iDreamPost

సుప్రీంకోర్టులో బాబు కేసు సంచలన రికార్డ్: జర్నలిస్ట్ సాయి

సుప్రీంకోర్టులో బాబు కేసు సంచలన రికార్డ్: జర్నలిస్ట్ సాయి

ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర రాజకీయాలు చాలా హీట్ మీద ఉన్నాయి. వేసవికాలం వేడి  తగ్గినా.. ఏపీలో పొటిలికల్ వేడి మాత్రం ఓ రేంజ్ లో ఉంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్  తరువాత ఏపీ రాజకీయం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అందరి దృష్టి చంద్రబాబు కేసులు, కోర్టులో వాటి విచారణ మీదనే ఉంది. అందుకే ఏసీబీ కోర్టులో మొదలు.. సుప్రీంకోర్టులో జరుగుతున్న చంద్రబాబు కేసుల విచారణపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇలాంటి సమయంలో సుప్రీం కోర్టులో చంద్రబాబు కేసు సంచలన రికార్టు సృష్టించిందని సీనియర్ జర్నలిస్ట్ సాయి అభిప్రాయ పడ్డారు. అందుకు గల కారణాలను కూడా ఆయన వివరించారు.

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో  చంద్రబాబు అరెస్టై  రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. అరెస్టైన క్షణాల్లో బాబు బయటకు వచ్చేస్తాడని అందరు భావించారు. కానీ దాదాపు నెల రోజులు కావస్తున్న చంద్రబాబు బయటకు రాలేకపోయారు. అంతేకాక బయటకు వచ్చే అవకాశాలు లేవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.  స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో  పక్కా ఆధారాలు ఉండటంతో తీర్పులు కూడా ఆయనకు వ్యతిరేకంగా వస్తున్నాయని పొటిలికట్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో సీనియర్ జర్నలిస్ట్ సాయి.. చంద్రబాబు కేసులకు సంబంధించి ఓ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు సంచలన రికార్డ్ సృష్టించిందని తెలిపారు. అందుకు గల కారణాలను ఆయన వివరించారు.

“స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో ప్రధానంగా చంద్రబాబు తరపు నాయవాదులు అవినీతి జరిగిందా లేదా? అనే విషయంలోకి గురించి ప్రస్తావించడం లేదు. అసలు మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్షనేతపై అవినీతి కేసు పెట్టొచ్చా?, లేదా? అనే దాని మీదనే విచారణ చేయాలంటూ కోర్టులను అప్రోచ్ అవుతున్నారు. అయితే ఈ టెక్నికల్ పాయింట్ మీదనే వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇక కేసులో చంద్రబాబు తరపున ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా  11 మంది లాయర్లు వాదిస్తున్నారు. ప్రభుత్వం తరపున 8 మంది లాయర్లు వాదిస్తున్నారు. ఇలా ఒక్క  కేసులో 19 మంది లాయర్లు వాదనలకు రెడీ అయినటువంటి అతిపెద్ద కేసు చంద్రబాబుదే. అందుకే చంద్రబాబు కేసు  సుప్రీం కోర్టులో సంచలన రికార్డు” అని జర్నలిస్ట్ సాయి తెలిపారు. మరి.. సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు సంచలన రికార్డు అంటూ సాయి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి