Dharani
పేటీఎం కస్టమర్లకు కీలక అలర్ట్ జారీ చేసింది. వారి వాలెట్ సేవలను మరికొన్ని రోజుల్లో మూసివేయనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు..
పేటీఎం కస్టమర్లకు కీలక అలర్ట్ జారీ చేసింది. వారి వాలెట్ సేవలను మరికొన్ని రోజుల్లో మూసివేయనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు..
Dharani
నేటి కాలంలో డిజిటల్ పేమెంట్స్ బాగా పెరిగిపోయాయి. చేతిలో రూపాయి లేకున్నా సరే.. ఆన్‌లైన్‌లో పే చేస్తూ.. అవసరాలు తీర్చుకుంటున్నాం. రోడ్డు పక్క కొబ్బరి బొండాల షాప్ దగ్గర నుంచి పెద్ద పెద్ద మాల్స్ వరకు ప్రతి చోటా యూపీఐ సేవలు, ఆన్‌లైన్ చెల్లింపులు అందుబాటులో ఉన్నాయి. దాంతో బ్యాంకులకు వెళ్లే కస్టమర్ల సంఖ్య బాగా తగ్గిపోతుంది. ఏదో ముఖ్యమైన పనులైతే తప్ప.. మిగతా అవసరాలన్నింటిని ఆన్‌లైన్‌లోనే చక్కబెడుతున్నారు. పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌పేలతో పాటు అమెజాన్ వంటి ఈకామర్స్ సంస్థలు కూడా ఇలాంటి ఆన్‌లైన్ పేమెంట్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఈ క్రమంలో పేటీఎం కస్టమర్లకు కీలక అలర్ట్ జారీ చేసింది. వారికి సంబంధించి వాలెట్ సేవలను త్వరలోనే మూసివేయనున్నట్లు ప్రకటించింది. మరి ఇది ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది అంటే..
పేటీఎం కీలక ప్రకటన చేసింది. పేటీఎం బ్యాంక్ లిమిటెడ్, జీరో బ్యాలెన్స్, సంవత్సరం పైగా లావాదేవీలు లేని వాలెట్లను త్వరలోనే మూసివేయబోతున్నట్లు ప్రకటించింది. వీటిని జూలై 20, 2024న మూసివేయనున్నట్లు ప్రకటించింది. వెబ్‌సైట్ ప్రకారం, ఈ నిష్క్రియ పేటీఎం వాలెట్‌లను మూసివేయడానికి ముందు కస్టమర్లకు 30 రోజుల నోటీసు వ్యవధిని ఇవ్వనున్నారు. అయితే సంవత్సరం పాటు ఎలాంటి లావాదేవీలు జరగని జీరో బ్యాలెన్స్‌తో కూడిన వాలెట్లను మాత్రమే మూసివేస్తామని పేటీఎం ప్రకటించింది. ఈ విషయమై పేటీఎం పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ తన అధికారిక వెబ్‌సైట్‌లో జూన్ 19, 2024న పోస్ట్ చేసింది.
ఈ నేపథ్యంలో మీ పేటీఎం వాలెట్‌లో డబ్బులుంటే.. ఎలాంటి లిమిట్ లేకుండా వాటిని వినియోగించుకునే అవకాశం కల్పిస్తోంది. వాలెట్‌లో మొత్తాన్ని మీరు వేరే బ్యాంక్ అకౌంట్‌కు బదిలీ చేసుకోవచ్చు. ఏవైనా చెల్లింపులకు కూడా వాడుకోవచ్చు. వాలెట్‌లో ఉన్న పూర్తి నగదును వాడుకునే వరకు అది పని చేస్తుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్.. తన తాజా నిర్ణయం మేరకు.. ఏడాది కాలం నుంచి జోరో బ్యాలెన్స్‌గా ఉన్న వాలెట్లను మాత్రమే మూసివేయనుంది. కనుక పేటీఎం వాలెట్‌ను తరచుగా వినియోగించే కస్టమర్లు ఈ నిర్ణయం పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పుకొచ్చింది.
అలానే మీ వాలెట్‌ను మీరే క్లోజ్ చేయడానికి అనుమతి ఉంది. ఆర్‌బీఐ మార్చి 15, 2024 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతా, వాలెట్‌కు సంబంధించి కొత్త డిపాజిట్లను స్వీకరించకుండా, క్రెడిట్ లావాదేవీలను జరపకుండా నియంత్రిస్తూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దాంతో అప్పటి నుంచి వీటిల్లో డబ్బును డిపాజిట్ చేసే అవకాశం లేకుండా పోయింది. కానీ అప్పటికే వాలెట్‌లో ఉన్న నగదును వాడుకోవడానికి ఎలాంటి పరిమితులు విధించలేదు.