iDreamPost

“జగనన్న చేదోడు” పథకాన్ని ఈరోజు ప్రారంభించనున్న సీఎం జగన్

“జగనన్న చేదోడు” పథకాన్ని ఈరోజు ప్రారంభించనున్న సీఎం జగన్

కరోనా వైరస్ కారణంగా దేశ,రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ వెనుకపడింది. లాక్ డౌన్ కారణంగా రాష్ట్రాల ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం మాత్రం ప్రజా సంక్షేమ పథకాలను అమలుచేయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. బడుగు వర్గాల వారికి మేలు చేకూర్చే పథకాలను ప్రారంభిస్తూనే ఉన్నారు.

అందులో భాగంగా ఈరోజు ‘జగనన్న చేదోడు’ పధకాన్ని తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ఆన్‌లైన్‌ ద్వారా సీఎం జగన్ ప్రారంభించనున్నారు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కారణంగా దేశ వ్యాప్తంగా టాప్ 5 ముఖ్యమంత్రుల్లో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే.

జగనన్న చేదోడు పథకం ద్వారా షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు ప్రతీ ఏటా రూ. 10 వేలు సాయం లభించనుంది. మధ్యవర్తులతో సంబంధం లేకుండా లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ కానుంది. తొలి విడతగా 2,47,040 మంది లబ్దిదారులకు ఆర్ధిక సాయం నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ కానుంది. ఇందు నిమిత్తం 247 కోట్ల నిధులను విడుదల చేయనున్నారు.

కాగా లబ్ధిదారుల్లో టైలర్లు 1,25,926 మంది, రజకులు 82,347 మంది, నాయీ బ్రాహ్మణులు 38,767 మంది ఉన్నారు. వీరికి రూ.10,000 చొప్పున ఒక్కొక్కరి బ్యాంక్ ఖాతాల్లోకి జమ కానున్నాయి.

జిల్లాల వారీగా లబ్ధిదారుల సంఖ్య

శ్రీకాకుళం– టైలర్లు(5,184), రజకులు(7,187), నాయీ బ్రాహ్మణులు(3,355)

విజయనగరం– టైలర్లు(8,669), రజకులు(6,931), నాయీ బ్రాహ్మణులు(2,893)

విశాఖపట్నం– టైలర్లు(11,195), రజకులు(8,319), నాయీ బ్రాహ్మణులు(3,414)

తూర్పుగోదావరి– టైలర్లు(13,235), రజకులు(7,773), నాయీ బ్రాహ్మణులు(4,085)

పశ్చిమ గోదావరి– టైలర్లు(10,617), రజకులు(7,214), నాయీ బ్రాహ్మణులు(3,295)

కృష్ణా– టైలర్లు(16,656), రజకులు(4,366), నాయీ బ్రాహ్మణులు(3,116)

గుంటూరు– టైలర్లు(11,764), రజకులు(2,786), నాయీ బ్రాహ్మణులు(3,030)

ప్రకాశం– టైలర్లు(10,472), రజకులు(3,351), నాయీ బ్రాహ్మణులు(2,114)

నెల్లూరు– టైలర్లు(9,688), రజకులు(4,902), నాయీ బ్రాహ్మణులు(1,534)

వైఎస్సార్ కడప– టైలర్లు(5,739), రజకులు(7,399), నాయీ బ్రాహ్మణులు(1,980)

కర్నూలు – టైలర్లు(8,863), రజకులు(8,768), నాయీ బ్రాహ్మణులు(4,108)

చిత్తూరు– టైలర్లు(9,565), రజకులు(3,934), నాయీ బ్రాహ్మణులు(1,992)

అనంతపురం– టైలర్లు(4,279), రజకులు(9,417), నాయీ బ్రాహ్మణులు(3,851)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి