iDreamPost

ప‌వ‌న్‌తో పొత్తు లోకేశ్‌కు ఇష్టం లేదా? ఆ వ్యాఖ్యలే కారణమా?

ప‌వ‌న్‌తో పొత్తు లోకేశ్‌కు ఇష్టం లేదా? ఆ వ్యాఖ్యలే కారణమా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వేడి ఓ రేంజ్ లో ఉంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తుఫాన్ ని తలపిస్తోంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తరువాత ఏపీలో రాజకీయాల్లో పెనుసంచలనం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తులపై స్పష్టత ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని చెప్పారు. పవన్ ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో పక్కన లోకేశ్, బాలకృష్ణ సైతం ఉన్నారు. తాజాగా లోకేశ్ కు సంబంధించి సోషల్ మీడియాలో సైటెర్లు పేలుతున్నాయి. ముఖ్యంగా పవన్ తో పొత్తు లోకేశ్ కు ఇష్టం లేదంటూ కొందరు అంటున్నారు. అందుకు నిదర్శనం ఇవిగో అంటూ వివిధ సందర్భాలను ఉదహరిస్తున్నారు.

ఇటీవలే జనసేన అధినేత పవన్ కల్యాణ్..చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీతో పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. ఆ సందర్భంగా అందరు చప్పట్లు కొట్టగా లోకేశ్ కాస్త మౌనంగా ఉన్నారు. దీనిపైనే అధికార పార్టీకి చెందిన వారు పలు సందేహాలను వ్యక్తం చేశారు. అసలు లోకేశ్ కి పవన్ తో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఈ సారి చిన్న అవకాశాన్ని కూడా విడిచి పెట్టకూడదనే ఉద్దేశంతో పవన్ ను కలుపుకెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అందుకే చంద్రబాబును కలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ పొత్తులపై క్లారీటి ఇచ్చారు. లోకేశ్ కూడా బలవంతంగా పవన్ తో పొత్తుకు ఒప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. జగన్ ఎదుర్కోవాలంటే తన అవసరం టీడీపీకి ఉందనే భావనలో పవన్ కల్యాణ్ ఉన్నారు. అదే విషయాన్ని పరోక్షంగా అనేక సార్లు వ్యక్తపరిచారు. తన మద్దతు లేకపోతే మరోసారి సీఎం పీఠం జగన్ కే దక్కుతుందని అన్నారు. గతంలో టీడీపీకి అధికారం తన భిక్ష అన్నట్లు పవన్ పలు దఫాలుగా చేసిన కామెంట్స్ లోకేశ్ ను హర్ట్ చేశాయట. అప్పటి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ తో రాజకీయంగా కలవకూడదని లోకేశ్ గట్టిగా నిర్ణయించుకున్నట్లు టీడీపీ వర్గాలే అంటున్నాయి. అయితే రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు మాటను కాదనలేక.. అలాగనే అంతరాత్మకు విరుద్దంగా పవన్ తో పొత్తు ఇష్టం లేక లోకేశ్ సతమతం అవుతున్నట్లు సమాచారం.

అందుకే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది. తాను యువగళం యాత్రతో జనాల్లోకి వెళ్లే.. టీడీపీని ఒంటరిగానే పోటీ చేయలని లోకేశ్ భావించాడని, కానీ చంద్రబాబు అరెస్ట్ తో సీన్ అంత రివర్స్ అయిందని, అందుకే పొత్తును అంగీకరించాల్సి వచ్చిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ పొత్తుల ద్వారా వెళ్తే.. తనకు సీఎం అయ్యే అవకాశం ఉండదనే భావనలో లోకేశ్ ఉన్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. పరిస్థితులు మరింత దారుణంగా మారితే.. పవన్ కల్యాణ్ ని సీఎం అభ్యర్థిగా ప్రకటించాల్సి వస్తుందేమోననే లోకేశ్ భావిస్తున్నట్లు టాక్. మరి.. పవన్ తో పొత్తు లోకేశ్ కి ఇష్టం లేదంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి