iDreamPost

Hardik Pandya: అతడు జట్టులో ఉండటం మా అదృష్టం.. స్టార్ ప్లేయర్ పై పాండ్యా కామెంట్స్!

ఆ ఆటగాడు తమ జట్టులో ఉండటం మా అదృష్టమని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మరి ఆ ప్లేయర్ ఎవరు? పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆ ఆటగాడు తమ జట్టులో ఉండటం మా అదృష్టమని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మరి ఆ ప్లేయర్ ఎవరు? పూర్తి వివరాల్లోకి వెళితే..

Hardik Pandya: అతడు జట్టులో ఉండటం మా అదృష్టం.. స్టార్ ప్లేయర్ పై పాండ్యా కామెంట్స్!

ముంబై ఇండియన్స్.. జట్టు నిండా స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ఈ ఐపీఎల్ సీజన్ లో దారుణంగా విఫలం అయ్యింది. దాంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను చేతులారా చేజార్చుకుంది. అయితే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లుగా చివరి మ్యాచ్ ల్లో రాణిస్తూ.. ఇతర జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బతీస్తోంది ముంబై. తాజాగా సన్ రైజర్స్ ను 7 వికెట్ల తేడాతో చిత్తుచేసి.. ఆ జట్టు కు షాకిచ్చింది. ఇక ఈ విజయం తర్వాత మాట్లాడిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆ స్టార్ ప్లేయర్ జట్టులో ఉండటం మా అదృష్టం అంటూ కితాబిచ్చాడు. మరి ఆ ఆటగాడు ఎవరు? తెలుసుకుందాం పదండి.

ఐపీఎల్ 2024లో భాగంగా తాజాగా సన్ రైజర్స్ వర్సెస్ ముంబై మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. 174 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై.. 31 రన్స్ కే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజ్ లోకి వచ్చాడు మిస్టర్ టీమిండియా 360 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. సన్ రైజర్స్ బౌలర్లపైకి ఎదురుదాడికి దిగుతూ స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించాడు. తిలక్ వర్మ(37*) సహకారంతో చెలరేగిన సూర్య కేవలం 51 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తన సూపర్ బ్యాటింగ్ తో ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ ను 17.2 ఓవర్లలోనే ముగించి.. శభాష్ అనిపించాడు. విజయం సాధించిన తర్వాత అవార్డ్ ప్రజెంటేషన్ లో పాండ్యా సూర్యకుమార్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.

హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ..”సూర్యకుమార్ ఈ మ్యాచ్ లో అద్భుతమైన బ్యాటింగ్ తో చెలరేగాడు. అతడి స్పెషాలిటీ ఏంటంటే? సిక్సులు, ఫోర్లు బాదుతూ బౌలర్లను తీవ్ర ఒత్తిడికి గురిచేయడం. ఈ మ్యాచ్ లో కూడా అదే చేశాడు. ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగల వీరుడు సూర్య. ప్రస్తుతం అతడు ఆడుతున్న ఆటతీరు పూర్తిగా మారిపోయింది. సూర్య పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడుతున్నాడు. అతడు మా జట్టులో ఉండటం మా అదృష్టం” అంటూ మిస్టర్ 360పై ప్రశంసల వర్షం కురిపించాడు కెప్టెన్ పాండ్యా. ఇక ఈ మ్యాచ్ లో 3 కీలక వికెట్లు తీసిన పియూష్ చావ్లాపై కూడా ప్రశంసలు కురిపించాడు హార్దిక్. అయితే ఈ మ్యాచ్ లో మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ.. 10-15 రన్స్ ఎక్కువే ఇచ్చామని పాండ్యా తెలిపాడు. మరి సూర్యకుమార్ జట్టులో ఉండటం అదృష్టం అన్న పాండ్యా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి