iDreamPost
android-app
ios-app

Best Horror Movie In OTT: చీకటి పడితే దెయ్యాలు! OTT ఈ మూవీ చూశాక.. లైట్ లేకుండా ఉండలేరు!

  • Published May 18, 2024 | 6:40 PMUpdated May 18, 2024 | 6:40 PM

OTT Movie Suggestion: హారర్ సినిమాలంటే ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూసి ఉండకపోతే మాత్రం.. ఇన్ని రోజులు ఈ సినిమాను ఎలా మిస్ అయ్యామా అని ఫీలింగ్ కలుగుతుంది.

OTT Movie Suggestion: హారర్ సినిమాలంటే ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూసి ఉండకపోతే మాత్రం.. ఇన్ని రోజులు ఈ సినిమాను ఎలా మిస్ అయ్యామా అని ఫీలింగ్ కలుగుతుంది.

  • Published May 18, 2024 | 6:40 PMUpdated May 18, 2024 | 6:40 PM
Best Horror Movie In OTT: చీకటి పడితే దెయ్యాలు! OTT ఈ మూవీ చూశాక.. లైట్ లేకుండా  ఉండలేరు!

హర్రర్ సినిమాలను చూసేందుకు ఇప్పుడు అందరు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఒక హర్రర్ సినిమా వస్తుంది అంటే ఎంత భయం వేసినా కానీ.. ఒంటరిగా కూర్చుని చూసే సాహసాలు చేస్తున్నారు మూవీ లవర్స్. దీనితో మేకర్స్ కూడా ఆయా జోనర్స్ కు తగిన సినిమాలను ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ కలిగించే విధంగా ఎంతో ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కిస్తున్నారు. ఇక హర్రర్ కంటెంట్ జోనర్ లో ఇప్పటివరకు ఉన్న సినిమాలన్నీ ఒకటైతే.. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా మరొక లెవెల్. సినిమా చూసిన తర్వాత లైట్స్ కట్టేయాలన్న కూడా భయపడతారు. మరి ఆ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా పేరు “లైట్స్ అవుట్”. దీనిని చూసిన వారికి నిజంగానే లైట్స్ కట్టేయాలంటే భయం వేస్తుంది. చాలా మందికి చిన్నపుడు ఉండే భయం.. చీకటి పడితే దెయ్యం వస్తుందని.. దెయ్యం వచ్చి భయపెడుతుందని. ఒకవేళ అదే నిజం అయితే ఎలా ఉంటుంది. చీకటి పడిన తర్వాత నిజంగానే దెయ్యం వస్తే ఏమౌతుంది. అనేదే ఈ సినిమా కథ. హాలీవుడ్ హర్రర్ సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ హర్రర్ చిత్రాల టాప్ లిస్ట్ లో ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుంది, ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఈ సినిమాను ఇప్పటివరకు ఎవరైనా మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమా కథేంటి అనే విషయానికొస్తే..

ఈ సినిమాలో రెబెక్కా, మార్టిన్ అనే ఇద్దరు అక్కా తమ్ముళ్లు ఉంటారు. అయితే, రెబెక్కా కు చిన్నపటినుంచి.. లైట్స్ ఆఫ్ చేసిన ప్రతి సారి చీకట్లో ఓ వింత ఆకారం కనిపిస్తుంది. చాలా సంవత్సరాలు ఏది నిజమో.. ఏది అబద్దమో తెలుసుకోలేకపోతుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆ సమస్య తగ్గిపోతుంది అనుకుంటుంది కానీ అని ఆ సమస్య మరితనంత బలపడుతుంది . పైగా ఆమె తమ్ముడు కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటాడు. దీనితో ఒకటే ఇంట్లో వారిద్దరూ బిక్కు బిక్కుమంటూ జీవిస్తూ ఉంటారు, పైగా వారికి కనిపించే ఆ వింత ఆకారానికి లైట్స్ ఎప్పుడు ఆన్ చేయాలో.. ఎప్పుడు ఆఫ్ చేయాలో కూడా శక్తులు ఉంటాయి. అసలు వారికి కనిపిస్తున్న ఆ వింత ఆకారం ఏంటి ! లైట్స్ ఆఫ్ లో ఉన్నపుడే వారికి ఎందుకు అలా కనిపిస్తుంది ! చివరికి ఏం జరిగింది ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి