iDreamPost

ATMలలో క్యాష్ విత్ డ్రా చేసేవారికి షాక్? పెరగనున్న క్యాష్ విత్ డ్రా ఛార్జీలు

ప్రస్తుత కాలంలో యూపీఐ ద్వారానే ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు యూజర్లు. ఏటీఎంలకు వెళ్లే వారి సంఖ్య తగ్గిపోయింది. అయితే ఏటీఎంల ద్వారా క్యాష్ విత్ డ్రా చేసే సయంలో పరిమితి దాటితే వసూలు చేసే ఛార్జీలను పెంచనున్నారు.

ప్రస్తుత కాలంలో యూపీఐ ద్వారానే ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు యూజర్లు. ఏటీఎంలకు వెళ్లే వారి సంఖ్య తగ్గిపోయింది. అయితే ఏటీఎంల ద్వారా క్యాష్ విత్ డ్రా చేసే సయంలో పరిమితి దాటితే వసూలు చేసే ఛార్జీలను పెంచనున్నారు.

ATMలలో క్యాష్ విత్ డ్రా చేసేవారికి షాక్? పెరగనున్న క్యాష్ విత్ డ్రా ఛార్జీలు

టెక్నాలజీలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు అనేక రంగాలను ప్రభావితం చేశాయి. అందుబాటులో ఉన్న సాంకేతికతతో ప్రజలకు సేవలు మరింత సులభమయ్యాయి. ముఖ్యంగా బ్యాంక్ సెక్టార్ లో కస్టమర్లకు సేవలు మరింత ఈజీగా మారాయి. బ్యాంకుకు సంబంధించిన పనులను ఖాతాదారులు ఆన్ లైన్ లోనే చేసుకునే వెసులుబాటు అందుబాటులో ఉంది. ట్రాన్సాక్షన్స్ అన్నీ యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారానే పూర్తి చేస్తున్నారు. ఒక వేళ క్యాష్ అవసరమైతే ఏటీఎంల ద్వారా తీసుకుంటున్నారు. అయితే ఏటీఎంల ద్వారా నగదు విత్ డ్రా చేసుకునే వారికి బిగ్ అలర్ట్. పరిమితికి మించిన క్యాష్ విత్ డ్రాలపై ఛార్జీలు పెరగనున్నాయి. ఎంత పెరగనున్నాయంటే?

ఏటీఎంలు వచ్చాక నగదు కోసం బ్యాంకుకు వెళ్లే వారి సంఖ్య తగ్గిపోయింది. ఎప్పుడంటే అప్పుడు ఏటీఎంలలో క్యాష్ తీసుకునే సౌకర్యం ఉండడంతో తమకు కావాల్సిన మొత్తాన్ని విత్ డ్రా చేసుకుంటున్నారు కస్టమర్లు. అయితే ఏటీఎంల ద్వారా నగదు విత్ డ్రా అనేది నిబంధనల ప్రకారం పరిమితికి మించితే ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఏటీఎం ఇంటర్ చేంజ్ ఫీజును రూ. 23కు పెంచాలని ది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ(సీఏటీఎంఐ) కోరింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ)కు విన్నవించింది.

బ్యాంకులు తమ కార్డు ద్వారా ఏటీఎంలో నగదు విత్ డ్రా చేసినప్పుడు ఇంటర్ ఛేంజ్ ఫీజును ఏటీఎం సర్వీస్ ప్రొవైడర్లకు చెల్లిస్తూ ఉంటాయి. ఏటీఎంతో నెలలో కొన్ని లావాదేవీలను ఉచితంగా చేసుకోవచ్చు. ఆ తర్వాత పరిమితి దాటితే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే కస్టమర్ల నుంచి వసూలు చేసే ఇంటర్ చేంజ్ ఫీజును పెంచాలని ఏటీఎం సర్వీస్ ప్రోవైడర్లు ప్రతిపాదనలు పెట్టాయి. ఇది అమల్లోకి వస్తే ఏటీఎం యూజర్ల జేబులకు చిల్లు పడనున్నది. అయితే ఏటీఎం ఇంటర్ ఛేంజ్ ఫీజు రూ. 15 ఉండగా.. దీన్ని 2021లో 17కి పెంచారు. గరిష్ఠ లిమిట్ 21 గా నిర్ణయించారు. తాజాగా ఈ ఫీజును 23కి పెంచాలని కోరుతున్నాయి ఏటీఎం సర్వీస్ ప్రొవైడర్లు. ఈ ప్రతిపాదనలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓకె చెబితే ఏటీఎంలలో నగదు విత్ డ్రా చేసుకునే వారికి అదనపు భారంగా మారనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి