iDreamPost

గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ జంట.. వైరల్ అవుతున్న పోస్ట్

  • Published May 06, 2024 | 8:23 PMUpdated May 06, 2024 | 8:23 PM

సావిత్రమ్మగారి అబ్బాయి సీరియల్ ఫేమ్ చందన్ కుమార్ తెలుగు బుల్లితెర ప్రేక్షకుల అందరికీ సుపరిచితమే. అయితే తాజాగా ఈ బుల్లితెర హీరో తన అభిమానులతో ఓ గుడ్ న్యూస్ ను షేర్ చేసుకున్నాడు. ఇంతకి అదేమిటంటే.

సావిత్రమ్మగారి అబ్బాయి సీరియల్ ఫేమ్ చందన్ కుమార్ తెలుగు బుల్లితెర ప్రేక్షకుల అందరికీ సుపరిచితమే. అయితే తాజాగా ఈ బుల్లితెర హీరో తన అభిమానులతో ఓ గుడ్ న్యూస్ ను షేర్ చేసుకున్నాడు. ఇంతకి అదేమిటంటే.

  • Published May 06, 2024 | 8:23 PMUpdated May 06, 2024 | 8:23 PM
గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ జంట.. వైరల్ అవుతున్న పోస్ట్

ఈ మధ్య కాలంలో వెండితెర, బుల్లితెర అని తేడా లేకుండా.. వరుస సెలబ్రిటీస్ కు సంబంధించి ఏదో ఒక శుభవార్తలను వింటునే ఉన్నాం. ముఖ్యంగా ఎక్కువమంది సెలబ్రిటీస్ తమ పెళ్లి కబురును, అలాగే మాతృత్వ ఆనందాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే బుల్లితెర నటి మహేశ్వరి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇకపోతే మరో బుల్లితెర యాక్టర్ లేడి విలన్ శోభ శెట్టి ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. వీరితో పాటు మరో బుల్లితెర కమెడియన్ కూడా త్వరలోనే తల్లి కాబోతుందని నెట్టింట ఆమె ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా, ఇప్పుడు మరో బుల్లితెర సీరియల్ జంట ఆ లిస్ట్ లోకి తాజాగా చేరింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

బుల్లితెర నటుడు చందన్ కుమార్.. ఈ పేరుతో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ, సావిత్రమ్మగారి అబ్బాయి సీరియల్ హీరో అంటే మాత్రం అందరూ టక్కున గుర్తుపడతారు. ఎందుకంటే.. ఒకప్పుడు బుల్లితెరపై ప్రసారమయ్యే ఆ సీరియల్ ఎంతగానో ప్రేక్షకుల అదరణ పొందింది. ఇక అందులో నటించిన చందన్ తన యాక్టింగ్ తో ఆడియోన్స్ లో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. అయితే తాజాగా చందన్ అతని భార్య కవిత త్వరలోనే తాము తల్లిదండ్రులు కాబోతున్నమంటూ.. సోషల్ మీడియాలో ఓ ఫోటోతో పోస్ట్ ను షేర్ చేశారు. ఇక ఈ పోస్ట్ షేర్ చేసిన ఈ జంటకు అభిమానులు, పలువురు నటి, నటులు పెద్ద ఎత్తునే శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే.. మొదటి సీరియల్ తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న చందన్ ఈ క్రమంలోనే శ్రీమతి శ్రీనివాస్ అనే సీరియల్ కూడా నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు.

అయితే ఈ సీరియల్ నటించి మంచి ఫేమ్ సంపాదించుకున్న చందన్.. ఇదే సీరియల్ సెట్ లో అసిస్టెంట్ డైరెక్టర్ తో చాలా దురుసుగా ప్రవర్తించాడు. అంతేకాకుండా.. అతడి త‌ల్లి పై కూడా దుర్భాష‌లాడ‌టంతో.. ఆయ‌న‌ చంద‌న్ చెంప చెళ్లుమ‌నిపించాడు. ఇక ఈ వివాదంలో చందన్ తెలుగు బుల్లితెర గురించి దురుసుగా మాట్లాడాడు. ఈ క్రమంలోనే.. తెలుగు టీవీ ఫెడరేషన్ అతడి పైూ బ్యాన్ విధించింది. అయితే తెలుగులో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న చందన్.. నిజానికి కన్నడ నటుడు కావడం విశేషం. ఇక ఆ వివాదంతో ఈ కన్నడ నటుడు పూర్తిగా తెలుగు ఇండస్ట్రీకి దూరమయ్యాడు.

ఇక తెలుగు బుల్లితెరకు దూరమైన చందన్ అతని భార్య కవితతో ఇటీవలే ఫుడ్ బిజినెస్ లోకి దిగారు. కాగా, మండిపేట్ ప్లేట్ ఇడ్లీ కేఫ్ పేరిట వెజిటేరియ‌న్ రెస్టారెంట్ ప్రారంభించారు. అయితే ఈ రెస్టారెంట్ ను క‌న్న‌డ హీరో కిచ్చా సుదీప్ చేతుల మీదుగా ఈ రెస్టారెంట్‌ను ఓపెన్ చేశాడు. అలాగే చంద‌న్‌ ఇటీవ‌ల జ‌రిగిన సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్‌లో కర్ణాట‌క బుల్డోజ‌ర్స్ టీమ్ త‌ర‌పున ఆడాడు. మరి, చందన్ కుమార్ దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతుండటం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by K A V I T H A (@iam.kavitha_official)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి