iDreamPost

కాంగ్రెస్‌ సీనియర్‌ నేతకు కరోనా

కాంగ్రెస్‌ సీనియర్‌ నేతకు కరోనా

కరోనా వైరస్ విజృంభణ యావత్ భారతదేశాన్ని గడగడలాడిస్తోంది. ఇది సామాన్యులు నుండి రాజకీయ నేతలూ, సెలబ్రిటీలూ, ఉన్నతాధికారుల వరకు అందరికీ ఎవరినీ వదలటం లేదు. వివిధ రాష్ట్రాల్లో మంత్రులకు కూడా కరోనా‌ సోకింది. తమిళనాడులోని డిఎంకె, పశ్చిమ బెంగాల్ లోని తృణముల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కరోనా బారినపడి మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కూడా‌ ఎమ్మెల్యేలకు, రాజకీయ నేతలకు కరోనా సోకింది.

ఇలా ఈ జాబితాలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అభిషేక్‌ మను సింఘ్వి చేరారు. ఆయన కరోనా వైరస్‌ బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. అయితే కరోనా వైరస్‌ లక్షణాలు స్వల్పంగానే ఉన్నట్టు సమాచారం.

ఆయన కార్యాలయంలో పనిచేసే వారందరికి కరోనా నెగిటివ్‌ వచ్చినట్లు తెలుస్తోంది. ఇంతక ముందు సీనియర్‌ కాంగ్రెస్‌ నేత సంజయ్‌ ఝ కూడా కరోనా వైరస్‌ బారిన పడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్‌ నేత వి. హనుమంతరావుకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. 

ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్రజైన్‌ కూడా కరోనా వైరస్‌ సోకడంతో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ప్లాస్మా థెరపీ చికిత్స చేశారు. ఇటీవలి ఆయనను మరోసారి పరీక్షించగా కరోనా నెగిటివ్‌గా తేలింది. దీంతో ఆయనను డిశార్జ్‌ చేయనున్నారు. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి