iDreamPost

మత్స్యకారుల పట్ల సీఎం జగన్ ఉధారత.. 80 శాతం సాయం!

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి మత్య్సకారలలకు అండగా నిలిచారు. అగ్నిప్రమాదంలో బోట్లు కోల్పోయి కన్నీరు కారుస్తున్న వారి జీవితాలను మళ్లీ నిలబెట్టేందుకు భారీ సాయాన్ని ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి మత్య్సకారలలకు అండగా నిలిచారు. అగ్నిప్రమాదంలో బోట్లు కోల్పోయి కన్నీరు కారుస్తున్న వారి జీవితాలను మళ్లీ నిలబెట్టేందుకు భారీ సాయాన్ని ప్రకటించారు.

మత్స్యకారుల పట్ల సీఎం జగన్ ఉధారత.. 80 శాతం సాయం!

అగ్ని ప్రమాదంలో బోట్లను కోల్పోయిన మత్య్సకారుల పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉధారత చాటుకున్నారు. ఆర్థికంగా నష్టపోయి, తమ ఉపాధిని కోల్పోయిన వారికి అండగా నిలిచారు. మళ్లీ వారి జీవితాల్లో వెలుగులు నింపేలా సీఎం నిర్ణయం తీసుకున్నారు. మత్య్సకారుల జీవితాలను నిలబెట్టేల పరిహారం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలోనే విశాఖ అగ్నిప్రమాదంలో బోట్లు కోల్పోయిన మత్య్సకారులకు కనీవినీ ఎరుగని రీతిలో సహాయం ప్రకటించారు సీఎం జగన్. బోట్ల విలువలో 80 శాతం పరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. మత్య్సకారుల జీవితాలను నిలబెట్టేలా సహాయం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

విశాఖలోని ఫిషింగ్ హార్బర్ లో నిన్న రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఘోరమైన అగ్నిప్రమాదంలో దాదాపు 60 కి పైగా పడవలు కాలి బూడిదయ్యాయి. కోట్లలో నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. బోట్లతో పాటు అందులో ఉన్న మత్స్య సంపద కూడా అగ్నికి ఆహుతయ్యింది. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం మత్స్యకారులకు తీవ్ర నష్టం కలిగించింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి అగ్నిమాకప సిబ్బందితో వెళ్లి ఎంతో శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం వాటిల్లకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బోట్లు దగ్ధమైన ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అయితే ఈ ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి ఫిషింగ్ హార్బర్ లోని ఓ బోట్ లో స్థానిక యూట్యూబర్ లోకల్ బాయ్ నాని పార్టీ ఇచ్చాడని.. ఈ సందర్భంగా జరిగిన గొడవ అగ్ని ప్రమాదానికి దారితీసిందని స్థానికంగా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే లోకల్ బాయ్ నాని, అతడి స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. లోకల్ బాయ్ నాని ఓ బోటును అమ్మకానికి పెట్టగా.. ఆ బోటును బాలాజీ అనే వ్యక్తి కొనుగోలు చేసినట్లు అక్కడి వారు చెప్తున్నారు.

అడ్వాన్స్ గా కొంత సొమ్ము చెల్లించిన బాలాజీ తర్వాత తాను ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలని నానిని నిలదీసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే బాలాజీ, నానికి మధ్య గొడవల జరిగిందని.. మద్యం మత్తులో బోటు తగలబెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంటే లోకల్ బాయ్ నాని ఘటనా స్థలం వద్ద ఓ లైవ్ వీడియో తీశాడు.. అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ ఘటన గురించి అసలు నిజాలు ఏంటీ? అన్నది పోలీసులు పూర్తి విచారణ చేసిన తర్వాత తేలనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి