69వ నేషనల్ అవార్డ్స్ లో టాలీవుడ్ మూవీస్ సత్తా చాటాయి. పుష్ప మూవీలో నటనకు గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక బన్నీతో పాటుగా మరికొంత మంది టాలీవుడ్ టెక్నీషియన్స్ కు అవార్డులు వచ్చాయి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం ఏంటంటే? నేషనల్ అవార్డు విన్నర్స్ కు ఇచ్చే ప్రైజ్ మనీ ఎంత? డబ్బులతో పాటుగా విజేతలకు ఇంకేం ఇస్తారు? అంటూ సోషల్ మీడియాలో సెర్చింగ్ మెుదలైంది. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించింది. 2021 సంవత్సరానికి గాను ఈ అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుల్లో టాలీవుడ్ తన జోరు చూపించింది. బెస్ట్ యాక్టర్ తో పాటుగా పలు విభాగాల్లో అవార్డులను కొల్లగొట్టింది. కాగా.. నేషనల్ అవార్డు విన్నర్స్ కు మనీతో పాటుగా ఇంకా ఏమేం ఇస్తారు అని నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. విజేతలకు ఏమిస్తారో ఇప్పుడు చూద్దాం. నేషనల్ అవార్డు అందుకున్న విజేతలకు స్వర్ణ కమలం, రజత కమలంతో పాటుగా డబ్బును కూడా ఇస్తారు. వీటితో పాటుగా ప్రశంసా పత్రాన్ని కూడా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం.
అయితే జ్యూరీ అభినందనలు పొందిన చిత్రాలకు కేవలం ప్రశంసా పత్రం మాత్రమే అందిస్తారు. ఇక జ్యూరీ స్పెషల్ విజేతలకు ప్రశంసా పత్రంతో పాటుగా మనీ కూడా ఇస్తారు. కాగా.. జాతీయ ఉత్తమ నటుడు, నటిగా ఎంపికైన అల్లు అర్జున్, అలియా భట్, కృతి సనన్ లకు ఒక్కొక్కరికి రూ. 50 వేల ప్రైజ్ మనీతో పాటు రజత కమలాన్ని అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. బెస్ట్ మూవీగా ఎంపికైన రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్ చిత్రానికి స్వర్ణ కమలంతో పాటుగా రూ. 2.50 లక్షల నగదు బహుమతి ఇస్తారు.
ఇక ఉత్తమ వినోదాత్మక చిత్రంగా ఎంపికైన ఆర్ఆర్ఆర్ మూవీకి రూ. 2 లక్షలతో పాటుగా స్వర్ణ కమలాన్ని అందజేయనున్నారు. బెస్ట్ డైరెక్టర్ అవార్డు గెలుచుకున్న నిఖిల్ మహాజన్ (గోదావరి మరాఠ మూవీ)కు రజత కమలంతో పాటుగా రూ. 2.50 లక్షల నగదు బహుమతిని ఇస్తారు. ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రంగా ఎంపికైన ది కశ్మీర్ ఫైల్స్ కు రజత కమలంతో పాటుగా రూ. 1.50 లక్షల డబ్బు ఇస్తారు. చివరిగా స్పెషల్ జ్యూరీ అవార్డుకు ఎంపికైన షేర్షా మూవీకి రజత కమలాన్ని, రూ. 2 లక్షల నగదును కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.
ఇదికూడా చదవండి: ఫోటోలు చూసి రేటు అడుగుతున్నారు.. లియో నటి ఆవేదన!