడాల్సిందే. అదే ఓటీటీ లో ఇప్పుడు వస్తున్న సినిమాలను చూసేసి బోర్ కొట్టేస్తే ఆల్రెడీ కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు ఓటీటీ లో ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను కనుక మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి.

OTT Movie Suggestion: కొత్త కథలను చూడాలనుకుంటే పాత సినిమాలను చూడాల్సిందే. అదే ఓటీటీ లో ఇప్పుడు వస్తున్న సినిమాలను చూసేసి బోర్ కొట్టేస్తే ఆల్రెడీ కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు ఓటీటీ లో ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను కనుక మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి.

  • Published May 28, 2024 | 4:57 PMUpdated May 28, 2024 | 4:57 PM
Best Horror Thriller In OTT: దెయ్యాల అడవిలో ఆడపిల్ల పోరాటం! OTTలో సూపర్ హర్రర్ మూవీ!

థియేటర్స్ కు అయినా అప్పుడప్పుడు సినిమాలు లేక బ్రేక్ ఉంటుందేమో కానీ, ఓటీటీ లో మాత్రం అసలు గ్యాప్ రాదు. ప్రతి వారం డజన్లలో సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ప్రేక్షకులు కూడా వాటికీ తగిన ఆదరణను ఇస్తూనే ఉన్నారు. ఇక ఉన్న సినిమాలు బోర్ కొట్టేసి కొత్త కంటెంట్ ను చూడాలనుకుంటే మాత్రం పాత సినిమాలను చూడాల్సిందే. ఇప్పటికే ఓటీటీ లో కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయి. చాలా ఎక్కువ కంటెంట్ ఉంది కాబట్టి.. వాటిలో కొన్ని సినిమాలను ప్రేక్షకులు మిస్ చేసే అవకాశం ఉంది. మరి ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా మీరు మిస్ చేసిన సినిమాల లిస్ట్ లో ఉందేమో ఓ లుక్ వేసేయండి. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్స్ సినిమాలను చూసేవాళ్లకు ఈ సినిమా బాగా నచ్చేస్తుంది. సారా, జెస్ ఇద్దరూ ట్విన్ సిస్టర్స్. జెస్ జపాన్ లోని ఓ స్కూల్ లో టీచర్ గా పని చేస్తూ ఉంటుంది. అయితే ఆమె స్కూల్ క్యాంపులో భాగంగా ఓ అడవిలో ఉన్న పర్వతం దగ్గరకు వెళ్తుంది. ఈ క్రమంలో ఆమె అనుకోకుండా దారి తప్పిపోతోంది. ఆ ప్రాంతాన్ని అవోకి గహర అని అంటారు. దీనితో ఈ కేసును సాల్వ్ చేయడానికి పోలీస్ ఆఫీసర్స్ రంగంలోకి దిగుతారు. అయితే జెస్ వెళ్లిన ఆ ప్రాంతానికి కేవలం సూసైడ్ చేసుకునే వారు మాత్రమే వెళ్తారంటూ చెప్పుకొచ్చారు పోలీసులు. కాబట్టి జెస్ కూడా అందుకే వెళ్లిందని.. బహుశా ఆమె కూడా చనిపోయి ఉంటుందని ఓ పోలీస్ ఆఫీసర్ సారాకు చెబుతాడు. అయితే సారా ఈ విషయాన్నీ అంగీకరించదు. ఎందుకంటే వారిద్దరూ ట్విన్స్ కాబట్టి .. జెస్ కు ఏదైనా జరిగితే అది ఖచ్చితంగా సారాకు తెలుస్తుందని చెప్తుంది. ఆమె బ్రతికే ఉందని సారా బలంగా నమ్ముతూ.. జెస్ ను వెతుక్కుంటూ జపాన్ వెళ్తుంది.

జపాన్ వెళ్లిన సారాకు.. జెస్ వెళ్లిన ఆ ప్రాంతం గురించి రకరకాల వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఒకప్పుడు తినడానికి తిండి కరువై, ఇంట్లో ముసలి వాళ్ళను, వికలాంగులను ఆ అడవిలో వదిలేసే వారని.. వారంతా ఆకలితో చనిపోయి దెయ్యాలై కోపంతో తిరిగివచ్చేవారని ఇలా రకరకాలుగా వింటుంది. ఈక్రమంలో అక్కడ ఆమెకు ఓ అమేరికన్ జర్నలిస్ట్ పరిచయం అవుతుంది. సారా కథ విన్న తర్వాత.. ఆ జర్నలిస్ట్ తన డాక్యుమెంటరీ కోసం సారా హెల్ప్ కావాలని.. ఓ గైడ్ ను ఏర్పాటు చేసుకుని ఆ ఫారెస్ట్ లోకి వెళదామని చెప్తాడు. దీనితో వారిద్దరూ ఆ అడవిలోకి వెళ్ళడానికి రెడీ అవుతారు. అక్కడే ఉన్న ఓ యువతి ఇదొక మాయ అడవి అని ఉన్నవి లేనట్లుగా కనిపిస్తాయని హెచ్చరిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది ? జెస్ ను వెతుక్కుంటూ వెళ్లిన సారాకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి ? సారా జెస్ ను కనిపెట్టిందా ? లేదా సారా కూడా ఆ అడవిలో బలైపోయిందా ? ఆమెతో వచ్చిన జర్నలిస్ట్ కు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి ? ఇవన్నీ తెలియాలంటే “ది ఫారెస్ట్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి