iDreamPost

పులి పిల్లతో ఆడుతున్న ఆ పిల్లాడు.. ఇప్పుడు ఇండస్ట్రీని ఊపేస్తునాడు!

  • Published Apr 03, 2024 | 2:11 PMUpdated Apr 03, 2024 | 2:11 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ కుర్రాడు.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ సూపర్ స్టార్. కేవలం బాలా నటుడిగా తన కేరీర్ ను ప్రారంభించిన ఈయన ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ఇండస్ట్రీని శాసిస్తున్నాడు. ఇంతకి ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టరా..?

పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ కుర్రాడు.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ సూపర్ స్టార్. కేవలం బాలా నటుడిగా తన కేరీర్ ను ప్రారంభించిన ఈయన ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ఇండస్ట్రీని శాసిస్తున్నాడు. ఇంతకి ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టరా..?

  • Published Apr 03, 2024 | 2:11 PMUpdated Apr 03, 2024 | 2:11 PM
పులి పిల్లతో ఆడుతున్న ఆ పిల్లాడు.. ఇప్పుడు ఇండస్ట్రీని ఊపేస్తునాడు!

చిత్ర పరిశ్రమలో ఇప్పుడు స్టార్స్ గా కొనసాగుతున్న నటి, నటులంతా ఎక్కువ శాతం బాలా నటులుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వారే ఉన్నారు. కేవలం చిన్న చిన్న పాత్రల్లో అలరించిన ఆ బాలా నటులే.. నేడు సూపర్ స్టార్స్ గా సినీ పరిశ్రమని ఏలుతున్నారు. అయితే ఎంత పెద్ద స్టార్ అయిన మొదటగా బాల నటులుగా.. ఆ తర్వాత సినిమాల్లో సహాక పాత్రలుగా నటిస్తారు. అలా చిన్న చిన్న పాత్రల్లో ఒదిగి.. ప్రేక్షకులను మెప్పించిన సినీ నటులు క్రమంగా హీరో, హీరోయిన్ లు గా ఎదిగా స్టార్ స్టెటస్ ను సంపాదించుకుంటారు. అంతేకాకుండా.. తర తరాలకు వీరికంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంత చేసుకొని రికార్డులు సృష్టిస్తారు. ప్రస్తుతం పై ఫోటోలో కనిపిస్తున్న ఈ కుర్రావాడు కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద సూపర్ స్టార్. కేవలం బాలా నటుడిగా సిని ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టరా..?

పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ కుర్రాడు.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ సూపర్ స్టార్. కేవలం బాలా నటుడిగా తన కేరీర్ ను ప్రారంభించిన ఈయన ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే మరెన్నో సూపర్ హిట్ చిత్రాల్లో అలరించి అమ్మాయిల కలల రాకుమారిడిగా మారాడు. పైగా ఈయన భార్య కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఇక ఇటీవలే దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కీలకపాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. ఇంతకి పై ఫోటోలో పులిని చేతిలో పట్టుకున్న ఈ కుర్రాడు ఎవరో గుర్తుకువచ్చిందా..? ఆయన మరెవరో కాదు బీటౌన్ సూపర్ స్టార్ ‘అజయ్ దేవగన్’. కాగా, ఈరోజు ఈహీరో 55వ పుట్టినరోజు సందర్భంగా.. ఆయనకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వీటిని చూసిన నెటిజన్స్ ఈ హీరో చిన్నప్పుడు కూడా ఎంతో అందంగా ఉన్నడంటూ కామెంట్స్ పెడుతున్నారు. అలాగే సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు కూడా పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున శుభాంకాంక్షలు తెలుపుతున్నారు.

ఇక ఈ ఏడాది అజయ్ దేవగన్ కు చాలా ప్రత్యేకం. ఎందుకంటే.. ప్రస్తుతం ఈయన చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. అలాగే ఇటీవలే నటించిన ‘షైతాన్’ చిత్రం విడుదలయింది. కాగా, ఇప్పుడు ‘మైదాన్’ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.పైగా ఏప్రిల్ 10న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. అజయ్ దేవగన్ బ్యాక్ గ్రౌండ్ విషయానికొస్తే.. ఈయన 1969 ఏప్రిల్ 2న ఢిల్లీలో పంజాబీ కుటుంబంలో జన్మించాడు. అసలు పేరు విశాల్ వీరూ దేవగన్. అతని తండ్రి వీరూ దేవగన్ స్టంట్ కొరియోగ్రాఫర్, యాక్షన్ మూవీ డైరెక్టర్. అతని తల్లి వీణా దేవగన్ నిర్మాత. అతని సోదరుడు అనిల్ దేవగన్ కూడా కథా రచయిత, దర్శకుడు. కాగా, అజయ్ దేవగన్ ముంబైలోని సిల్వర్ బీచ్ హైస్కూల్లో చదువుకున్నాడు. ముంబైలోని మిథిబాయి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ గ్రాడ్యూయేషన్ పూర్తి చేశాడు.

అయితే ఇంట్లో అందరూ సినీ పరిశ్రమకు చెందినవారు కాండంతో..అజయ్ దేవగన్ కూడా 1991లో వచ్చిన ‘ఫూల్ ఔర్ కాంటే’ చిత్రంతో సినీ ప్రయాణం స్టార్ట్ చేశాడు. అలా ఆ సినిమా నుంచి తన పేరును జయ్‌గా మార్చుకున్నాడు. 1985లో మిథున్ చక్రవర్తి నిర్మించిన ‘ప్యారీ బ్రాహ్మణ’లో బాలనటుడిగా కనిపించాడు. ఇప్పటివరకు దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించాడు. హిందీలోనే కాకుండా మరాఠీ చిత్రాల్లోనూ నటించాడు. అలాగే హీరోయిన్ ‘కాజోల్’ ను 1999లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వీరికి నీసా అనే అమ్మాయి, యుగ్ అనే కూమారుడు ఉన్నారు. మరి, అజయ్ దేవగన్ చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Ajay Devgn (@ajaydevgn)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి