iDreamPost

హనుమంతుడి భక్తుడే ‘హనుమాన్‌’ ఫంక్షన్‌కి ముఖ్యఅతిథి!

Hanuman Movie: ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జ నటిస్తున్న మూవీ ‘హనుమాన్’. పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్.. ప్రేక్షకుల్లో మూవీ పై మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి.

Hanuman Movie: ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జ నటిస్తున్న మూవీ ‘హనుమాన్’. పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్.. ప్రేక్షకుల్లో మూవీ పై మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి.

హనుమంతుడి భక్తుడే ‘హనుమాన్‌’ ఫంక్షన్‌కి ముఖ్యఅతిథి!

హనుమాన్‌ చిత్రానికి హనుమంతుడే పెద్ద ఎసెట్‌. హనుమంతుడు పాత్రతో గానీ, చివరికి ఆయన జెండాతో వచ్చిన సినిమా కూడా జయం సినిమా పెద్ద హిట్‌ అయింది. సినిమా చరిత్రలో హనుమాన్‌ పాత్రకి చాలా పెద్ద రికార్డే ఉంది. మరో స్పెషల్‌ అట్రాక్షన్‌ హనుమాన్‌ సినిమాకి ఎదురొచ్చింది. అదే మెగాస్టార్‌ చిరంజీవి ఈరోజు జరగబోతున్న ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు చీఫ్‌ గెస్ట్‌గా రావడం.

తేజా సజ్జా గతంలో మెగాస్టార్‌ చిరంజీవితో చూడాలని ఉంది సినిమాలో చైల్డ్‌ ఆర్డిస్ట్‌గా వర్క్ చేసి చిన్నప్పుడే అందరి దృష్టిలో పడ్డాడు. ఇప్పుడు అదే మెగాస్టార్‌ తను లీడ్‌ క్యారెక్టర్‌ చేస్తున్న హనుమాన్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ముఖ్య అతిధిగా రావడం సినిమాకి ప్రీ రిలీజ్‌ క్యాంపైన్‌కి బాగా హెల్స్‌ అయింది. చిరంజీవి ఏ సినిమా ఫంక్షన్‌కి వచ్చినా ఆ సినిమా మీద ఆయన అభిమానులు ప్రత్యేకమైన దృష్టి పెడతారు. అది ఓపెనింగ్స్ ఎప్పుడూ హెల్ప్‌ అవుతూనే వచ్చింది. ఎన్నో అవాంతరాల మధ్య నుంచి, అభ్యంతరాల మధ్య నుంచి దాటుకుని హనుమాన్‌ చిత్రాన్ని నిర్మాత నిరంజన్‌ రెడ్డి సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేస్తున్నారు.

hanuman movie pre release event

తనకు ఎదురైన అపోజిషన్‌ ను తట్టుకుని అనుకున్న డేట్‌కే విడుదలకు సిద్ధం కావడంతో నిరంజన్‌ రెడ్డికి ప్రేక్షక లోకంలో తిరుగులేని గుర్తింపు లభించడం ఇక్కడ విశేషంగా చెప్పాలి. ఈ  ఏడాది సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలు-గుంటూరు కారం, సైంధవ్‌, నా సామిరంగా చిత్రాలకు ఆయా హీరోలు, దర్శకులు, నిర్మాతలు, బ్యానర్లు బేస్ మీద వేటి ప్రత్యేకత వాటికే ఉంది. ఈ మధ్యలో హనుమాన్‌ సినిమాకి  కూడాస్పెషల్‌ అట్రాక్షన్‌ వచ్చింది. ప్రపంచంలో అనేక భాషలలో విడుదలవుతున్న తొలి తెలుగు సూపర్‌ హీరో సినిమాగా హనుమాన్‌ ప్రత్యేకతను ఎవ్వరూ కాదనలేరు.

ఇప్పుడున్న క్రేజ్‌కి తోడు మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్యఅతిధిగా రావడంతో మరింత క్రేజ్‌ని సంతరించుకుంది హనుమాన్‌ సినిమా. ఇందులో మరో విశేషం ఏంటంటే మెగాస్టార్‌ చిరంజీవి స్వయంగా హనుమాన్‌కు పెద్ద భక్తుడు. ఆయన పేరే చిరంజీవి. హనుమంతుడిని చిరంజీవి అని కూడా అంటారు. జగదేకవీరుడు-అతిలోకసుందరి చిత్రంలో హనుమంతుడు గెటప్‌లో కూడా కనిపిస్తారు. హనుంతుడుకి వీరభక్తుడైన చిరంజీవి హనుమాన్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ముఖ్య అతిధిగా వస్తుంటే, చెప్పలేనంత ప్రత్యేకతను హనుమాన్ సినిమా విడుదలకి ముందే కొండంత ఆకర్షణనూ మూట కట్టుకుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి