iDreamPost

వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న CM కేసీఆర్.. మంత్రి KTR వెల్లడి

వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న CM కేసీఆర్.. మంత్రి KTR వెల్లడి

గత కొన్ని రోజులుగా వాతావరణంలో విభిన్నమైన మార్పులు సంభవించాయి. ఓ వైపు ఎండలు, మరో వైపు వర్షాలు. ఈ క్రమంలోనే వైరల్ ఫీవర్లు, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రభలుతున్నాయి. దీంతో రాష్ట్ర వైద్యశాఖ అప్రమత్తమైంది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వాసుపత్తుల్లో అవసరమైన మందులు, వైద్యులను అందుబాటులో ఉంచుతోంది. ఈ క్రమంలో తెలంగాణ సీఎం వైరల్ ఫీవర్ భారిన పడ్డారు. గత కొద్ది రోజులుగా ఫీవర్, దగ్గుతో బాధపడుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం డాక్టర్లు వైద్యం అందిస్తున్నారని, త్వరలోనే కోలుకుంటారని వైద్యులు వెల్లడించినట్లు కేటీఆర్ తెలిపారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు ఐటీ మినిస్టర్ కేటీఆర్ వెల్లడించారు. వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని తెలియజేశారు. గత వారం రోజులుగా వైరల్ ఫీవర్, దగ్గుతో బాధపడుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. కాగా ఇంట్లోనే కేసీఆర్ కు చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. వైద్య బృందం సీఎం కేసీఆర్ ను నిత్యం పర్యవేక్షిస్తూ చికిత్స అందిస్తున్నదని కేటీఆర్ వెల్లడించారు. కొన్ని రోజుల్లోనే ఫీవర్, దగ్గు నయమయి సీఎం కేసీఆర్ కోలుకుంటారని వైద్యులు వెల్లడించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇక ఈ విషయం తెలిసిన బీఆర్ఎస్ శ్రేణులు సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.