iDreamPost

వామ్మో.. షాక్ ఇస్తున్న చికెన్ ధరలు.. కిలో ఎంతంటే?

Chicken Price has Increased: నాన్ వెజ్ తినేవారికి ఎక్కువగా చికెన్ అంటే చాలా ఇష్టం. వారంలో కనీసం మూడు నాలుగు సార్లయినా చికెన్ కూరతో వెరైటీ వంటకాలు చేసుకుంటారు., లేదా ఆర్డర్ చేసుకునో తింటుంటారు. చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.

Chicken Price has Increased: నాన్ వెజ్ తినేవారికి ఎక్కువగా చికెన్ అంటే చాలా ఇష్టం. వారంలో కనీసం మూడు నాలుగు సార్లయినా చికెన్ కూరతో వెరైటీ వంటకాలు చేసుకుంటారు., లేదా ఆర్డర్ చేసుకునో తింటుంటారు. చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.

వామ్మో.. షాక్ ఇస్తున్న చికెన్ ధరలు.. కిలో ఎంతంటే?

సాధారణంగా నాన్ వెజ్ తినేవారికి ముక్కలేనిదే ముద్ద దిగదు అంటారు. వారంలో కనీసం రెండు మూడు సార్లు మటన్, చికెన్, షిష్ కనీసం కోడి గుడ్లు అయినా వండుకొని తింటుంటారు. నాన్ వెజ్ లో అందరికీ ఎంతో ఇష్టమైనది కోడికూర.మార్కెట్ లో మాంసం కంటే తక్కువ ధర.. ఎన్నో రకాలుగా వండుకొని తినేందుకు పనికి వస్తుందని చికెన్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇక శుభకార్యాల్లో ఎక్కువగా చికెన్ వండి పెడుతుంటారు. ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్ షాపు ముందు భారీగా క్యూ లైన్లో దర్శనమిస్తుంటారు. తాజాగా మళ్లీ చికెన్ ధరలు షాక్ ఇస్తున్నాయి. గత వారంతో పోల్చితే అమాంతం పెరిగిపోయింది. ఈ రోజు మార్కెట్ లో కిలో చికెన్ ఎంత ఉందంటే? వివరాల్లోకి వెళితే..

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఎండల ప్రభావం చికెన్ ధరలపై చూపిస్తున్నట్లుంది. తెలంగాణలో చికెన్ ధరలు ఒక్క వారంలోనే అమాంతం పెరిగిపోయాయి. ఇది చికెన్ ప్రియులకు బ్యాన్ న్యూస్ అనే చెప్పాలి. తాజాగా చికెన్ ధరలు చూసి సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. గత వారం కిలో చికెన్ రూ.260 వరకు ఉంటే.. ఇప్పుడు ఏకంగా రూ.290 నుంచి రూ.310 వరకు పెరిగింది. కొన్ని ఏరియాల్లో రూ.330 వరకు అమ్ముతున్నట్లు తెలుస్తుంది. ఆదివారం వచ్చింది అంటే చాలు చికెన్ కూర తినేందుకు ఇష్టపడతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చికెన్ షాపులు కిట కిటలాడుతుంటాయి. గత వారంతో పోల్చుకుంటే.. ఈరోజు ధరలు చూస్తే నోటిమీ వేలే వేసుకోవాల్సిందే.

ఓ వైపు చికెన్ మాంసం షాక్ ఇస్తుంటే.. కోడి గుడ్ల ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. గత వారం పది రోజుల క్రితం 5 రూపాయల ఉంటే ఇప్పుడు 7 రూపాయలకు చేరింది. ఇప్పట్లో గుడ్ల ధరలు తగ్గే అవకాశం లేదని అంటున్నారు. మరి చికెన్ ధరలు రానున్న రోజుల్లో తగ్గుతాయా? ఎండల ప్రభావంతో మరింత పెరుగుతాయా? అనేది చూడాలి. ఎండల ప్రభావం కోళ్ల ఫామ్ పై తీవ్రంగా చూపిస్తుంది.. కోళ్లు చనిపోయే ప్రమాదం ఉంది… దీంతో కోళ్ల కొరత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. సామాన్యులకు బంధువులు వచ్చినా.. స్నేహితులు వచ్చినా చికెన్ కూర వండి మెప్పించేవారు. కానీ ఇప్పుడు కోడి గుడ్ల జోలికి వెళ్లాలన్నా భయం వేస్తుందని అంటున్నారు సామాన్య ప్రజలు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి