iDreamPost

హనుమాన్ OTT రిలీజ్ వాయిదాపై నోరు విప్పిన డైరెక్టర్.. రిక్వెస్టులు పెడుతోన్న నెటిజన్లు

ప్రశాంత్ వర్మ- తేజ కాంబోలో వచ్చిన హనుమాన్ ఎంతటి ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం.. ఓటీటీకి రావడంలో ఆలస్యం చోటుచేసుకుంటోంది. దీనిపై డైరెక్టర్..

ప్రశాంత్ వర్మ- తేజ కాంబోలో వచ్చిన హనుమాన్ ఎంతటి ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం.. ఓటీటీకి రావడంలో ఆలస్యం చోటుచేసుకుంటోంది. దీనిపై డైరెక్టర్..

హనుమాన్ OTT రిలీజ్ వాయిదాపై నోరు విప్పిన డైరెక్టర్.. రిక్వెస్టులు పెడుతోన్న నెటిజన్లు

చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీసును దున్నేసిన చిత్రం హనుమాన్. డేరింగ్ అండ్ డైనమిక్ అండ్ టాలెంట్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ- యంగ్ హీరో తేజ సజ్జా కాంబోలో వచ్చిన ఈ పాన్ ఇండియా చిత్రం సంక్రాంతి బరిలో దిగి గ్రాండ్ సక్సెస్ అందుకుంది. రూ. 40 కోట్ల బడ్జెట్ తో రూపొందిన హనుమాన్.. రూ. 350 కోట్ల వసూళ్లను రాబట్టుకుంది. అంతేకాదూ.. ఇటీవల కాలంలో 50 రోజుల పాటు థియేటర్లలో సక్సెస్ ఫుల్‌గా రన్ అయిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా.. జై హనుమాన్ తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. దీనికి సంబంధించిన వర్క్‌లో ఫుల్ బిజీ అయిపోయారు. అయితే హనుమాన్ ఓటీటీ రిలీజ్ కోసం ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్.

ఇటీవల కాలంలో సాధారణంగా ఓ చిత్రం థియేటర్లలో విడుదలవ్వగానే.. నెల రోజుల్లోపే ఓటీటీల్లో సందడి చేస్తోంది. మహా అయితే నెల తర్వాత వారం, పది రోజుల్లోనే వచ్చేస్తున్నాయి. కానీ హనుమాన్ విషయంలో మాత్రం రాలేదు. ఇదిగో అప్పుడు.. ఇదిగో ఇప్పుడు అంటూ వార్తలు వచ్చాయి. చివరకు మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న రాబోతుందంటూ న్యూస్ షికార్లు చేశాయి. కానీ రాలేదు. మార్చి 15 కూడా అనుకున్నారు. అయినా ఎంట్రీ ఇవ్వలేదు. ఓటీటీ హక్కులను జీ 5 కొనుగోలు చేసింది. అయితే ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందంటూ ఈ ఓటీటీ సంస్థను కూడా నెటిజన్లు ప్రశ్నించడంతో.. తమకు కూడా తెలియదంటూ చేతులు ఎత్తేసింది. దీంతో ప్రశాంత్ వర్మను ట్యాగ్ చేస్తూ ప్రశ్నలు సంధించారు. ఎట్టకేలకు దర్శకుడు స్పందించాడు.

‘హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్ వాయిదా ఉద్దేశపూర్వగా చేస్తున్నది కాదు. వీలైనంత త్వరగా మీ ముందుకు తీసుకు వచ్చేందుకు మా టీమ్ అహర్నిశలు పనిచేస్తోంది. మీకు ఎప్పుడూ బెస్ట్ ఇవ్వాలన్నదే మా ఉద్దేశం. దయచేసి అర్థం చేసుకోండి. మద్దతు తెలుపుతున్న వారికి ధన్యవాదాలు’ అంటూ పోస్టు చేశారు. దీంతో ప్రశాంత్ వర్మపై రిక్వెస్టులు పెడుతున్నారు నెటిజన్లు. కనీసం డేట్ చెప్పండని, ఆ చివరకు క్లైమాక్స్ పార్ట్ ఒక్కటైనా రిలీజ్ చేయండని రిక్వెస్టు చేస్తున్నారు. ‘బ్రో ఎక్స్ టెండెడ్ వర్సన్.. ఒక 4 అవర్స్ లెంథ్ పెట్టుకో నో ప్రాబ్లమ్’ అంటూ సపోర్టు చేస్తున్నారు. ఇంకొంత మందైతే.. జీ5 తెలుగు ఇవ్వకండని రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం.. అదే సమయంలో ఇంట్రస్ట్ పోతుంది.. టేక్ యువర్ టైం బ్రో అంటూ రాస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి