iDreamPost

YS జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. కోనసీమ జిల్లాలో 17వ రోజు హైలెట్స్!

Memantha Siddham Day-17: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా 'మేమంతా సిద్ధం' పేరుతో చేపట్టిన బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ బస్సు యాత్ర గురువారం 17వ రోజు కోనసీమ జిల్లాలో కొనసాగింది.

Memantha Siddham Day-17: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా 'మేమంతా సిద్ధం' పేరుతో చేపట్టిన బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ బస్సు యాత్ర గురువారం 17వ రోజు కోనసీమ జిల్లాలో కొనసాగింది.

YS జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. కోనసీమ జిల్లాలో 17వ రోజు హైలెట్స్!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో జరగనున్న ఎన్నికల రణరంగలో దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘మేమంతా సిద్ధం’ పేరుతో ఎన్నికల ప్రచారంతో ప్రతిపక్షాలకు చెమటలు పట్టిస్తున్నారు. సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్రకు అపూర్వ స్పందన లభిస్తుంది. ఈయాత్ర ద్వారా తాను అందించిన సంక్షేమ పథకాలను, పాలన గురించి ప్రజలకు వివరించి.. అలానే వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారం చూపిస్తున్నారు. ‘మేమంతా సిద్ధం’యాత్రకు అన్ని జిల్లాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గురువారం 17 రోజు  అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సీఎం జగన్ చేపట్టిన ‘మేమంత సిద్ధం’ బస్సు యాత్ర కొనసాగింది. మరి.. 17వ రోజు కోనసీమ జిల్లాలో జరిగిన మేమంత సిద్ధం యాత్ర వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం 17వ రోజూ కోనసీమ జిల్లాలో కొనసాగింది. గురువారం ఉదయం 9 గంటలకు తేతలి నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది. తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదగా పొట్టి లంక మీదుగా బస్సుయాత్ర కొనసాగింది. అనంతరం కడియపులకం, వేమగిరి,మోరంపూడి జంక్షన్, తాడితోట జంక్షన్, చర్చి సెంటర్, దేవిచౌక్ , రాజానగరం మీదుగా రాజపురం చేరుకుంది. ఇక ముఖ్యమంత్రి చేపట్టిన ఈ బస్సుయాత్రకు విశేషస్పందన లభిస్తుంది. జిల్లాలు దాటి ఎండా, వాన లెక్క చేయకుండా సీఎం జగన్ ను చూసేందుక పెద్ద ఎత్తున జనం వచ్చారు.

రావుల పాలెంలో సీఎం జగన్ కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. కడియపు లంక వద్ద జగన్ కు స్వాగతం పలికేందుకు హైవేపై భారీగా ప్రజలు చేరుకున్నారు. సీఎం సీఎం జగన్ పై తమ అభిమానం చాటుకునేందుకు పెద్ద ఎత్తు మహిళలు వచ్చారు. మేమంతా సిద్ధం  అంటూ సీఎం జగన్  జనహారతి పట్టారు. అవేమగిరి ప్రాంతంలో  జనం పోటేత్తారు. తాటితోట జంక్షన్, దివాన్ చేరువు మీదుగా రాజానగరంకు చేరుకుని ఎస్టీ రాజపురం వద్ద సీఎం జగన్ బస చేయనున్నారు. 17వరోజు బస్సుయాత్ర సందర్భంగా పలువురు టీడీపీ నేతలు సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. మొత్తంగా కోనసీమ జిల్లాలలో పూల వాన కురిపిస్తూ సీఎం జగన్ కి స్థానిక ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. గుమ్మడి కాయలు, హారతితో దిష్టి తీసి సీఎం జగన్ కు మహిళలు ఆత్మీయ స్వాగతం పలికారు. ఇలా 17వ రోజు సీఎం జగన్ బస్సుయాత్ర  కోనసీమ జిల్లాలో విజయవంతంగా సాగింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి