iDreamPost

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ గాయని కన్నుమూత

  • Published May 02, 2024 | 10:25 AMUpdated May 02, 2024 | 10:34 AM

ప్రేక్షకులను తమ గాత్రంతో నిత్యం అలరించేవారు అకస్మాత్తుగా.. అందరికి అందనంత దూరానికి వెళ్లిపోతున్నారు. తాజగా ఓ ప్రముఖ గాయని కన్నుమూశారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రేక్షకులను తమ గాత్రంతో నిత్యం అలరించేవారు అకస్మాత్తుగా.. అందరికి అందనంత దూరానికి వెళ్లిపోతున్నారు. తాజగా ఓ ప్రముఖ గాయని కన్నుమూశారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published May 02, 2024 | 10:25 AMUpdated May 02, 2024 | 10:34 AM
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ గాయని కన్నుమూత

ఎందరో ప్రేక్షకులను తమ గాత్రంతో అలరించిన అలనాటి ప్రముఖులు… అకస్మాత్తుగా అందరిని వదిలి వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో తాజగా తమిళ సంగీతానికి చెందిన ప్రముఖ గాయని.. ఉమా రామనన్ (72) బుధవారం కన్నుమూశారు. తమిళ సంగీతానికి ఆమె చేసిన కృషి ఎంతో ఉన్నతమైనది. ఆమె కేవలం స్టూడియో రికార్డింగ్ లే కాకుండా.. తన ప్రత్యేక్ష ప్రదర్శనలతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించారు. 35 సంవత్సరాల తన అద్భుతమైన సంగీత ప్రయాణంలో.. ఆరువేల కంటే ఎక్కువ కచేరీలను ఆమె చేశారు. ఆమె ఇలా అకస్మాత్తుగా మరణించడంతో.. ఆమె అభిమానులు సంతాపం తెలుపుతున్నారు. ఆమె మృతికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉమా రామనన్.. మృతికి కారణం.. ఆమె అనారోగ్యమే అని తెలుస్తోంది. ఆమె సంగీత ప్రపంచంలో ఎందరో గాయని గాయకులతో కలిసి పని చేశారు. ఇళయరాజ, విద్యాసాగర్, మణిశర్మ, దేవా ఇలా ఎంతో మంది గొప్ప వ్యక్తులతో కలిసి ఆమె తన సంగీత ప్రయాణాన్ని కొనసాగించారు. మహానది, ఒరు కైథియన్ డైరీ, అరంగేట్ర వేళై లాంటి ఎన్నో చిత్రాలకు గాత్రం అందించిన మహా గాయని ఉమా రామనన్. ఆమె తెలుగులో చివరిగా ఓ చిన్నదాన సినిమాలో ఓ పాటను ఆలపించారు. ఇక ఆ తర్వాత ఆమె అనారోగ్య సమస్యల కారణంగా బుధవారం రోజున స్వర్గస్థులయ్యారు. దీనితో పలువురు గాయని గాయకులు, ఆమె అభిమానులు ఉమా రామనన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

ఇక సంగీత ప్రయాణం విషయానికొస్తే.. 1976 లో “ప్లే బాయ్” అనే ఓ హిందీ చిత్రంతో ఆమె సంగీత ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత ఆమె మొదటి తమిళ ప్రాజెక్ట్ 1977 లో విడుదలైన “శ్రీ కృష్ణ లీల”. అంతే కాకుండా ఇళయరాజా స్వరపరిచిన ‘నిజాల్ గల్’ చిత్రంలోని ‘పూంగతావే తాల్ తిరవా ‘ అనే పాటను ప్రాణం పెట్టి పాడారు ఉమా రామనన్. ఇలా ఇళయరాజాతో కలిసి 100 కి పైగా సినిమాలాలో సహకార గాయనిగా పనిచేశారు. అలాగే విద్యాసాగర్, దేవా మరియు మణి శర్మతో సహా ఎందరో ప్రముఖ గాయని గాయకులతో భాగస్వామ్యం అయ్యారు ఉమా రామనన్. ఆరు పదుల పాటు సంగీత ప్రపంచాన్ని ఏలిన ఆమె అకస్మాత్తుగా మరణించడం.. సంగీత ప్రపంచానికి ఓ తీరని లోటు అని చెప్పి తీరాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి