సొంతగడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్ కప్-2023లో టీమిండియా అదరగొడుతోంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత జట్టు.. ఈసారి ఫేవరెట్ నుంచి హాట్ ఫేవరెట్‌గా మారింది. పటిష్టమైన ఆస్ట్రేలియాతో పాటు పసికూన ఆఫ్ఘానిస్థాన్‌పై విజయాలతో మంచి జోష్ మీద ఉన్న రోహిత్ సేన.. మూడో మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై సూపర్బ్ విక్టరీతో వరల్డ్ కప్‌లో మిగతా ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపింది. మొదట మహ్మద్ సిరాజ్ (2/50), కుల్దీప్ యాదవ్ (2/38), జస్ప్రీత్ బుమ్రా (2/19), రవీంద్ర జడేజా (2/38).. ఇలా మెయిర్ బౌలర్స్ అందరూ అదరగొట్టడంతో 42.5 ఓవర్లలో 191 రన్స్‌కే దాయాది టీమ్ కుప్పకూలింది.
పాక్ జట్టులో బాబర్ ఆజం (50), మహ్మద్ రిజ్వాన్ (49), ఇమాముల్ హక్ (36) మాత్రమే రాణించారు. ఒక్కసారి బాబర్ ఔటయ్యాక ఆ టీమ్ బ్యాటర్లు అందరూ పెవిలియన్‌కు క్యూ కట్టారు. పాక్ పతనంలో తన కెప్టెన్సీ స్కిల్స్‌తో, డెసిజన్స్తో కీలకమైన పాత్ర పోషించిన రోహిత్ శర్మ.. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ టీమ్‌ను ముందుండి నడిపించాడు. రోహిత్ (86)తో పాటు శ్రేయస్ అయ్యర్ (53 నాటౌట్) కూడా సత్తా చాటడంతో మరో 117 బాల్స్ ఉండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది టీమిండియా. ఈ విజయంతో రోహిత్ సేన నెట్‌రన్‌ను మరింత మెరుగుపర్చుకొని పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్‌కు దూసుకెళ్లింది.
మొదటి రెండు మ్యాచుల్లో గెలిచి ఊపు మీదున్న పాకిస్థాన్.. టీమిండియాతో పోరులో పూర్తిగా తేలిపోయింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లోనూ అట్టర్ ఫ్లాప్ అయింది. బాబర్-రిజ్వాన్ పార్ట్నర్షిప్ టైమ్‌లో కాస్త పోటీలో ఉన్నట్లు కనిపించినా.. ఒక్కసారి పాక్ కెప్టెన్ ఔటయ్యాక మ్యాచ్ భారత్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ మ్యాచ్‌లో బాబర్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముందుండి లీడ్ చేయాల్సిన అతను రాంగ్ టైమ్‌లో చెత్త షాట్ కొట్టి వికెట్ పారేసుకున్నాడు. అలాగే భారత ఇన్నింగ్స్ టైమ్‌లో హ్యారీస్ రౌఫ్ లాంటి వికెట్ టేకింగ్ బౌలర్‌ను కాదని హసన్ అలీని బౌలింగ్‌కు దింపాడు.
మ్యాచ్‌లో పట్టు సాధించాల్సిన టైమ్‌లో టీమిండియాకు ఆధిపత్యం ప్రదర్శించే ఛాన్స్ ఇచ్చాడంటూ పాక్ ఫ్యాన్స్ బాబర్‌పై సీరియస్ అవుతున్నారు. అయితే మ్యాచ్ అనంతరం బాబర్ చేసిన ఓ పనిపై ఆ దేశ లెజెండరీ పేసర్ వసీం అక్రమ్ ఫైర్ అయ్యాడు. జెర్సీ కావాలని కోహ్లీని బాబర్ అడిగాడు. ఇది కాస్తా కెమెరా కంటికి చిక్కింది. దీంతో వసీం అక్రమ్ సీరియస్ అయ్యాడు. టీషర్ట్ అడిగేందుకు ఇది కరెక్ట్ టైమ్ కాదన్నాడు. కోహ్లీని జెర్సీ కావాలని బాబర్ అడగడం తప్పన్నాడు. మ్యాచ్‌లో పాక్ ఓడిన టైమ్‌లో వెళ్లి కోహ్లీని జెర్సీ ఇమ్మని అనడం బాబర్ తప్పన్నాడు. మరి.. బాబర్‌పై వసీం అక్రమ్ చేసిన కామెంట్స్ మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IND vs PAK: రోహిత్ శర్మ బ్యాట్‌పై అనుమానం వ్యక్తం చేసిన అంపైర్!
Wasim Akram says Babar Azam shouldn’t have asked for Virat Kohli’s shirt after Pakistan’s big defeat against India tonight. It wasn’t the right time to do that! Do you agree? #CWC23 #INDvsPAK pic.twitter.com/csFm2TmToV
— Farid Khan (@_FaridKhan) October 14, 2023