iDreamPost

వ్యవస్థను ప్రజల గడపకు చేర్చిన నేత సీఎం జగన్: సజ్జల

వ్యవస్థను ప్రజల గడపకు చేర్చిన నేత సీఎం జగన్: సజ్జల

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం అమలుతో సరికొత్త చరిత్ర సృష్టించిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ప్రజల గడప వద్దకే ప్రభుత్వ సుపరిపాలన తీసుకెళ్లాలన్న లక్ష్యంతో చేపట్టిన “జగనన్న సురక్ష” కార్యక్రమం సీఎం జగన్ మానస పుత్రికగా నిలిచిందని ఆయన తెలిపారు. నెల రోజులపాటు జగనన్న సురక్ష కార్యక్రమం విజయవంతగా కొనసాగిందింది. గురువారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడి సమస్య, అవసరాలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు జగనన్న సురక్ష ప్రోగ్రామ్ తీసుకొచ్చారని సజ్జల తెలిపారు.

గురువారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జగనన్న సురక్ష కార్కక్రమం గురించి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ ఆయన మాట్లాడుతూ..”అర్హులైన ఏ ఒక్కరూ లబ్దిపొందకుండా ఉండిపోరాదన్న లక్ష్యంతో.. అర్హులైన ప్రతి పౌరుడికి పథకాలను 100శాతం సంక్షేమ పథకాలు ఇవ్వాలనే ఉద్దేశంతో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సీఎం జగన్‌ తీసుకొచ్చారు. జగనన్న సురక్ష కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. సీఎం జగన్‌ ‘చెప్పాడంటే – చేస్తాడంతే’ అని నమ్మకాన్ని ఈ కార్యక్రమం ద్వారా రుజువైంది” అని ఆయన తెలిపారు. తొలిసారి ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం విజయవంతమైనందున ఏటా రెండు పర్యాయాలుగా సురక్ష కార్యక్రమం నిర్వహించే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారని ఆయన అన్నారు.

ఇదే సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కూడా సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. వరదల విషయంలో చంద్రబాబు ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేస్తున్నారన్నారు. అమరావతిలో భూములు చాలా మంది చేతులు మారాయని సజ్జల అన్నారు. పేదల పక్షపాతి సీఎం జగన్‌ అని.. పెట్టుబడిదారులకు లబ్ది చేకూర్చాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడన్నారు. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. పులివెందుల పులి సునీత అని చంద్రబాబు అన్నప్పుడే దాని వెనుక ఉన్న అర్థం ఏమిటో అర్థమైందని సజ్జల తెలిపారు. పులివెందులలోనే కాదు రాష్ట్రంలో చంద్రబాబు మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరంటూ సజ్జల అన్నారు. మరి.. సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వరద బాధిత ప్రాంతాల్లో నేను పర్యటిస్తాను: సీఎం జగన్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి