iDreamPost

చంద్రబాబు మంచిని కాదు.. ఎల్లో మీడియాను నమ్ముకున్నాడు: CM జగన్

చంద్రబాబు మంచిని కాదు.. ఎల్లో మీడియాను నమ్ముకున్నాడు: CM జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాలో పర్యటించారు. డోన్ నియోజకవర్గంలోని లక్కసాగరం పంప్ హౌస్ నుంచి నీటిని విడుదల చేశారు. 10,394 ఎకరాలకు సాగునీరందించే ఈ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. హంద్రీనీవా ప్రధాన కాలువ నుంచి చెరువులకు నీటి కేటాయింపు చేస్తారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేసేలా సీఎం జగన్ చర్యలు తీసుకున్నారు. లక్కసాగరం పంప్ హౌస్ అనంతరం డోన్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయలసీకు వైఎస్సార్ సీపీ  ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి వివరించారు. అలానే ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు పై తీవ్ర స్థాయిలో విరుచకపడ్డారు. ఆయన ప్రజలను మోసం చేయడమే పనని సీఎం జగన్ అన్నారు.

కర్నూలు జిల్లా డోన్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ కీలక అంశాలను ప్రసంగించారు. సీఎం జగన్ మాట్లాడుతూ…” ఈరోజు ఒకవైపున పండుగ, మరోవైపున మీ అందరి ప్రేమాభిమానాల మధ్య ఈ కార్యక్రమం దేవుడి దయతో ఇక్కడ జరుపుకుంటున్నాము. మనందరి ప్రభుత్వం నీటి విలువ తెలిసిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం, వారి శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తుంది. నీటి విలువ, సీమ కష్టాలు తెలిసిన ప్రభుత్వం మనది. నేడు ప్రారంభించిన ప్రాజెక్టు వల్ల డోన్, పత్తికొండ నియోజకవర్గాల్లో మేలు జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ను రూ.253 కోట్లతో పూర్తి చేశాము. మీ బిడ్డగా ఈ నాలుగు ఏళ్ల పరిపాలన అంతా కూడా శాశ్వతమైన మార్పు తీసుకొనిరావాలనే  ఉద్దేశంతో అడుగులు వేయడం  జరిగింది.  లక్కసాగరం వద్ద పంప్ హౌస్ ఏర్పాటు చేసి.. నేడు 77 చెరువులు నింపే కార్యక్రమం జరిగింది. రోజుకు 160 క్యూసెక్కులు చొప్పున 90 రోజుల్లో 1.24 టీఎంసీల నీళ్లు నింపేట్లుగా కార్యక్రమం మొదలవుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే  మిగిలిన ప్రాజెక్టుల పూర్తికి చర్యలు తీసుకుంటాము” అని సీఎం జగన్ అన్నారు.

ఇదే సందర్భంగా ప్రతిపక్షనేత చంద్రబాబుపై సీఎం జగన్ ఫైర్ అయ్యారు. “గతంలో చంద్రబాబు హయాంలో ఇదే కార్యక్రమం ఎందుకు జరగలేదు. మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతున్నాడు. చంద్రబాబు ప్రజలను నమ్ముకోలేదు. చంద్రబాబు నమ్ముకున్నది ప్రజలకు మంచి చేయాలని కాదు. ఆయన నమ్ముకుంది ఎల్లో మీడియాను దత్తపుత్రుడిని. వీళ్లు రాష్ట్రాన్ని దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం చంద్రబాబు చేస్తున్నారు. అలా పంచుకుంటే ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడు. ఎల్లో మీడియా చూపించకపోగా చంద్రబాబు కోసం డంక బజాయిస్తుంది. చంద్రబాబు ఎంత దారుణంగా పాలన చేసినా బ్రహ్మాండగా చేశాడని చేప్పే కార్యక్రమం జరుగుతుంది. కానీ మీ బిడ్డ హయాంలో ఈ రోజు గమనించమని మిమ్మలని అడుగుతున్నాను. రాజకీయాలు, పార్టీలు చూడటం లేదు. లంచాల వివక్ష లేదు” అని సీఎం జగన్ తెలిపారు. మరి.. సీఎం జగన్ ప్రసంగం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తె లియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి