iDreamPost
android-app
ios-app

ఫోటోలు చూసి రేటు అడుగుతున్నారు.. లియో నటి ఆవేదన!

  • Author ajaykrishna Published - 01:08 PM, Sat - 26 August 23
  • Author ajaykrishna Published - 01:08 PM, Sat - 26 August 23
ఫోటోలు చూసి రేటు అడుగుతున్నారు.. లియో నటి ఆవేదన!

ఏ రంగంలోనైనా.. ఎవరికైనా.. ఫామ్ లో ఉన్నప్పుడు దక్కే గౌరవ మర్యాదలు వేరు. ఫామ్ కోల్పోయినప్పుడు లేదా ఆ రంగాన్ని వదిలేసినప్పుడు లభించే మర్యాదలు వేరుగా ఉంటాయి. ఇది ఎవరి లైఫ్ లో అయినా మామూలే. కానీ.. ఫామ్ లో ఉన్నా, లేకపోయినా అవమానించకూడదు అనేది గ్రహించాల్సిన విషయం. లైఫ్ లో తప్పులు అందరు చేస్తారు. ఆ తర్వాత చేసిన తప్పుల నుండి జీవితపాఠాలు నేర్చుకుంటారు. అప్పటినుండి రియల్ లైఫ్ ని ఫ్రెష్ గా ఆరంభించే అవకాశం ఉంటుందని చెబుతుంటారు. ప్రస్తుతం సీనియర్ నటి కిరణ్ రాథోడ్.. కెరీర్ ఫామ్ లో ఉన్నప్పుడు ఓ పెద్ద తప్పు చేశానని, దాని వల్లే ఇండస్ట్రీలో లైఫ్ నాశనం అయ్యిందని చెబుతోంది.

హీరోయిన్ గా కిరణ్ రాథోడ్.. ఇటు తెలుగు, అటు తమిళ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. నువ్వులేక నేను లేను, భాగ్యలక్ష్మి బంపర్ డ్రా, అందరు దొంగలే దొరికితే, హై స్కూల్ లాంటి సినిమాలతో పాటు.. జెమినీ, అన్బె శివమ్ లాంటి సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఓవైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే.. స్పెషల్ సాంగ్స్ లోను ఆడిపాడింది. అలా హిందీలో కూడా యాదే, జానీ దుష్మన్, బి కేర్ఫుల్ లాంటి సినిమాలో మెరిసింది. కానీ.. ఎక్కడ కూడా సరైన స్టార్డమ్ అందుకోలేకపోయింది. అయితే.. 2016 వరకు సినిమాలు చేసిన కిరణ్.. ఆ తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైంది. కానీ.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంది.

ఈ క్రమంలో ఒక్కోసారి కిరణ్.. బికినీ ఫోటోలు పెట్టి సర్ప్రైజ్ చేస్తుంటుంది. ఇన్నాళ్లు సినిమాలు లేకపోయినా తన గ్లామర్ షోతో ఆకట్టుకున్న ఈ భామ.. ఇప్పుడు దళపతి విజయ్ ‘లియో’ మూవీతో రీఎంట్రీకి రెడీ అవుతోంది. కిరణ్ బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ కి కజిన్ సిస్టర్. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరణ్.. తన కెరీర్ గురించి, లైఫ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకుంది. కిరణ్ మాట్లాడుతూ.. గతంలో ఒకరిని ప్రేమించి పెద్ద తప్పు చేశాను. ఆ పొరపాటు వల్ల కెరీర్ పోగొట్టుకున్నాను. లేదంటే నా లైఫ్ వేరేలా ఉండేది. కొందరు కావాలని నన్ను ఇండస్ట్రీకి దూరం చేశారు. కానీ.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటున్నాను. ఒక్కోసారి నేను బికినీ ఫోటోలు పెడితే.. నీ రేటు ఎంత? అని అడుగుతున్నారు. అలాంటి కామెంట్స్ చూసినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది.” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కిరణ్ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి కిరణ్ రాథోడ్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

jojobet girişJojobet GirişBetcioivermectin tabletMadridbetMadridbetPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişJojobet GirişHoliganbetMarsbahis