iDreamPost

కరోనా వైరస్ దెబ్బకి ఆంధ్రా లో మిర్చి రైతులు విలవిలా

కరోనా వైరస్ దెబ్బకి ఆంధ్రా లో మిర్చి రైతులు విలవిలా

ఎక్కడో చైనా లో కరోనా వైరస్ ప్రబలితే ప్రత్యేకంగా ఇక్కడ మన ఆంధ్ర ప్రదేశ్ లో రైతులకి వచ్చిన ఇబ్బంది ఏమిటనుకుంటున్నారా ?? కానీ ఇది నిజం. ఒకపక్క కరోనా వైరస్ విజృంభణతో చైనా అతలాకుతలం అవడంతో పాటు ఈ ప్రభావం చైనా ఆర్ధిక వ్యవస్థ మీద కూడా చాలా బలంగా పడింది. దీనితో చైనా ఎగుమతులు దిగుమతులపై కూడా ఈ కరోనా వైరస్ ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుంది. గత 15 రోజుల నుండి ఇతర దేశాలతో వాణిజ్య కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయాయి.

Read Also: కరోనాను భారత్ అడ్డుకోగలదా ?

ఈ నేపథ్యంలో చైనాలో ప్రభలిన కరోనా వైరస్ ప్రభావంతో ఇతర దేశాలనుండి చైనా కు మిర్చి దిగుమతులు నిలిచిపోయ్యాయి. సాధారణంగా ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ లో పండిన మిర్చి పంట గుంటూరు మిర్చి యార్డ్ కి భారీగా వస్తుంది. వ్యాపారులు గుంటూరు మిర్చి యార్డ్ లో కొనుగోలు చేసిన మిర్చిని చైనా, వియాత్నం, మలేషియా, థాయిలాండ్, మెక్సికో దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అయితే ఈ ఎగుమతుల్లో అగ్రభాగం మాత్రం చైనా దేశానిదే. గుంటూరులో పండే తేజా రకం మిర్చికి చైనా దేశంలో ఉన్న భారీ డిమాండ్ దృష్యా ప్రతి సంవత్సరం ఈ ఒక్క దేశానికే 60% నుండి 70% మిర్చి ఎగుమతి చేస్తున్నారు.

చైనా దేశానికి ఎగుమతుల్లో భారీగా కోత పడడంతో ఆ ప్రభావం గుంటూరు యార్డ్ మీద పడింది. దీనితో గత పది రోజులనుండి గుంటూరు మిర్చి యార్డులో మిర్చి ధరలు దారుణంగా పతనమైయ్యాయి. జనవరి ఆరంభంలో 20 వేలు పలికిన క్వింటాల్ మిర్చి ధర ఇప్పుడు హఠాత్తుగా 10 వేలకు పడిపోయింది. దీనితో ఒక్క సారిగా ధరలు పతనమవ్వడంతో భారీగా పెరిగిన సాగు ఖర్చుతో గిట్టుబాటు ధర లభించక మిర్చి రైతులు లబోదిబోమంటున్నారు.

Read Also: భారత్ లోకి ప్రవేశించిన కరోనా వైరస్

గుంటూరు మార్కెట్ యార్డు కి గత వారం నుండి నిత్యం 40 వేల బస్తాల పంట వస్తుంది. ఈ రోజు గుంటూరు మిర్చి యార్డులో ధరలు చూస్తే తేజా రకం 10 వేల నుండి 12 వేలు, బ్యాడిగి రకం 11 వేల నుండి 14 వేలు, నెంబర్-5 రకం 11 వేల నుండి 13500, 334-సన్నం రకం 9 వేల నుండి 12500, 341 రకం 10 వేల నుండి 13 వేలు, దేవనూరు డీలక్స్ రకం 10 వేల నుండి 12 వేల ధర పలుకుతుంది. ఒకపక్క రోజురోజు కి పంట మార్కెట్ కి ఎక్కువగా వస్తున్న సమయంలో ఈ కరోనా వైరస్ ప్రభావం ఇదే విధంగా కొనసాగితే ముందుముందు ధరలు మరింత పతనమౌతాయని రైతులు, వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి