iDreamPost

వీడియో: ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ కోసం భారీ క్రేన్‌తో పిచ్‌ను ఎలా పెడుతున్నాడో చూడండి!

  • Published May 07, 2024 | 10:36 AMUpdated May 07, 2024 | 10:36 AM

New York, Nassau Stadium, T20 World Cup 2024: మరి కొన్ని రోజుల్లో ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్‌ కప్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ కోసం అమెరికా పిచ్‌ను క్రేన్ల సాయంతో గ్రౌండ్లో తెచ్చిపెట్టింది. దాని గురించి వివరంగా తెలుసుకుందాం..

New York, Nassau Stadium, T20 World Cup 2024: మరి కొన్ని రోజుల్లో ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్‌ కప్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ కోసం అమెరికా పిచ్‌ను క్రేన్ల సాయంతో గ్రౌండ్లో తెచ్చిపెట్టింది. దాని గురించి వివరంగా తెలుసుకుందాం..

  • Published May 07, 2024 | 10:36 AMUpdated May 07, 2024 | 10:36 AM
వీడియో: ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ కోసం భారీ క్రేన్‌తో పిచ్‌ను ఎలా పెడుతున్నాడో చూడండి!

ఒకవైపు ఐపీఎల్‌ జోరుగా సాగుతున్నా.. మరోవైపు టీ20 వరల్డ్‌ కప్‌ సందడి కూడా మొదలైంది. ఇప్పటికే చాలా దేశాలు తమ జట్లను ప్రకటించాయి. భారత సెలెక్టర్లు 15 మందితో కూడిన స్క్వౌడ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. వారితో పాటు మరో నలుగురు ఆటగాళ్లను స్టాండ్‌బైగా ఎంపిక చేశారు. జూన్‌ 2 నుంచి వెస్టిండీస్‌, అమెరికా సంయుక్త వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. జూన్‌ 5న టీమిండియా తన తొలి మ్యాచ్‌ను ఐర్లాండ్‌తో ఆడనుంది. కానీ, అసలు సిసలు సమరం మాత్రం.. జూన్‌ 9న జరగనుంది. న్యూయార్క్‌లో ఇండియా-పాకిస్థాన్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ కోసం యావత్‌ ప్రపంచ క్రికెట్‌ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌ కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.

తాజాగా ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరగబోయే న్యూయార్క్‌లోని నసావు కౌంటీ స్టేడియంలో కీలక ఘట్టం చోటు చేసుకుంది. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 కోసం ఈ క్రికెట్‌ స్టేడియాన్ని ప్రత్యేకంగా నిర్మించిన విషయం తెలిసిందే. చాలా వేగంగా, అతి తక్కువ టైమ్‌లో ఇక్కడ క్రికెట్‌ స్టేడియం నిర్మించారు. అయితే.. స్టేడియంలో స్టాండ్స్‌, ఇతర సౌకర్యాలు అన్ని వేగంగా ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది కానీ, పిచ్‌ను అప్పటికప్పుడు ఏర్పాటు చేయడం అసాధ్యం. అందుకే తెలివిగా ఆలోచించిన అమెరికా.. ఈ స్టేడియంలో రెడీమేడ్‌ పిచ్‌ను ఉపయోగించింది.

భారీ క్రేన్ సాయంతో ఒక రెడీమేడ్‌ పిచ్‌ను తీసుకొని వచ్చి.. ఈ స్టేడియంలో పెట్టారు. అయితే.. పిచ్‌ ఏర్పాటు చేసే ప్రక్రియకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. భారీ క్రేన్ సాయంతో పదులు సంఖ్యలు ఇంజనీర్లు ఎంతో శ్రమించి.. పిచ్‌ను గ్రౌండ్‌లో ఇన్‌స్టాల్‌ చేశారు. ఈ ప్రాసెస్‌ను పిచ్‌ డ్రాప్‌ ఇన్‌గా పేర్కొన్నారు. అయితే.. ఇండియా-పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ అంటే భారీ క్రేజ్‌ ఉంటుంది. అన్ని దేశాల క్రికెట్‌ అభిమానులు భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై ఆసక్తి చూపిస్తారు. మరి న్యూయార్క్‌లోని ఈ తాత్కాలిక స్టేడియం క్రికెట్‌ అభిమానులు తాకిడిని తట్టుకుంటుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఆ విషయం పక్కనపెడితే.. పిచ్‌ డ్రాప్‌ ఇన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి