iDreamPost

YS జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర..NTR జిల్లాలో 14వ రోజు హైలెట్స్!

Memantha Siddham Day-14: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా 'మేమంతా సిద్ధం' పేరుతో చేపట్టిన బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ బస్సు యాత్ర శనివారం 14వ రోజు ఎన్టీఆర్ జిల్లాలో కొనసాగింది.

Memantha Siddham Day-14: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా 'మేమంతా సిద్ధం' పేరుతో చేపట్టిన బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ బస్సు యాత్ర శనివారం 14వ రోజు ఎన్టీఆర్ జిల్లాలో కొనసాగింది.

YS జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర..NTR జిల్లాలో 14వ రోజు హైలెట్స్!

ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో వివిధ కార్యక్రమాలతో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇటీవలే ‘మేమంతా సిద్ధం’ పేరుతో చేపట్టిన బస్సు యాత్రకు అపూర్వ స్పందన లభిస్తుంది. ఈయాత్ర ద్వారా తాను అందించిన సంక్షేమ పథకాలను, పాలన గురించి వివరించేందుకు ప్రజల్లోకి సాగుతున్నారు. సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. శనివారం 14వ రోజు ఎన్టీఆర్ జిల్లాలో సీఎం జగన్ చేపట్టిన ‘మేమంత సిద్ధం’ బస్సు యాత్ర కొనసాగింది. మరి.. 14వ రోజు ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన మేమంత సిద్ధం యాత్ర వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర శనివారం 14వ రోజూ ఎన్టీఆర్ జిల్లాలో కొనసాగింది. శనివారం ఉదయం 9 గంటలకు నంబూరు బైపాస్ బస కేంద్రం నుంచి  సీఎం జగన్ మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభమైంది. 14వ రోజు గుంటూరు జిల్లా మీద నుంచి ఎన్టీఆర్ జిల్లాలో కొనసాగింది. మంగళగిరి బైపాస్ వద్దకు చేరుకున్న సీఎం జగన్ కి ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. కాజా టోల్ గేట్ వద్ద సీఎం జగన్ కు గజమాలతో స్థానికులు స్వాగతం పలికారు.

మంగళగిరి చేనేత  కార్మికులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులకు వైసీపీ పాలనలో జరిగిన సంక్షేమం గురించి వివరించారు. అలానే  చంద్రబాబు చేసిన మోసాలను ఎండగట్టారు. నేతన్నల సంక్షేమాన్ని గతంలో ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, చంద్రబాబు చేనేత రంగాన్ని నిర్లక్ష్యం చేశారని  సీఎం జగన్ తెలిపారు. ఎన్నో హామీలు ఇచ్చి..నిరవేర్చకుండా బాబు మోసం చేశారని తెలిపారు.  వైసీపీ ప్రభుత్వం నేతన్న నేస్తం కింద రూ.970 కోట్లు అందజేసిందని తెలిపారు.  గతంలో ఎన్నడూ లేనంతగా, మన ప్రభుత్వం నేతన్నల కోసం 3 వేల కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేసిందని సీఎం జగన్ తెలిపారు.

ఇదే సమయంలో చేనేత కార్మికులు కూడా సీఎం జగన్ తో ముచ్చటించారు. చంద్రబాబు  హయాంలో చేనేత రంగాన్ని పట్టించుకోలేదని, సీఎం జగన్ చేనేత రంగాన్ని ఆదుకున్నారని స్థానిక చేనేత కార్మికులు చెప్పుకొచ్చారు. మంగళగిరిలో చేనేత కార్మికులతో సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమం ముగిసిన తరువాత కనకదుర్గ వారథి మీదుగా ఎన్టీఆర్ జిల్లాలోకి సీఎం జగన్ బస్సుయాత్ర ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ యాత్రలో సీఎం జగన్ కి అడుగడుగునా జన నీరాజనం పలికారు. ఇదే సమయంలో ప్రజలతో కలిసి వైఎస్ భారతి ..సీఎం జగన్ కి అభివాదం చేశారు.

ఇక 14వ రోజు సీఎం జగన్ చేపట్టిన మేమంత సిద్ధం బస్సు యాత్రకు  జనాభిమానం ఉప్పొంగింది. సంక్షేమ పాలన అందించిన సీఎం జగన్ కు అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం  పట్టారు. ఇక 14వ రోజు బస్సుయాత్రలో సీఎం జగన్ కు ప్రజలు తమ సమస్యలు చెప్పుకుంటుండగా, ఒపికగా వింటున్న సీఎం జగన్ నేనున్నానంటూ భరోసా ఇస్తూ ముందుకు సాగారు. విజయవాడలో సీఎంను చూసేందుకు జనం భారీగా చేరుకున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో భారీ గజమాలలతో సీఎం జగన్ కి స్థానిక ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. గుమ్మడి కాయలు, హారతితో దిష్టి తీసి సీఎం జగన్ కు మహిళలు ఆత్మీయ స్వాగతం పలికారు. ఇలా 14వ రోజు సీఎం జగన్ బస్సుయాత్ర ఎన్టీఆర్ జిల్లాలో విజయవంతంగా సాగింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి