iDreamPost
android-app
ios-app

వీడియో: క్రికెట్ మ్యాచ్ లో గొడవ.. ఆరుగురికి గాయాలు!

వీడియో: క్రికెట్ మ్యాచ్ లో గొడవ.. ఆరుగురికి గాయాలు!

క్రికెట్ లో కొన్ని తప్పిదాల కారణంగా అప్పుడప్పుడ చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. దీంతో క్రికెటర్ లు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకుని ఆ తర్వాత సైలెంట్ అయిపోతారు. కానీ, తాజాగా జరిగిన ఓ క్రికెట్ లీగ్ లో మాత్రం.. అందులో పాల్గొన్న ఆటగాళ్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఇదంతా అక్కడున్న మ్యాచ్ చూడటానికి వచ్చిన క్రికెట్ అభిమానులు సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు. అదే వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి. ఇంతకు క్రికెట్ మ్యాచ్ లో గొడవ ఏంటి? ఎందుకు వాళ్లు అలా కొట్టుకున్నారంటే?

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బంగ్లాదేశ్ లో జరుగుతున్న సెలబ్రెటీ క్రికెట్ లీగ్ రసాభసాకు దారి తీసి మొత్తానికి ముగిసిపోయింది. అసలేం జరిగిందంటే? ప్రముఖ సినీ నిర్మాత ముస్తాఫా కమల్ రాజ్, దీపాంకర్ దీపన్ జట్లు పోటీ పడ్డాయి. అయితే అంపైర్ నిర్ణయం కారణంగా ఇరుజట్లలోని నటీనటులు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆ నటీనటుల మధ్య తోపులాట జరిగింది. ఇక ఇదే గొడవకు దారి తీయడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో కొందరు నటులు మాత్రం చేతిలో బ్యాట్ పట్టుకుని మరొక జట్టు ఆటగాళ్లపై దాడి చేయబోయారు. అయితే ఈ ఘటనలో ఆరుగురి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.

jojobet girişJOJOBET GİRİŞgamdomCasibomjojobetJojobet Giriş