iDreamPost

14 ఏళ్ల ముఖ్యమంత్రికి.. 14 రోజుల రిమాండ్! ఇది దేవుడి స్క్రిప్టా?

  • Author singhj Published - 08:26 PM, Sun - 10 September 23
  • Author singhj Published - 08:26 PM, Sun - 10 September 23
14 ఏళ్ల ముఖ్యమంత్రికి.. 14 రోజుల రిమాండ్! ఇది దేవుడి స్క్రిప్టా?

ఎంతటి వారైనా కర్మఫలాన్ని అనుభవించక తప్పదని పెద్దలు అంటుంటారు. ఒకరికి చెడు చేస్తే మనకూ చెడే జరుగుతుందని చెబుతుంటారు. ఈ జన్మలో చేసిన తప్పులు, పాపాలకు ఈ జన్మలోనే కర్మఫలాన్ని అనుభవించక తప్పదని పెద్దలు హెచ్చరిస్తుంటారు. యాదృచ్ఛికమో.. కర్మ ఫలితమో గానీ కొన్ని ఘటనలు జరిగే తీరు చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారంలోనూ ఇదే జరిగింది. స్కిల్ డెవలప్​మెంట్ స్కామ్​లో శనివారం ఉదయం చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం విదితమే.

స్కామ్​లో చంద్రబాబు రూ.371 కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఏపీ సీఐడీ ప్రాథమిక ఆధారలతో ఆయన్ను అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఆదివారం ఉదయం విజయవాడలోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు.. ఈ కేసులో టీడీపీ అధినేతకు 14 రోజుల రిమాండ్​ను విధించింది. దీంతో పెళ్లి రోజు నాడే చంద్రబాబు జైలుకు వెళ్లక తప్పలేదు. 1981 సెప్టెంబర్ 10వ తేదీన చంద్రబాబు-భువనేశ్వరిలకు చెన్నైలో వివాహం జరిగింది. సరిగ్గా అదే రోజున ఆయన జైలుకు వెళ్లడం గమనార్హం.

చంద్రబాబు తన పెళ్లి రోజు నాడే జైలుకు వెళ్తున్నారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన బాబు.. జీవితంలో ఒక్కసారి కూడా కోర్టు మెట్లు ఎక్కలేదు. 14 ఏళ్లు ఆయన సీఎంగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​కు 9 ఏళ్లు, నవ్యాంధ్రకు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. సీనియర్ నేతగా, ఒక పార్టీకి అధినేతగా, మాజీ ముఖ్యమంత్రిగా తనకు ఉన్న పలుకుబడితో గతంలో పలు కేసుల్లో మేనేజ్ చేస్తూ కోర్టు మెట్లు ఎక్కుకుండా తప్పించుకున్నారు బాబు. కానీ స్కిల్ డెవలప్​మెంట్ కేసులో ఆయన తొలిసారి కోర్టుకు వెళ్లారు. అదే విధంగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు మొదటిసారి వెళ్తున్నారు.

గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు చంద్రబాబు. అయితే ఆ తర్వాత ఎన్నికల్లో ఆయనకు సరిగ్గా 23 సీట్లే వచ్చాయి. దాంతో అప్పట్లో అది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని చాలా మంది కామెంట్స్ చేశారు. ఇప్పుడు కూడా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు స్కిల్ డెవలప్​మెంట్ కేసులో 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీంతో ఇది కూడా దేవుడి స్క్రిప్టేనని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. ఇన్నాళ్లూ అన్నీ మేనేజ్ చేస్తూ వచ్చిన చంద్రబాబుకు ఇప్పుడు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. దీనిపై మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: బాబును అరెస్ట్ చేసిన ఈ ఆఫీసర్ రేంజ్ తెలుసా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి