iDreamPost

ఒకప్పుడు రూ.1500 జీతం ఇప్పుడు ఒక్క సినిమాకు 12 కోట్లు.. ఈ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

  • Published Jun 18, 2024 | 2:06 PMUpdated Jun 18, 2024 | 2:06 PM

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో కనిపెట్టారా.. ఈమె ఒకప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత. ముఖ్యంగా నాలుగు పదుల వయసు దాటుతున్న కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీగా నిలుస్తున్న ఈ అందాలా తార ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో కనిపెట్టారా.. ఈమె ఒకప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత. ముఖ్యంగా నాలుగు పదుల వయసు దాటుతున్న కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీగా నిలుస్తున్న ఈ అందాలా తార ఎవరో గుర్తుపట్టారా..?

  • Published Jun 18, 2024 | 2:06 PMUpdated Jun 18, 2024 | 2:06 PM
ఒకప్పుడు రూ.1500 జీతం ఇప్పుడు ఒక్క సినిమాకు 12 కోట్లు.. ఈ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

స్టార్ డమ్.. ఇది ఎవరికి ఉరికే రాదు. ఎందుకంటే.. ఏ నటులుకైనా ఈ ట్యాగ్ పేరుకు ముందు వచ్చిందంటే దీని వెనుక ఎన్నో కష్టలు, అవమానాలు, అర్థిక ఇబ్బందులు, మరెన్నో సవాలు ఎదుర్కొని ఆ స్థాయికి చేరుతారు. అసలు నటులుగా గుర్తింపు తెచ్చుకోవడం ఒక ఎత్తు అయితే.. స్టార్ స్టేటస్ ను సంపాదించుకోవడం చాలా కీలకమైన అంశం. ఎందుకంటే.. ఈ సిని ప్రపంచంలో సక్సెస్ వెంటే.. స్టార్ డమ్ ఉంటుంది. మరి అలాంటి స్టార్ డమ్.. ఎన్ని కష్టలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరో, హీరోయిన్లు ఒకప్పుడు నటులుగా కెరీర్ స్టార్ట్ చేసినముందు అతి తక్కువ వేతనంతో మొదలైన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో పై ఫోటోలో కనిపిస్తున్న ఈ బ్యూటీ కూడా ఒకరు. పై ఫోటోలో కనిపిస్తున్నఈ స్టార్ హీరోయిన్ ఒకప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత. ముఖ్యంగా నాలుగు పదుల వయసు దాటుతున్న కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీగా నిలుస్తున్న ఈ అందాలా తార ఎవరో గుర్తుపట్టారా.. ఈమె నటికాక ముందు ఒక మోడల్ కావడం విశేషం.

ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ఆమె మరెవరో కాదు..మాజీ విశ్వ సుందరి ‘ఐశ్వర్య రాయ్’. ఈ పేరు గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. ముఖ్యంగా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఈమె సినీ ప్రపంచన్నే ఓ ఊపు ఊపేసింది. అయితే ఈమె మొదటగా 1992లో మోడలింగ్ చేసింది. కాగా,  అప్పట్లో ఒక్క షూట్ కోసం ఐశ్వర్య రూ.1500 తీసుకునేదట. కానీ, ఆ తర్వాత 1994లో మిస్ వరల్డ్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి.. విజేతగా నిలిచింది. ఇక అక్కడికి   మూడేళ్లకు డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ‘ఇరువర్’ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక ఆ తర్వాత..  అదే ఏడాదికి ‘ఔర్ ప్యార్ హో గయా’ సినిమాతో హిందీ మూవీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

అయితే అప్పటిలో అందాల పోటీలో పాల్గొనే ముందు నాలుగు సినిమా ఆఫర్లు వచ్చాయని ఐశ్వర్యరాయ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన విసయం తెలిసిందే.కానీ, మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనడానికి వాటిని రిజెక్ట్ చేసినట్లు చెప్పుకొచ్చింది. ఇక ఆ తర్వాత సల్మాన్ సరసన ‘హమ్ దిల్ దే చుకే సనమ్‌’ సినిమాలో నటించిన ఐశ్వర్యకు ఆ సినిమా కెరీర్ మలుపు తిప్పిందనే చెప్పవచ్చు. ఇక మరొ పక్క మణిరత్నం దర్శకత్వం వహించిన సినిమా కూడా పెద్ద సూపర్ హిట్ కావడంతో.. సౌత్ ఇండస్ట్రీలోనూ ఈ అందాల ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ ఏర్పడింది.

ఈ క్రమంలోనే వరుస ఆఫర్స్ అందుకుంటున్న ఐశ్వర్యకు డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన జీన్స్ సినిమాలో అవకాశం వచ్చింది. ఇక అప్పటిలో ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకోవడంతో.. అప్పట్లోనే పాన్ ఇండియా సెలబ్రెటీగా  ఫేమస్ అయ్యింది ఐశ్వర్య. ఇలా ఎన్నో సినిమాలు, వాణిజ్య ప్రకటనలలో కనిపించిన ఐశ్వర్య.. ఇప్పటికీ సినిమాల్లో అలరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం ఆమె ఒక్క సినిమాకు రూ.12 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ముంబైలో ఆమెకు రూ.21 కోట్ల విలువైన భవనం కలిగి ఉంది. ఇప్పటివరకు దాదాపు రూ.776 కోట్ల ఆస్తిని సంపాదించిందని సమాచారం.  ఇక బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకుంది ఐశ్వర్య. ప్రస్తుతం వీరికి ఆరాధ్య అనే కూతురు ఉంది.  మరి అతి తక్కువ వేతనంతో మొదలై ఇప్పుడు ఒకొక్క సినిమాకు కోట్లు తీసుకుంటున్న ఈ హీరోయిన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి