iDreamPost

ఈ బిస్కట్ ధర రూ.26 లక్షలు.. దీని ప్రత్యేకత ఏమిటంటే

  • Published Jun 17, 2024 | 1:55 PMUpdated Jun 17, 2024 | 1:55 PM

సాధారణంగా బాగా ఖరీదైన బిస్కెట్స్ ధర రెండు వందల నుంచి మూడు వందల వరకు ఉంటుంది. అదే విదేశాల్లో లభించే బిస్కెట్స్ ధర అయితే వెయ్యి నుంచి ఐదువేలు వరకు ఉంటుదనే విషయం అందరికీ తెలిసిందే. కానీ, ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ బిస్కెట్ ధర తెలిస్తే షాక్ అవుతారు. ఏకంగా లక్షల్లో ఉంటుంది. దీని గురించి ఎవరికైనా తెలుసా..

సాధారణంగా బాగా ఖరీదైన బిస్కెట్స్ ధర రెండు వందల నుంచి మూడు వందల వరకు ఉంటుంది. అదే విదేశాల్లో లభించే బిస్కెట్స్ ధర అయితే వెయ్యి నుంచి ఐదువేలు వరకు ఉంటుదనే విషయం అందరికీ తెలిసిందే. కానీ, ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ బిస్కెట్ ధర తెలిస్తే షాక్ అవుతారు. ఏకంగా లక్షల్లో ఉంటుంది. దీని గురించి ఎవరికైనా తెలుసా..

  • Published Jun 17, 2024 | 1:55 PMUpdated Jun 17, 2024 | 1:55 PM
ఈ  బిస్కట్ ధర రూ.26 లక్షలు.. దీని ప్రత్యేకత ఏమిటంటే

బిస్కెట్స్ ను ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. సాధారణంగా ఈ బిస్కెట్స్ ను చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటుటారు. ఇక ఫుడ్ లవర్స్ అభిరుచుల మేరకు మార్కెట్ లో కూడా వివిధ రకాల బ్రాండ్స్ పేరుతో విక్రయిస్తుంటారు. అంతేకాకుండా.. వీటికి రకరకాల రుచులను కూడా జోడించి సేల్ చేస్తుంటారు. ఇక స్నాక్స్ గా భావించి చాలామంది వీటిని టేస్ట్ తగ్గట్టుగా రకరకాల బ్రాండ్ బిస్కెట్స్ ను వివిధ ధరలకు కొనుగోలు చేస్తుంటారు. అయితే సహజంగా ఒక బిస్కెట్ ధర ఎంత అని అంటే.. ఎవరైనా ఆ ప్రొడక్ట్ బట్టి ధరను చెబుతుంటారు. ఒకవేళ మరీ ఖరీదైనదైతే ఒక రెండు మూడు వందలు ఉండవచ్చు. కానీ, తాజాగా విదేశాల్లో లభించే ఓ బిస్కెట్ ధర ఎంతో తెలిస్తే.. షాక్ అవుతారు. ఎందుకంటే ఈ బిస్కెట్ ధర లక్షల్లో ఉంటుంది. మరి ఒక బిస్కెట్ ధర లక్షల్లో ఉందంటే.. అది కచ్చింతంగా బంగారం బిస్కెట్ అని కచ్చితంగా అనుకుంటారు. అయితే అలా అనుకుంటే పొరపాటే. ఇక ఇంతకి ఆ బిస్కెట్ విశేషం ఏమిటి దాని అసలు ధర ఎంతో తెలుసుకుందాం.

సాధారణంగా బాగా ఖరీదైన బిస్కెట్స్ ధర రెండు వందల నుంచి మూడు వందల వరకు ఉంటుంది. అదే విదేశాల్లో లభించే బిస్కెట్స్ ధర అయితే వెయ్యి నుంచి ఐదువేలు వరకు ఉంటుదనే విషయం అందరికీ తెలిసిందే. కానీ లక్షల్లో ఉండే బిస్కెట్ గురించి ఎవరికైనా తెలుసా అసలు లక్షల్లో దొరికే బిస్కెట్ అంటే అది ఏదో బంగారం బిస్కెట్ అనుకుంటే పొరపాటే. ముఖ్యంగా ఈ బిస్కెట్ కు టైటానిక్ షిప్ కి చాలా సంబంధం ఉంది. ఇంతకి విషయం ఏమిటంటే.. ఈ బిస్కెట్ లో చాలా విలువైన వస్తువులు తయారు చేసి ఉంటారు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇది ఒక సాధారణమైన బిస్కెట్. ఇందులో పిండి, నీరు పంచదార కలిపిన ద్రావణం మాత్రమే ఉంటుంది. పైగా ఈ బిస్కెట్ సైజ్ కూడా 10 సెం.మీ.  మాత్రమే ఉంటుంది. అయినా ఈ బిస్కెట్ భారీ ధర పలకడానికి,టైటానిక్ షిప్ గల సంబంధం ఏమిటో తెలుసుకుందాం.

ఈ బిస్కెట్ ప్యాకెట్ టైటానిక్ లైఫ్ బోట్‌లో ఉంచిన సర్వైవల్ కిట్‌లో ఉంది. ఒకప్పుడు టైటానిక్ మునిగిపోయిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా దానికి సంబంధించిన వస్తువులను డిమాండ్ పెరిగింది. దీంతో చాలామంది దానికి సంబంధించిన ప్రతి విషయాన్ని గుర్తుగా ఉంచుకోవాలన్నారు. ఈ క్రమంలోనే.. ఈ బిస్కెట్ ను జేమ్స్ ఫెన్విక్ అనే వ్యక్తికి దొరికింది. ఎలా అంటే.. టైటానిక్ మునిగిపోయే సమయంలో ఫెన్విక్ చెందిన కూడా సముద్రంలో ఉంది.  అప్పుడు అతడికి టైటానిక్ మునిగిపోయిన వార్త అందింది. దీంతో అతని షిప్ ను టైటానిక్ సహాయక పనిలో వినియోగించారు. అప్పుడే అక్కడ  ఫెన్విక్ కు ఈ బిస్కెట్ దొరికింది. అప్పుడు  అతడు దానిని జ్ఞాపకంగా ఉంచుకున్నాడు. ఇక ఆ షిప్ మునిగిన కొన్నాళ్ల తర్వాత ఈ బిస్కెట్‌ను వేలం వేయాలని భావించారు. దాని ధర లక్షల రూపాయలు పలుకుతుందని అంచనా వేశారు.

ఈ క్రమంలోనే ఇటీవలే ఈ బిస్కెట్‌ను వేలం వేయగా, ఒక కొనుగోలుదారు దాని కోసం 31,800 డాలర్లు బీడ్ వేశారు. ఇది భారతీయ రూపాయలలో సుమారుగా రూ. 26 లక్షల 56వేల రూపాయలు ఉంటుంది. ఇక ఈ వేలం బ్రిటాన్ లో జరిగింది. ముందుగా ఈ బిస్కెట్ ధర గరిష్టంగా 21000 డాలర్లకు చేరవచ్చని వేలం నిర్వాహకులు భావించారు. కానీ ఈ బిస్కెట్ వేలానికి వచ్చినప్పుడు, చాలా మంది దానిని కొనడానికి పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలోనే చివరికి బిడ్డింగ్ 31,800 US డాలర్ల వద్ద నిలిచింది. దీంతో ఆ వ్యక్తికీ ఈ బిస్కెట్ దక్కింది. అయితే ఈ ఈ బిస్కెట్ తినడానికి పనికి వచ్చేది కూడా కాదు. కేవలం టైటానిక్ షిప్ గుర్తుగా దీనిని ఇంటిలో దాచుకోవడం కోసం అంత ధర పెట్టి కొనుగోలు చేసుకోవడం విశేషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి