iDreamPost

Grandhi Srinivas, Pawan Kalya: పవన్ కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన భీమవరం MLA!

మంగళవారం జనసేన అధినేత పవన్ కల్యాణ్.. భీమవరం ఎమ్మెల్యేపై అనేక ఆరోపణలు చేశారు. ఆయను గూండా అంటూ పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ మాటలకు భీమవరం ఎమెల్యే గ్రంధి శ్రీనివాస్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.

మంగళవారం జనసేన అధినేత పవన్ కల్యాణ్.. భీమవరం ఎమ్మెల్యేపై అనేక ఆరోపణలు చేశారు. ఆయను గూండా అంటూ పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ మాటలకు భీమవరం ఎమెల్యే గ్రంధి శ్రీనివాస్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.

Grandhi Srinivas, Pawan Kalya: పవన్ కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన భీమవరం MLA!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎప్పుడు ఎలా మాట్లాడుతారో ఆయనకే తెలియదనే అభిప్రాయాలం చాలా మందిలో ఉంది. అలానే ఆయన తరచూ పార్టీ కార్యక్రమాల్లో చేసే ప్రసంగాలు చాలా విచిత్రంగా ఉంటాయి. అలానే మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పవన్ కల్యాణ్..భీమవరం ఎమ్మెల్యేపై అనేక ఆరోపణలు చేశారు. ఆయన ఓ గూండాలాగా ప్రవర్తిస్తున్నారని పవన్ ఆరోపించారు. పవన్ వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ మాటలు సమాజానికి ప్రమాదకరమని, ఆయన మానసికి స్థితి ఆశ్చర్యం కలిగిస్తుందని సెటైర్లు వేశారు.

బుధవారం ఉదయం ప్రభుత్వ విప్, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పవన్ కల్యాణ్  పై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్.. తనను గూండా అని భీమవరం నుండి తరిమి కొట్టాలని చేసిన వ్యాఖ్యలను  ఖండిస్తున్నానని శ్రీనివాస్ అన్నారు. పవన్‌కు తన మీదా ఎందుకంత అసూయ అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నా అని ఆయన తెలిపారు. గత నెలలో భీమవరం వచ్చి తనపై ద్వేషం లేదన్నాడని, మళ్లీ ఇప్పుడేమో రౌడీ అంటూ మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ స్థలం కొందామంటే తాను అడ్డుకున్నానని చెప్పడం దారుణమని, పవన్‌ మానసిక స్థితి చూస్తే ఆశ్చర్యంగా ఉందని శ్రీనివాస్ తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ మాట్లాడే మాటలు సమాజానికే ప్రమాదకరమని, పవన్‌ కల్యాణ్‌కు దమ్ముంటే పులివెందులో పోటీ చేయాలని భీమవరం ఎమ్మెల్యే సవాల్‌ విసిరారు.

ఇంకా  ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్..పవన్ ను ఉద్దేశించి మాట్లాడుతూ..”చంద్రబాబు కాళ్లు, చేతులు పట్టుకుని 21 సీట్లు తీసుకున్నావు. జనసేన కార్యకర్తల, అభిమానుల ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టావు. నిన్ను సీఎంగా చూడాలి ఆశపడుతున్న జనసైనికులకు.. పార్టీ లేదు, తొక్కా లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నావు. నీకు ఎకరం స్థలం కావాలా?. నాకు ఉన్న తొమ్మిది ఎకరాల్లో ఎక్కడ కావాలో చెప్పు ఇస్తాను. మీ నిజ స్వరూపం తెలియక పవన్ సీఎం సీఎం అంటూ జనసేనికులు అరుస్తున్నారు. ఇప్పటికే 21 సీట్లకు పరిమితమై చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్నావు. నువ్వు ఎలా ఉన్నావో ఇప్పటికైనా తెలుసుకో” అంటూ శ్రీనివాస్ హితవు పలికారు.

“చిరంజీవికి, పవన్ కల్యాణ్ కి అసలు పోలికే లేదు. చిరంజీవి ఎన్నికల్లో పోటీ చేసి 18 సీట్లు గెలిచారు. అంతేకాక పవన్ మాదిరిగా సంస్కార హీనంగా విమర్శలు చేయలేక రాజకీయాలు వదిలేశారు. మరో అన్న నాగబాబుకి కూడా పవన్ అన్యాయం చేశారు. గత  ఎన్నికల్లో ఓటమి తర్వాత పవన్‌ మళ్లీ భీమవరం వైపు చూడలేదు. కోవిడ్‌ విజృభించిన సమయంలో కూడా ఇక్కడి ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు. భీమవరం ప్రజలు పవన్ గురించి ఏమనుకుంటున్నారో ఆయన తెలుసుకోవాలి. నేను గూండానని పవన్‌ అంటున్నారు. మరి నా మీద ఒక్క క్రిమినల్‌ కేసు కూడా లేదు కదా?” అని  గ్రంధి శ్రీనివాస్.. పవన్ కల్యాణ్ ను ప్రశ్నించారు. మొత్తంగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు గ్రంధి శ్రీనివాస్  అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. మరి.. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి