iDreamPost

ఇది మరీ బాగుంది.. 200కు 212 మార్కులు.. ఎక్కడంటే?

Gujarat News: ఈ మధ్య కాలంలో ఉపాధ్యాయులు చేస్తున్న తప్పిదాల వల్ల విద్యార్థులు గందరగోళంలో పడిపోతున్నారు. ముఖ్యంగా ఎగ్జామ్స్ పేపర్, మార్కుల విషయంలో జరిగే తప్పిదాలు విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

Gujarat News: ఈ మధ్య కాలంలో ఉపాధ్యాయులు చేస్తున్న తప్పిదాల వల్ల విద్యార్థులు గందరగోళంలో పడిపోతున్నారు. ముఖ్యంగా ఎగ్జామ్స్ పేపర్, మార్కుల విషయంలో జరిగే తప్పిదాలు విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

ఇది మరీ బాగుంది.. 200కు 212 మార్కులు.. ఎక్కడంటే?

విద్యార్థులకు ఉన్నత విద్యనందించి సమంజంలో గొప్ప పొజీషన్ లో ఉంచాల్సిన ఉపాధ్యాయులు ఇటీవల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఒకప్పుడు గురువు అంటే గొప్ప స్థానం ఉండేది.. కానీ ఇప్పుడు కొంతమంది గురువులు కమర్షియల్ గా తయారయ్యారని.. గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తూ ప్రైవేట్ విద్యాసంస్థలకు సేవలందిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.  కొన్నిసార్లు ఉపాధ్యాయులు చేసే కొన్ని తప్పిదాల వల్ల  విద్యార్థులు వారి తల్లిదండ్రులు గందరగోళంలో పడిపోతున్నారు. తాజాగా టీచర్లు చేసిన తప్పిదం వల్ల మార్కుల జాబితా చూసి షాక్ తిన్నారు విద్యార్థి, వారి తల్లిదండ్రులు. ఈ ఘటన గుజరాత్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

గుజరాత్ లో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల నిర్వాకంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుజరాత్ లోని దాహూద్ జిల్లాలో ప్రాథమిక పాఠశాల పరీక్ష ఫలితాల్లో దారుణమైన తప్పిదం జరిగింది. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ పరిస్థితి, పనితీరుపై ఆందోళన పెంచింది. నాలుగో తరగతి చదువుతున్న వాన్షి బెన్ మనీష్బాయ్ తన ఎగ్జామ్ ఫలితాలు చూసి షాక్ కి గురైంది. రెండు సబ్జెక్టుల్లో సాధించిన మార్కులు చూసి సదరు విద్యార్థితో పాటు మిగతా విద్యార్థులు ఆశ్చర్యపోయారు. నాలుగో తరగతి చదువుతున్న వాన్షిబెన్ మనీష్బాయ్ కి గుజారాతీలో 200 కి 211 మార్కులు, మ్యాథ్స్ లో 200 కి 212 మార్కులు చూపించింది. ఆ మార్కుల లీస్ట్ వాన్షిబెన్ తల్లిదండ్రులు సైతం షాక్ తిన్నారు.

వాన్షి బెన్ మనీష్బాయ్ తల్లిదండ్రులు మార్కులు ఇలా కూడా వస్తాయా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే ఈ తప్పిదం జరిగందని ఆరోపించారు. అయితే ఫలితాల మూల్యాంకనం సమయంలో తప్పిదం జరిగిందని వెల్లడైంది. అనంతరం, ఆ మార్కులను సవరించి గుజరాతలో 200 కు 191, గణితంలో 200 కి 190 మార్కులు సరిచేసింంది. మిగిలిన స్కోర్ ఏమీ మారలేదు. వాన్షీబెన్ ఎంతో సంబరంగా తనకు వచ్చిన ప్రోగ్రెస్ కార్డు కుటుంబ సభ్యలతో పంచుకోగా.. ఆ పొరపాటు వైరల్ గా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి