iDreamPost

అయ్యో..బాబూ… మీ రాజకీయాలకు అలా బ్రేక్ పడిందా

అయ్యో..బాబూ… మీ రాజకీయాలకు అలా బ్రేక్ పడిందా

ఆంధ్రప్రదేశ్ కి దూరంగా గడిచిన రెండు నెలలుగా గడుపుతున్నప్పటికీ తన రాజకీయాలకు మాత్రం విరామం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు. చివరకు పక్క రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి వచ్చి మన రాజధానిలో తల దాచుకుంటున్నారని తెలంగాణా సీఎం కేసీఆర్ సెటైర్ చేసే పరిస్థితి కూడా వచ్చింది. అయినా చంద్రబాబు మాత్రం ఏపీ వ్యవహారాల్లో అడుగడుగునా ప్రభుత్వానికి అడ్డంకులు కల్పించే ప్రయత్నాలే సాగిస్తున్నారు. అలాంటి పరంపరలో తాజాగా ఆయన వేసిన ఎత్తుగడ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచింది.

వాస్తవానికి ప్రస్తుతం దేశమంతా లాక్ డౌన్ కారణంగా ఎక్కడయినా స్థానికులు చిక్కుకుంటే వారిని తరలించే బాద్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. చివరకు కేంద్రం అనుమతితో నడిచే రైళ్లలో కార్మికుల దారి ఖర్చులు, ఇతర వ్యయాలు కూడా రాష్ట్రాలే భరిస్తున్నాయి. ఇక ఒక చోట నుంచి మరో చోటకి సొంత వాహనాల్లో ప్రయాణించే వారికి కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే అనుమతినిస్తున్నాయి. ఏపీ నుంచి తెలంగాణా, తెలంగాణా నుంచి ఏపీకి రాకపోకల కోసం కూడా డీజీపీ అనుమతితోనే ప్రయాణాలు సాగుతున్నాయి.

Also Read:గ్యాస్ లీక్ ప్రమాదం- టీడీపీ ఎమ్మెల్యే గణబాబు ఉన్నదున్నట్లు చెప్పారు !!

అలాంటి సమయంలో నిజంగా చంద్రబాబు కి ఆంద్రప్రదేశ్ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల అనుమతి తో ఏపీలో అడుగుపెట్టే అవకాశం కోసం ప్రయత్నించాల్సి ఉంటుంది. విశాఖలో ప్రమాదానికి గురయిన వారిని పరామర్శించేందుకు ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏపీ, తెలంగాణా ప్రభుత్వాల నుంచి అనుమతి కోరాల్సి ఉంటుంది. కానీ ఆయన మాత్రం అనూహ్యంగా కేంద్రానికి ఓ లేఖ రాశారు. తాను విశాఖ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరడం విస్మయకకరంగా మారింది. ఇరు రాష్ట్రాల ప్రజలందరికీ ఓ రూల్, చంద్రబాబుకి మరో రూల్ అన్నట్టుగా వ్యవహరించడమే దానికి కారణం. ప్రజల ప్రయోజనాలు ఆశించే ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత వహించాల్సిన చంద్రబాబు , తూతూమంత్రంగా కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకోవడం విచిత్రంగా ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. వాస్తవానికి చంద్రబాబు తొలుత పెట్రోలియం మంత్రికి, ఆ తర్వాత పీఎం ఆఫీసులోని సెక్రటరీ కి లేఖ రాసి, తన విమానానికి అనుమతి కోరారు. ఆ వెంటనే తమకు అనుమతి వచ్చిందని మధ్యాహ్నం 1.30కి విశాఖ బయలుదేరుతున్నట్టు టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. కానీ తీరా చూస్తే కేంద్రం బాబుకి మొండి చేయి చూపడంతో సీన్ మారిపోయింది.

Also Read:గ్యాస్ లీక్ ఘటన – అధికారుల నుండి పూర్తి వివరాలు రాబట్టిన సీఎం జగన్

నిజానికి చంద్రబాబు రాసిన లేఖకు కేంద్రం నుంచి అనుమతి వస్తుందని ఎవరూ ఊహించరు. ఒకవేళ కేంద్రం స్పందించినా అనుమతిని రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా తాను విశాఖ వెళ్లేందుకు అనుమతి కావాలని రాష్ట్రాన్ని కోరుకున్నారు. ఏపీ డీజీపికి ఆయన విన్నవించడంతో అనుమతి దక్కింది. చంద్రబాబు కూడా అలాంటి ప్రయత్నమే చేయాల్సి ఉన్నప్పటికీ ఫాల్స్ ప్రెస్టీజ్ ప్రదర్శించడం విడ్డూరంగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తన రాజకీయాలే తప్ప నిజంగా జనాల పట్ల , ఆపదలో ఉన్న వారి పట్ల ఆయనకు ఏమాత్రం ప్రేమ లేదనడానికి ఇదో ఉదాహరణగా భావిస్తున్నారు.

Also Read:విపక్షాలను ఆశ్చర్యపరచిన జగన్, నోరెళ్లబెట్టిన ప్రత్యర్థులు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి