iDreamPost

కేంద్రం సీరియస్.. ఆఫీస్ కి ఆలస్యంగా వస్తే కఠిన చర్యలు!

Central Govt: ప్రభుత్వ కార్యాలయాలు అంటే లేటుగా  పని మొదలు.. త్వరగా ముగింపు అనే భావన ఎక్కువ మందిలో ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో కార్యాలయాలకు ఆలస్యంగా వచ్చి.. త్వరగా ఇంటికి వెళ్లే ఉద్యోగులపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది.

Central Govt: ప్రభుత్వ కార్యాలయాలు అంటే లేటుగా  పని మొదలు.. త్వరగా ముగింపు అనే భావన ఎక్కువ మందిలో ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో కార్యాలయాలకు ఆలస్యంగా వచ్చి.. త్వరగా ఇంటికి వెళ్లే ఉద్యోగులపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది.

కేంద్రం సీరియస్.. ఆఫీస్ కి ఆలస్యంగా వస్తే కఠిన చర్యలు!

ప్రభుత్వ ఉద్యోగం అంటే.. అందరికి  ఓ రకమైన అభిప్రాయం ఉంటుంది. ఆఫీస్ కి లేటుగా వెళ్లినా, ఇంటికి త్వరగా వచ్చిన అడిగే వారు ఉండరు అనేది ఎక్కువ మంది ప్రజల్లో ఉండే భావన. అయితే ఇలాంటి అభిప్రాయాల నేపథ్యంలోనే కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటాయి.  తాజాగా కేంద్ర ప్రభుత్వం..సెంట్రల్ ఉద్యోగులకు కీలక సూచలన చేసింది. ఆఫీస్ కి ఆలస్యంగా వస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఈ క్రమంలోనే పలు కీలక అంశాలను ప్రస్తావించింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ప్రభుత్వ కార్యాలయాలు అంటే లేటుగా  పని మొదలు.. త్వరగా ముగింపు అనే భావన ఎక్కువ మందిలో ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో కార్యాలయాలకు ఆలస్యంగా వచ్చి.. త్వరగా ఇంటికి వెళ్లే ఉద్యోగులపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండే వారు, కార్యాలయ పనివేళలను సక్రమంగా  పాటించని వారితో సంబంధిత అధికారులు కఠినంగా వ్యవహరించాలి మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఆధార్‌ తో అనుసంధానమైన బయోమెట్రిక్ వ్యవస్థ ఉన్న కూడా పలువురు ఉద్యోగులు తమ హాజరు నమోదు చేయడం లేదని కేంద్రం తెలిపింది. అలానే  మరికొందరు తరచూ ఆఫీసుకు లేటుగా వస్తున్నట్లు గుర్తించినట్టు సిబ్బంది మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఈ నేపథ్యంలో అలాంటి ఉద్యోగులపై కేంద్రం సీరియస్ గా ఉంది. ఇలాంటి ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు కేంద్రం కీలక  ఆదేశాలు జారీ చేసింది. ఈక్రమంలోనే తాజా సూచలన ప్రకారం.. ఒక్కరు ఆలస్యంగా  ఆఫీస్ కి వచ్చిన ఒక పూట క్యాజువల్ లీవ్ కింద కోతపెట్టాలని ఒకవేళ సీఎల్‌ లు లేకపోతే తమ సెలవుల నుంచి తగ్గించాలి. సరైన కారణాలు ఉంటే మాత్రం నెలలో గరిష్ఠంగా రెండుసార్లు, రోజుకు గంటకు మించకుండా ఆలస్యంగా రావడానకి అనుమతించవచ్చని తెలిపింది. ముందుగానే ఆఫీస్ నుంచి వెళ్లిపోవడాన్ని, లేటుగా ఆఫీస్ గా వెళ్లడాని సమానంగానే చూడాలని, వీటి విషయంలోపై నిబంధనలే పాటించాలని పేర్కొంది.

రాష్ట్ర స్థాయిలో కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లో కొందరు విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటారు.  సరైన సమయానికి ఆఫీస్ కి రాకపోవడం, త్వరగా వెళ్లిపోవడంతో.. వివిధ పనుల నిమిత్తం అధికారుల దగ్గరకి వచ్చే ప్రజలకు నిరాశకు గురువుతుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే.. అసలు ఉద్యోగులు ఎప్పుడు కార్యాలయానికి వస్తారా అనే సందేహాలు కూడా పడుతుంటారు. అందుకే చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగుల అంటే నిర్లక్ష్యంగా ఉంటారనే ఫీలింగ్ ఉంటుంది. ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీగా, సమయ పాలనను పాటిస్తూనే విధులు నిర్వహిస్తుంటారు. కానీ కొందరి కారణంగా మొత్తం ఉద్యోగులకే అపకీర్తి వస్తుంది. ఈ క్రమంలోనే  కేంద్రం..లేటు గా ఆఫీస్ కి వచ్చే ఉద్యోగులపై సీరియస్ అయినట్లు పలువురు అభిప్రాయా పడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి