iDreamPost

5 ఏళ్ల తర్వాత లాభాలు! కార్తికేయను కాపాడిన B, C సెంటర్స్!

  • Author singhj Published - 05:00 PM, Thu - 31 August 23
  • Author singhj Published - 05:00 PM, Thu - 31 August 23
5 ఏళ్ల తర్వాత లాభాలు! కార్తికేయను కాపాడిన B, C సెంటర్స్!

జయాపజయాలు అనేది ఏ రంగంలోనైనా సర్వసాధారణమే. దీనికి సినీ రంగం కూడా మినహాయింపేమీ కాదు. ఇక్కడ సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉంటుంది. ఒక మూవీ హిట్ అవ్వాలంటే దానికి ఎన్నో విషయాలు కలసిరావాలి. కథ, కథనాలు, నటన, సంగీతం, దర్శకత్వం.. ఇలా ప్రతిదీ పక్కాగా ఉండాలి. ఒకవేళ ఇవన్నీ బాగున్నా లక్ లేకపోతే ఏమీ చేయలేం. ఇండస్ట్రీలో హిట్ ఫార్ములా అనేది ఉండదు. మంచి కథల్ని ఎంచుకొని ఆత్మవిశ్వాసంతో పనిచేసుకుంటూ పోవాలి. అప్పుడే విజయాలు దక్కుతాయని సినీ విశ్లేషకులు చెబుతుంటారు. అయితే ఇండస్ట్రీలో విజయాల పరంపరను కొనసాగించడం అంత ఈజీ కాదు.

సక్సెస్ ఫార్ములా అనేది లేదు కాబట్టే హీరోలు తమకు నచ్చిన కథల్ని ఎంచుకొని ముందుకెళ్తుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి హిట్లు రావొచ్చు, ఒక్కోసారి ఫ్లాపులు పడొచ్చు. విజయానికి పొంగిపోకుండా, ఓటమికి కుంగిపోకుండా ఉంటూ సినిమా సినిమాకు మరింతగా మెరుగుపడితేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలరు. ఇప్పుడు దీన్ని చేసి చూపించారు యంగ్ హీరో కార్తికేయ. ‘ఆర్ఎక్స్ 100’ మూవీతో ఓవర్​నైట్ స్టార్​గా మారిన ఆయన.. ఆ తర్వాత మాత్రం వరుస పరాజయాలను ఎదుర్కొన్నారు. ఎంతకీ సక్సెస్ రాకపోవడంతో మధ్యలో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ‘వలిమై’లో విలన్​గా కనిపించారు కార్తికేయ. ‘వలిమై’తో మంచి నటుడనే పేరు తెచ్చుకున్న కార్తికేయ.. అదే ఊపులో హిట్ కొట్టేందుకు తన ప్రయత్నాల్లో మరింత వేగం పెంచారు.

ఎట్టకేలకు ఇటీవల విడుదలైన ‘బెదురులంక 2012’తో సాలిడ్ హిట్ కొట్టారాయన. క్లాక్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్​టైనర్​ బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. నేహా శెట్టి హీరోయిన్​గా యాక్ట్ చేసిన ‘బెదురులంక’ మూవీ వీకెండ్ కలెక్షన్స్​లో దూసుకెళ్తోంది. ఈ సినిమాతో బిజినెస్​లో ఉన్నవారంతా ప్రాఫిట్స్ తీసుకోవడం మొదలైందని తెలుస్తోంది. ‘బెదురులంక’కు పోటీగా వచ్చిన వరుణ్​తేజ్ ‘గాండీవధారి అర్జున’కు నెగెటివ్ టాక్ రావడం కూడా కార్తికేయ చిత్రానికి కలిసొచ్చింది. అదే సమయంలో బీ, సీ సెంటర్ల ఆడియెన్స్​కు నచ్చడంతో మూవీ ప్రాఫిట్ జోన్​లోకి వెళ్లిపోయిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మొత్తానికి ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత ఐదేళ్లకు ఒక హిట్​తో కమ్​బ్యాక్ ఇచ్చారు కార్తికేయ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి