iDreamPost
android-app
ios-app

‘గేమ్ ఛేంజర్’ సాంగ్ లీక్ పై దిల్ రాజు సీరియస్.. వారిపై క్రిమినల్ కేసు!

  • Author Soma Sekhar Published - 09:26 PM, Sat - 16 September 23
  • Author Soma Sekhar Published - 09:26 PM, Sat - 16 September 23
‘గేమ్ ఛేంజర్’ సాంగ్ లీక్ పై దిల్ రాజు సీరియస్.. వారిపై క్రిమినల్ కేసు!

ఇండస్ట్రీకి ప్రధాన సమస్యలుగా మారాయి పైరసీ, లీకులు. చిత్ర యూనిట్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా గానీ.. ఈ పైరసీ, లీకులు ఆగడం లేదు. తాజాగా రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ నుంచి ‘జరగండి జరగండి’ అనే సాంగ్ ఆన్ లైన్ లో లీకైంది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ప్రస్తుతం నెట్టంట వైరల్ గా మారింది. ఇక ఈ సాంగ్ లీక్ పై ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాటను లీక్ చేసిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాడు దిల్ రాజు. అదీకాక సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను కోరాడు.

రామ్ చరణ్-కియారా అద్వానీ జంటగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటున్న క్రమంలో.. ఈ సినిమాలోని ‘జరగండి జరగండి’ అనే సాంగ్ లీకైంది. ప్రస్తుతం ఈ పాట ఆన్ లైన్ లీకై ట్రెండింగ్ లో సైతం ఉంది. ఇక ఈ సాంగ్ లీక్ పై నిర్మాత దిల్ రాజు సీరియస్ అయ్యారు. పాటను లీక్ చేసిన వారిపై సైబర్ క్రైమ్ పోలీసుకు ఐపీసీ సెక్షన్ 66(C) కింద ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలోనే సాంగ్ ను లీక్ చేసిన వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు దిల్ రాజు. అంతేకాకుండా లీకైన పాటను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు దిల్ రాజు. అయితే డైరెక్టర్ శంకర్ తన సినిమాలో పాటలను వైవిధ్యంగా ఉండేలా ప్లాన్ చేస్తాడు. ప్రతి మూవీలో ఒక పాట అద్బుతంగా తెరకెక్కిస్తాడు. కాగా.. గేమ్ ఛేంజర్ లో ఒక పాటను రూ. 15 కోట్లతో తెరకెక్కిస్తున్నారని వార్త వినిపించింది. ఆ పాట ఇదేనా? అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

Jojobet GirişmeritbetholiganbetKavbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetholiganbetMadridbetMadridbetcasibom girişbetkare girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/pokerklascasibomholiganbet girişholiganbet girişMarsbahis GüncelMarsbahis Güncel GirişHoliganbet GirişHoliganbet Güncel GirişMarsbahis GirişMarsbahis Güncel Giriş