iDreamPost

OTT News: అమెజాన్ ప్రైమ్ లో ట్రెండింగ్ లో ఉన్న మూవీస్ ఇవే.. వీటిలో మీరు ఎన్ని చూశారు !

  • Published May 30, 2024 | 7:58 PMUpdated May 30, 2024 | 7:58 PM

Top 10 Movies From Amazon Prime : ఓటీటీ లలో ఎప్పటికప్పుడు సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవ్వడమే కాకుండా.. ఓ వారం పది రోజులు గడిచిన తర్వాత ఏ ఏ సినిమాలు టాప్ 10 మూవీస్ లిస్ట్ వచ్చేస్తుంది. అలాగే ఈ మధ్య కాలంలో అమెజాన్ ప్రైమ్ లో టాప్ 10 లో ట్రెండింగ్ అవుతున్న సినిమాలేంటో చూసేద్దాం.

Top 10 Movies From Amazon Prime : ఓటీటీ లలో ఎప్పటికప్పుడు సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవ్వడమే కాకుండా.. ఓ వారం పది రోజులు గడిచిన తర్వాత ఏ ఏ సినిమాలు టాప్ 10 మూవీస్ లిస్ట్ వచ్చేస్తుంది. అలాగే ఈ మధ్య కాలంలో అమెజాన్ ప్రైమ్ లో టాప్ 10 లో ట్రెండింగ్ అవుతున్న సినిమాలేంటో చూసేద్దాం.

  • Published May 30, 2024 | 7:58 PMUpdated May 30, 2024 | 7:58 PM
OTT News: అమెజాన్ ప్రైమ్ లో ట్రెండింగ్ లో ఉన్న మూవీస్ ఇవే.. వీటిలో మీరు ఎన్ని చూశారు !

ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో ఉన్న అన్నిటిలో.. ఇప్పుడిప్పుడే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ను పొందే ప్రయత్నాలు చేస్తుంది అమెజాన్ ప్రైమ్. ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు కొత్త కంటెంట్ ను అందించడానికి ముందుంటుంది. పైగా థియేటర్ లో విడుదలకు సిద్ధంగా ఉన్న ప్రముఖ చిత్రాలను.. ముందుగానే కొనే ప్రయత్నాలు కూడా చేస్తుంది. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు కూడా బాగానే స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఓటీటీ లలో ఎప్పటికప్పుడు సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవ్వడమే కాకుండా.. ఓ వారం పది రోజులు గడిచిన తర్వాత ఏ ఏ సినిమాలు టాప్ 10 మూవీస్ లిస్ట్ వచ్చేస్తుంది. అలాగే ఈ మధ్య కాలంలో అమెజాన్ ప్రైమ్ లో టాప్ 10 లో ట్రెండింగ్ అవుతున్న సినిమాలేంటో చూసేద్దాం.

ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో టాప్ 10 ట్రెండింగ్ లో ఉన్న సినిమాలలో కొన్ని తెలుగు సినిమాలు కూడా ఉండడం విశేషం. మరి ఆ టాప్ 10 సినిమాలేంటో ఏ సినిమా ఏ స్థానంలో ఉందో చూసేద్దాం.

రత్నం:

విశాల్ నటించిన ఈ సినిమా థియేటర్స్ లో ఎలాంటి టాక్ ను అయితే సంపాదించుకుందో.. ఇప్పుడు ఓటీటీ లోను అంతే బాగా ప్రేక్షకులను మెప్పించేస్తుంది. దీనితో ఈ సినిమా ఇప్పుడు టాప్ 1 గా ట్రెండింగ్ లో నిలిచింది.

మడ్‌గావ్ ఎక్స్‌ప్రెస్:

రెగ్యులర్ సినిమాలు చూసి బోర్ కొట్టిన ప్రేక్షకులకు.. ఓ మంచి కామెడీ మూవీ చూడాలంటే మాత్రం ఈ సినిమా బెస్ట్ అని చెప్పి తీరాలి. ఫ్రెండ్స్ తో కలిసి చూస్తే ఈ సినిమా ఇంకాస్త కిక్ ఇస్తుంది. ఇప్పుడు ఈ సినిమా టాప్ 2 గా ట్రెండింగ్ లో నిలిచింది.

ఆవేశం :

ఫహద్ ఫాజిల్ నటించిన ఈ సినిమా థియేటర్స్ లో భారీ టాక్ సంపాదించుకుంది. దీనితో థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీ లోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూశారు. ఊహించినట్లుగానే ఈ సినిమా ఓటీటీ లో కూడా సత్తా చూపించి.. టాప్ 3 గా ట్రెండింగ్ లో నిలిచింది.

యోధ:

సిద్ధార్ధ్ మల్హోత్రా, రాశి ఖన్నా , దిశా పటాని కలిసి నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు అటు థియేటర్ లో డీసెంట్ టాక్ డీసెంట్ కలెక్షన్స్ ఎలా వచ్చాయో.. ఇటు ఓటీటీ లోను మంచి వ్యూవర్ షిప్ దక్కించుకుని.. టాప్ 4 గా ట్రెండింగ్ లో నిలిచింది.

ఫ్యామిలీ స్టార్ :

విజయ్ దేవర కొండ, రష్మిక కలిసి నటించిన ఈ సినిమాకు థియేటర్ లో ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాకపోయినా .. ఓటీటీ లో మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. దీనితో ఈ సినిమా ప్రస్తుతం టాప్ 5 గా ట్రెండింగ్ లో కొనసాగుతుంది.

తేరీ బాతోన్ మే ఐసా ఉల్ఝా జియా:

యాక్షన్, సస్పెన్స్, హారర్ కాకుండా కాస్త హార్ట్ ను లైట్ చేసుకోవాలంటే ఉన్న ఆప్షన్ రొ*మాంటిక్ మూవీస్. ఈ సినిమా కూడా అలాంటిదే. ఓ మంచి రొ*మాంటిక్ లవ్ స్టోరీ చూడాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం టాప్ 6 గా ట్రెండింగ్ లో ఉంది.

కృష్ణమ్మ:

ఈ సినిమా టాప్ 10 ట్రెండింగ్ మూవీస్ లో ఒకటిగా నిలుస్తుందని ఎవరు ఊహించి ఉండరు. చిన్న సినిమాగా థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా డీసెంట్ టాక్ నే సంపాదించుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీ లో కూడా ఇటీవల విడుదలయ్యి.. అప్పుడు టాప్ 7 స్థానాన్ని దక్కించుకుంది.

ది ఐడియా ఆఫ్ యు :

ఈ సినిమా కూడా కాస్త రొ*మాంటిక్ జోనర్ కు సంబంధించిందే. కానీ అన్నిటికంటే కాస్త డిఫ్ఫరెంట్ ఫీల్ ను ఇస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా టాప్ 8 గా ట్రెండింగ్ లో ఉంది.

గీతాంజలి మళ్ళీ వచ్చింది :

థియేటర్ లో ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ తెచ్చుకోలేకపోయినా కూడా.. ఓటీటీ లో మాత్రం అదరగొట్టేస్తుంది. మంచి కామెడీ హర్రర్ సినిమాను చూడాలంటే ఈ సినిమా బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాలి. ఈ సినిమా ప్రస్తుతం టాప్ 9 గా ట్రెండింగ్ లో ఉంది.

కలియుగ పట్టణంలో :

ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చి వారం రోజులు కూడా కాకముందే.. అప్పుడే టాప్ 10 లో స్థానాన్ని సంపాదించుకుంది. ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూడాలంటే మాత్రం ఈ సినిమా బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాలి. ఈ సినిమా ప్రస్తుతం టాప్ 10 గా ట్రెండింగ్ లో ఉంది.

మరి ఈ సినిమాలలో మీరు ఏ సినిమాలనైనా మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి