iDreamPost

బాబుని అరెస్ట్ చేసిన ఈ ఆఫీసర్ రేంజ్ తెలుసా? బాలయ్య కాల్పుల కేసు కూడా..

  • Published Sep 10, 2023 | 12:43 PMUpdated Sep 10, 2023 | 12:43 PM
  • Published Sep 10, 2023 | 12:43 PMUpdated Sep 10, 2023 | 12:43 PM
బాబుని అరెస్ట్ చేసిన ఈ ఆఫీసర్ రేంజ్ తెలుసా? బాలయ్య కాల్పుల కేసు కూడా..

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని ఏపీ సీఐడీ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఆదివారం ఆయనను విజయవాడలోని ఏసీబీ కోర్టులో ప్రవేవపెట్టారు. ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారం రాబట్టాలంటే.. చంద్రబాబును రిమాండ్‌కు ఇవ్వాలని సీఐడీ తరఫున లాయర్లు న్యాయమూర్తిని కోరారు. చంద్రబుబా తరఫున లాయర్లు మాత్రం ఈ కేసులో ఆయనకు బెయిల్‌ ఇవ్వాలని న్యాయమూర్తికి వాదనలు వినిపిస్తున్నారు. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య వాదలు.. హాట్‌ హాట్‌గా జరుగుతున్నాయి. బాబుకు బెయిలా? జైలా? అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది.

అయితే.. ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్‌ చేసిన ఏపీ సీఐడీ(క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్డ్‌మెంట్‌) అడిషనల్‌ డీజీ ఎన్‌.సంజయ్‌ పేరు రెండు తెలుగురాష్ట్రాల్లో మారుమోగిపోతుంది. 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి.. అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు లాంటి వ్యక్తిని అరెస్ట్‌ చేసి.. కోర్టు వరకు తీసుకొచ్చిన పోలీస్‌ ఆఫీసర్‌ ఎవరా? అనే విషయంపై సామాన్యులు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. నిజాయితీకి నిలువెత్తు రూపంలా ఉండే ఎన్‌.సంజయ్‌ అసలు పేరు.. నిడిగట్టు సంజయ్‌. 1967 మార్చ్‌ 19న జన్మించిన సంజయ్‌.. 1996 సివిల్స్‌ బ్యాచ్‌లో ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. సంజయ్‌.. విశాఖపట్నం, న్యూఢిల్లీలో పాఠశాల విద్యతో పాటు కాలేజ్‌ చదువు పూర్తి చేశారు. తన తండ్రి స్ఫూర్తితో సంజయ్‌ సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్‌ అయి.. ఐపీఎస్‌ అయ్యారు.

ఆంధ్ర ప్రదేశ్ కేడర్ ఐపీఎస్‌గా పోలీసు విభాగంలో సంజయ్‌కు మంచి రికార్డు ఉంది. ప్రస్తుతం సంజయ్ ఏపీ సీఐడీ చీఫ్‌గా ఉన్నారు. ఏపీ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా, అలాగే ఏపీ పోలీస్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలను కూడా కలిగి ఉన్నారు. 2017 నుంచి 2021 జనవరి వరకు ఆయన అనంతపురంలోని పోలీస్‌ అకాడమీకి డైరెక్టర్‌గా ఉన్నారు. అనంతరం అడిషనల్‌ డీజీపీగా ప్రమోషన్‌ పొందారు. సంజయ్‌ని 2021లో ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికలను పర్యవేక్షించడానికి ప్రత్యేక పోలీసు అధికారిగా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ నియమించారు.

బాలకృష్ణను అరెస్ట్‌ చేసింది కూడా ఈయనే..
సినిమా హీరో, ప్రస్తుతం హిందుపూర్‌ ఎమ్మెల్యేగా ఉన్న నందమూరి బాలకృష్ణ తన ఇంట్లో కొంతమంది వ్యక్తులపై గన్‌తో కాల్పులకు పాల్పడిన కేసులో.. బాలయ్యను 2004లో సంజయ్‌నే అరెస్ట్‌ చేశారు. అప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉన్నారు. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్లకు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చంద్రబాబు అరెస్ట్‌తో మరోసారి సంజయ్‌ వార్తల్లో నిలిచారు. మరి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో 371 కోట్ల అవినీతి జరిగిందని, అందంతా చంద్రబాబు ఆదేశాలతోనే జరిగిందని సీఐడీ ఆరోపిస్తూ.. ఆయనను అరెస్ట్‌ చేసింది. మరి ఈ కేసులో బాబుకు బెయిల్‌ వస్తుందా? రిమాండ్‌కు పంపుతారా? అనేది ఆసక్తికరంగా మారింది. మరి ఇలాంటి సంచలన కేసులో బాబును అరెస్ట్‌ చేసిన సంజయ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: చంద్రబాబు అరెస్ట్‌.. అల్లర్లకు టీడీపీ కుట్ర! అచ్చెన్నాయుడు ఆడియో లీక్‌..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి