iDreamPost

IND vs PAK: రోహిత్‌ శర్మ బ్యాట్‌పై అనుమానం వ్యక్తం చేసిన అంపైర్‌!

  • Author singhj Published - 11:40 AM, Sun - 15 October 23
  • Author singhj Published - 11:40 AM, Sun - 15 October 23
IND vs PAK: రోహిత్‌ శర్మ బ్యాట్‌పై అనుమానం వ్యక్తం చేసిన అంపైర్‌!

వన్డే వరల్డ్ కప్-2023లో ఎంతో ఆసక్తి రేకెత్తించిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అభిమానులకు మస్త్ మజాను పంచింది. ఒకరకంగా ఇది వన్ సైడ్ మ్యాచ్​గా ముగిసినా.. టీమిండియా బౌలర్ల అటాకింగ్ బౌలింగ్, బ్యాటర్ల మెరుపు విన్యాసాలు ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్​టైన్​మెంట్ పంచాయి. మ్యాచ్​కు ముందు బాలీవుడ్ సెలబ్రిటీలతో సెలబ్రేషన్స్, మ్యాచ్​లో భారత్ ఘనవిజయం సాధించడం స్టేడియానికి వచ్చి ఫ్యాన్స్​తో పాటు టీవీలు, మొబైల్స్​లో లైవ్ చూసిన కోట్లాది మందికి పైసా వసూల్ ఎంటర్​టైన్​మెంట్ ఇచ్చింది. ఈ మ్యాచ్​లో ముఖ్యంగా రోహిత్ శర్మ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్​ హైలైట్ అనే చెప్పాలి.

టార్గెట్ మరీ పెద్దది కాకపోయినా బాల్ బ్యాట్​ మీదకు సరిగ్గా రాకపోవడం, పిచ్ రివర్స్ స్వింగ్, స్పిన్​కు అనుకూలిస్తుండటంతో భారత్ ఛేజింగ్ కష్టమేనని అనిపించింది. ఆసీస్​తో మ్యాచ్​లోలా ఆరంభంలో వికెట్లు పడితే టీమిండియా పరిస్థితి ఏంటనే అనుమానం తలెత్తింది. కానీ భారత కెప్టెన్ రోహిత్ శర్మ వీటన్నింటికీ చెక్ పెట్టాడు. తాను ఫామ్​లో ఉంటే ఏ విషయాలు లెక్కలోకి రావని ప్రూవ్ చేశాడు. క్రీజులో ఉన్నంత సేపు ఫోర్లు, సిక్సులతో పాక్ బౌలర్లను చీల్చిచెండాడాడు. తద్వారా తన టీమ్ ఇలాగే అటాకింగ్ గేమ్​తోనే వరల్డ్ కప్​ ప్రయాణాన్ని కొనసాగిస్తుందని ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపాడు.

పాక్ బ్యాటర్లు షాట్లు కొట్టలేక చేతులెత్తేసిన పిచ్​ మీద రోహిత్ నీళ్లు తాగినంత ఈజీగా బౌండరీలు, సిక్సులు బాదడంతో అందరూ షాకయ్యారు. ఆఖరికి మ్యాచ్ అంపైర్​కు కూడా రోహిత్​ బ్యాటింగ్​పై అనుమానం వచ్చింది. దీంతో ‘నీ బ్యాట్​లో​ ఏదైనా ఉందా?’ అని హిట్​మ్యాన్​ను అంపైర్ ఎరాస్మస్ అడిగాడు. అయితే ‘బ్యాటులో కాదు.. ఇది నా పవర్’ అంటూ కండల్ని చూపించాడు రోహిత్. ఈ విషయాన్ని మ్యాచ్ తర్వాత హార్దిక్ పాండ్యాతో మాట్లాడుతూ టీమిండియా కెప్టెన్ రివీల్ చేశాడు. రోహిత్ ఈజీగా సిక్సులు కొట్టడం వెనుక అతడి పవర్​తో పాటు పర్ఫెక్ట్ టైమింగ్ కూడా ఒక కారణమని క్రికెట్ అనలిస్టులు అంటున్నారు. మరి.. రోహిత్ బ్యాటింగ్​పై అంపైర్ అనుమానం వ్యక్తం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: World Cup: ఒకే మ్యాచ్ ఎన్నో రికార్డులు బ్రేక్.. రోహిత్ ఆడితే ఇలాగే ఉంటుంది!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి