iDreamPost
android-app
ios-app

ఏపీలో డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్.. దేశంలో తొలిసారిగా..!

ఏపీలో డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్.. దేశంలో తొలిసారిగా..!

మనం ఎప్పుడైనా రోడ్డుపై ట్రాఫిక్ పోలీసులకు దొరికినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ అడిగినప్పుడు ఇంట్లో మరిచిపోయామని ఇలా ఎన్నో స్టోరీలు చెప్పి అక్కడి నుంచి జారుకుంటాం. ఇదే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ నిజంగా ఎక్కడైనా పడిపోతే అప్పుడు పడే ఇబ్బందులు అంతా ఇంతా కావు. ఇక వీటన్నిటికి స్వస్తి పలుకుతోంది ఏపీ ప్రభుత్వం. అవును, మీరు విన్నది నిజమే. మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ ప్రపంచం వైపు అడుగులు వేస్తూ ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్ పత్రాల్లో కాకుండా డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్ లు ఇవ్వనున్నట్లు తాజాగా ప్రకటించింది ఏపీ రాష్ట్ర రవాణా శాఖ.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న డిజిటల్ ఆర్సీ కార్డుల నిర్ణయాన్ని స్వాగతించడమే కాకుండా తాజాగా డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్ లు ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చింది. ఇలా డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్ ను విధానాన్ని తీసుకురావడం దేశంలో మొదటిసారిగా ఏపీనే కావడం విశేషం. ఈ డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ జారీల ప్రక్రియ ఈ శనివారం నుంచి ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ తెలిపింది. ఈ డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్ ను డిజి లాకర్ లేక ఎం-పరివాహన్ అనే మొబైల్ అప్లికేషన్ లో అందుబాటులోకి తీసుకు రానున్నారు. ఇక నుంచి గతంలో మాదిరి కార్డు దరఖాస్తు కోసం రూ. 200, పోస్టల్ చార్జీలకు రూ.35 వసూలు చేయరు. ఈ డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్ విధానం రానుండడంతో వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకపోగా, అందరికీ సౌలభ్యంగా ఉండనుందని ఏపీ రాష్ట రోడ్డు రవాణా శాఖ కమిషనర్ ఎం. కే సిన్హా తెలిపారు.

ఇది కూడా చదవండి: వ్యవస్థను ప్రజల గడపకు చేర్చిన నేత సీఎం జగన్: సజ్జల