iDreamPost

Suryakumar Yadav: మెరుపు సెంచరీ తర్వాత గతాన్ని గుర్తు చేసుకున్న సూర్య! ఇదే మెుదటిసారి అంటూ..!

SRHపై మెరుపు సెంచరీ చేసిన తర్వాత గతాన్ని గుర్తు చేసుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. గత 5 నెలల్లో తాను ఇలా చేయడం ఇదే మెుదటిసారి అని ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

SRHపై మెరుపు సెంచరీ చేసిన తర్వాత గతాన్ని గుర్తు చేసుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. గత 5 నెలల్లో తాను ఇలా చేయడం ఇదే మెుదటిసారి అని ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

Suryakumar Yadav: మెరుపు సెంచరీ తర్వాత గతాన్ని గుర్తు చేసుకున్న సూర్య! ఇదే మెుదటిసారి అంటూ..!

సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ను ఒంటిచేత్తో గెలిపించాడు స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్. 31 పరగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన దశలో విధ్వంసకర సెంచరీతో చెలరేగి.. సన్ రైజర్స్ కు విజయాన్ని దూరం చేశాడు. ఈ మ్యాచ్ లో 51 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 6 సిక్సులతో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన సూర్య గతాన్ని తలచుకుని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత 5 నెలల్లో తాను ఇలా చేయడం ఇదే మెుదటిసారి అంటూ చెప్పుకొచ్చాడు. మరి ఇంతకీ సూర్య చేసిన ఆ పనేంటి? తెలుసుకుందాం పదండి.

సూర్యకుమార్ యాదవ్.. ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు గాయపడిన విషయం తెలిసిందే. సర్జరీ తర్వాత కోలుకున్న సూర్య.. ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్ లకు జట్టుకు దూరమైయ్యాడు. ఆ తర్వాత టీమ్ లోకి వచ్చాడు. అయితే అనుకున్నంతగా రాణించలేకపోతున్నాడు. అడపా దడపా మెరుపు ఇన్నింగ్స్ లు ఆడుతున్నప్పటికీ.. ఆ ఫామ్ ను కొనసాగించలేకపోతున్నాడు. ఇక తాజాగా SRHతో జరిగిన మ్యాచ్ లో మెరుపు సెంచరీతో పెను విధ్వంసం సృష్టించాడు. ఓడిపోయే మ్యాచ్ ను ఒంటిచేత్తో గెలిపించాడు. దాంతో ఇతడిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే గతాన్ని తలచుకుని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Surya remembers the past after a century!

సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ..”ఈ మ్యాచ్ లో సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించడం చాలా సంతోషంగా ఉంది. అయితే కొన్ని నెలల ముందు నా జీవితం కష్టంగా నడిచింది. కాలికి సర్జరీ కావడంతో.. కోలుకోవడానికి కాస్త సమయం పట్టింది.  ప్రస్తుతం ఫుల్ ఫిట్ గా ఉన్నాను. ఇక డిసెంబర్ 4 తర్వాత మళ్లీ నేను 20 ఓవర్లు ఫీల్డింగ్ చేయడం, దాదాపు 18 ఓవర్లు బ్యాటింగ్ చేయడం ఇదే తొలిసారి. ఇది నాకెంతో ఆనందాన్ని ఇస్తోంది. రాబోయే మ్యాచ్ ల్లో కూడా ఇదే విధంగా బ్యాటింగ్ చేయాలని భావిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు సూర్య. కాగా.. దాదాపు 5 నెలల తర్వాత పూర్తి స్థాయి ఆటగాడిగా మారానని పేర్కొన్నాడు సూర్య. ఇక అతడు తిరిగి ఫామ్ లోకి రావడంతో ఇటు ముంబై, అటు టీమిండియా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి