iDreamPost

బాలకృష్ణకు కరోనా పాజిటివ్.. NBK 107వ సినిమా షూట్ కి బ్రేక్..

బాలకృష్ణకు కరోనా పాజిటివ్.. NBK 107వ సినిమా షూట్ కి బ్రేక్..

నందమూరి బాలకృష్ణకు కరోనా సోకింది. గత రెండు రోజులుగా ఆరోగ్యం బాగోకపోవడంతో కరోనా పరీక్ష చేయించగా పాజిటివ్ అని తేలింది. తాజాగా అయన తనకి కరోనా పాజిటివ్ అని మీడియాకి సమాచారమిచ్చారు.

అలాగే గత రెండు మూడు రోజులుగా తనను కలిసి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని తెలుసుకుని కరోనా టెస్ట్ చేయించుకొని, జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరారు. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని, ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నాను అని, త్వరలోనే మీ ముందుకి వస్తాను అని బాలకృష్ణ తెలిపారు. బాలయ్య బాబుకి కరోనా సోకడంతో NBK 107వ సినిమా షూట్ కి బ్రేక్ పడింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి