iDreamPost
android-app
ios-app

వీడియో: భూమి పుట్టినప్పటి నుంచి ఆడుతున్నావ్.. ఇంకా 40 ఏళ్లేనా? మిశ్రాపై రోహిత్ పంచులు!

  • Published May 02, 2024 | 10:49 AM Updated Updated May 02, 2024 | 10:49 AM

ఇటీవలే లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రాపై పంచులు కురిపించాడు రోహిత్ శర్మ. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

ఇటీవలే లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రాపై పంచులు కురిపించాడు రోహిత్ శర్మ. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

  • Published May 02, 2024 | 10:49 AMUpdated May 02, 2024 | 10:49 AM
వీడియో: భూమి పుట్టినప్పటి నుంచి ఆడుతున్నావ్.. ఇంకా 40 ఏళ్లేనా? మిశ్రాపై రోహిత్ పంచులు!

టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఐపీఎల్ సీజన్ లో అంతగా రాణించడం లేదు. ముంబై కెప్టెన్సీ నుంచి తొలగించింది అన్న బాధేమో తెలియడం లేదుగానీ.. మునుపటి హిట్ మ్యాన్ రోహిత్ లో కనిపించడం లేడు. అడపాదడపా మెరుపులు తప్పితే.. కంటిన్యూస్ గా పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్నాడు. అయితే బ్యాటర్ గా విఫలం అయినాగానీ.. కామెడీలో మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. ఇటీవలే లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రాపై పంచులు కురిపించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

ముంబై ఇండియన్స్ రోహిత్ ను కెప్టెన్ గా తప్పించిన తర్వాత అతడిలో కాస్త కామెడీ ఎక్కువైంది. తన సహచర ఆటగాళ్లను సరదాగా ఆటపట్టిస్తూ.. నవ్వులు పూయిస్తున్నాడు హిట్ మ్యాన్. ఇటీవలే లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు స్టార్ స్పిన్నర్ అమిత్ మిశ్రాపై అదిరిపోయే పంచులు వేశాడు రోహిత్. అసలేం జరిగిందంటే? లక్నోతో మ్యాచ్ ముగిసిన అనంతరం రోహిత్ శర్మ, అమిత్ మిశ్రా, మురళీ కార్తీక్ మధ్య సంభాషణ జరిగింది.

ఈ సంభాషణలో భాగంగా రోహిత్ శర్మ అమిత్ మిశ్రాను నీ ఏజ్ ఎంత? అని ప్రశ్నించాడు. దానికి మిశ్రా ఆన్సర్ ఇస్తూ.. నా ఏజ్ 40 అన్నాడు. ఇది విని షాక్ అయిన రోహిత్.. నాకే 37 ఏళ్లు, అంటే నాకంటే నువ్వు కేవలం 3 సంవత్సరాలే పెద్దా? నేను నా పీసెస్ లో ఉన్నప్పుడు నువ్వు క్రికెట్ లోకి అరంగేట్రం చేశావ్.. కాస్త నిజాలు చెప్పు అంటూ రోహిత్ పంచ్ వేశాడు. దాంతో పక్కనున్న వారు నవ్వులు చిందించారు. కాగా.. మిశ్రా 2003లో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. అంటే దాదాపు 21 సంవత్సరాల పాటు క్రికెట్ ఆడుతున్నాడు. ఇక మిశ్రా కెరీర్ విషయానికి వస్తే.. 22 టెస్టులు, 36 వన్డేలు, 10 టీ20లు, 162 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడాడు. రోహిత్-మిశ్రా మధ్య జరిగిన ఈ సరదా వీడియోను లక్నో సూపర్ జెయింట్స్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ఈ మ్యాచ్ లో లక్నో 4 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio