iDreamPost

School Holidays: విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త.. జూన్‌ 25 వరకు వేసవి సెలవులు పొడగింపు

  • Published Jun 17, 2024 | 1:03 PMUpdated Jun 17, 2024 | 1:03 PM

విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త చెప్పింది ప్రభుత్వం. జూన్‌ 25 వరకు వేసవి సెలవులు పొడగిస్తూ.. నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త చెప్పింది ప్రభుత్వం. జూన్‌ 25 వరకు వేసవి సెలవులు పొడగిస్తూ.. నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

  • Published Jun 17, 2024 | 1:03 PMUpdated Jun 17, 2024 | 1:03 PM
School Holidays: విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త.. జూన్‌ 25 వరకు వేసవి సెలవులు పొడగింపు

వేసవి సెలవులు ముగిశాయి. సుమారు రెండు నెలల పాటు విద్యార్థులకు ఎండాకాలం సెలవులు ఇచ్చారు. అయితే ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో.. సెలవులు ముగిసిన తర్వాత కూడా స్కూల్స్‌ ఒపెన్‌ చేసే పరిస్థితి లేదు. చాలా రాష్ట్రాల్లో వేసవి సెలవులను పొడగిస్తున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో.. ముందు చెప్పినట్లుగానే జూన్‌ 12 నుంచే స్కూల్స్‌ రీఒపెన్‌ చేశారు. ఏపీలో మాత్రం ఒక్క రోజు పొడగించారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే వానలు కురుస్తున్నాయి కాబట్టి.. వాతావరణం చల్లబడింది. దాంతో పిల్లలు పాఠశాలకు వెళ్లడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం.. ఎండలు ఇంకా మండుతున్నాయి. దాంతో ప్రభుత్వాలు వేసవి సెలవులు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలో ఓ ప్రభుత్వం.. జూన్‌ 25 వరకు వేసవి సెలవులు పొడగించింది. ఆ వివరాలు..

సాధారణంగా జూన్‌ 15లోపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని పాఠశాలలు ఒపెన్‌ అవుతాయి. అయితే ఎండలు ఎక్కువగా ఉండటంతో.. కొన్ని ప్రాంతాల్లో వేసవి సెలవులు పొడగించారు. ఈ క్రమంలో ఛత్తీస్‌గడ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గకపోవడంతో.. వేసవి సెలవులు పొడగిస్తూ.. ఛత్తీస్‌గడ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎండలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు వేసవి సెలవులను జూన్ 25 వరకు పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఉత్తర్వులు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వర్తిస్తుంది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 22 నుండి జూన్ 15 వరకు అన్ని పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఉష్ణోగ్రతల దృష్ట్యా వేసవి సెలవులను జూన్ 25 వరకు పొడిగిస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 26 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని తెలిపింది. రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌, రాజ్‌నంద్‌గావ్‌లలో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాబోయే నాలుగు రోజుల పాటు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, దానితో పాటు వడగాలు సైతం విపరీతంగా ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వేసవి సెలవులు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి