iDreamPost

దీనస్థితిలో బిగ్ బాస్ విన్నర్! ఏ తోడు లేక ఒంటరిగా ఆస్పత్రి బెడ్ పై!

Bigg Boss 17winner Munawar Faruqui: బిగ్ బాస్ షో గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అనేక సీజన్లతో సాగిన ఈ షోలో.. పలువురు విజేతలుగా నిలిచారు. అలా బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన వ్యక్తి..తాజాగా ఆస్పత్రి బెడ్ పై ఒంటరిగా ఉన్నాడు.

Bigg Boss 17winner Munawar Faruqui: బిగ్ బాస్ షో గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అనేక సీజన్లతో సాగిన ఈ షోలో.. పలువురు విజేతలుగా నిలిచారు. అలా బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన వ్యక్తి..తాజాగా ఆస్పత్రి బెడ్ పై ఒంటరిగా ఉన్నాడు.

దీనస్థితిలో బిగ్ బాస్ విన్నర్! ఏ తోడు లేక ఒంటరిగా  ఆస్పత్రి బెడ్ పై!

సినీ ఇండస్ట్రిలో ఎంతో మంది నటీనటులు తమ ప్రతిభతో మంచి గుర్తింపు సంపాదిస్తారు. అంతేకాక వరుస ఆఫర్లతో బిజీ బిజీగా గడుపుతుంటారు. అలా ఎంతో స్టార్ డమ్ లైఫ్ ను చూసిన సెలబ్రిటీల్లో కొందరు దీనస్థితిలోకి వెళ్తుంటారు. మరికొందరు అయితే ఆస్పత్రి లో చేరి.. ఎవరు తోడులేక నరకం అనుభవిస్తుంటారు. ఇలాంటి ఘటనలు చాలా మంది సెలబ్రిటీల లైఫ్ లో జరిగాయి. తాజాగా బిగ్ బాస్ విన్నర్ కూడా అలాంటి క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఏ తోడు లేక ఒంటరిగా ఆస్పత్రి బెడ్ పై ఉన్నా ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ఇంతకీ ఆ బిగ్ బాస్ విన్నర్ ఎవరు, ఆ వివరాలు, ఏమిటో ఇప్పుడు చూద్దాం..

బిగ్ బాస్ షో గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశంలోని దాదాపు అన్ని భాషల్లో ఈ షో విజయవంతంగా సాగుతోంది. అలానే తెలుగులోను ఇప్పటికే 7 సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ ఏడు సీజన్లు అందరిని ఆకట్టుకున్నాయి. ఇటీవల జరిగిన ఏడో సీజన్ లో పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచారు. తెలుగు బిగ్ బాస్ షో గురించి కాసేపు అలా ఉంచితే.. హిందిలోనూ ఈ షో అనేక సీజన్లు పూర్తి చేసుకుంది. చాలా మంది  విన్నర్లుగా నిలిచారు. అలా బిగ్ బాస్ సీజన్ 17లో విజేతగా నిలిచిన ప్రముఖ హాస్యనటుడు మునావర్ ఫరూఖీ ఆస్పత్రి పాలయ్యాడు. 2023లో అతను బిగ్ బాస్ సీజన్ 17 లో హౌస్‌మేట్‌ల్లో ఒకరిగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. బీబీ హౌస్ లో 100 రోజులకు పైగా గడిపి విజేతగా నిలిచాడు. అతను ట్రోఫీని గెలుచుకోవడమే కాకుండా రూ. 50 లక్షల నగదు బహుమతిని అందుకున్నాడు. అలానే హ్యుందాయ్ క్రెటా కారును కూడా పొందాడు.

అలాంటి మునావర్ తాజాగా అకస్మాత్తుగా బెడ్ పై ఉన్న ఫోటోలో కనిపించడంతో ఆయన అభిమానులు షాకి గురవుతున్నారు. మే 24న అనారోగ్యం కారణంతో ఆస్పత్రిలో చేరాడు. ఒంటరిగా బెడ్ పై చికిత్స తీసుకుంటూ మునావర్ కనిపించాడు. అతడు ఆస్పత్రి బెడ్ పై ఉన్న ఫోటోలను అతడి స్నేహితుడు సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. ఆ ఫోటోలౌ మునావర్ చేతిపై ఐవీ డ్రాప్స్‌తో హాస్పిటల్ బెడ్‌పై విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇక మునావర్ విషయానికి వస్తే. మార్చిలో ఓ సంఘటనతో వార్తలో నిలిచాడు.

ముంబైలోని ఓ హుక్కా పార్లర్ పై  పోలీసులు దాడి చేసిన సమయంలో మునావర్ తో పాటు 13 మంది పట్టుబడ్డారు. ఈ కేసు నాన్ బెయిలబుల్ అయినప్పటికీ పోలీసులు నోటీసులిచ్చి ఫరూఖీని విడుదల చేశారు. ఈ ఘటన అలాంటి రెండేళ్ల క్రితం తన స్టాండ్-అప్‌లలో హిందూ మనోభావాలను దెబ్బతీసినట్లు ఆరోపణలు రావడంతో వార్తల్లోకి ఎక్కాడు. మునావర్  రాముడిని ఎగతాళి చేశాడంతో, అతని కేసు నమోదు చేసి ఒక నెల జైలు శిక్ష విధించారు. ఈ ఇష్యూతో  దేశ వ్యాప్తంగా అతని అనేక ప్రదర్శనలు రద్దు చేయబడ్డాయి.  ఆతరువాత  అతను  కంగనా రనౌత్ హోస్ట్ గా ఉన్న లాక్ అప్‌ అనే  రియాలిటీ షో పాల్గొన్ని విజేతగా నిలిచాడు. ప్రస్తుతం మునావర్ ఆస్పత్రి బెడ్ పై ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి