iDreamPost

వామ్మో బయట ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నారా?.. ఎంత ప్రమాదమో తెలుసా?

  • Published Apr 09, 2024 | 6:59 PMUpdated Apr 09, 2024 | 6:59 PM

Health News: ఇప్పటికే ఎండలు తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. ఎక్కడపడితే అక్కడ జ్యూస్ సెంటర్ల డిమాండ్ బాగా పెరిగిపోయింది. పైగా బయట తిరిగే వారు ఈ ఎండల వేడిని తట్టుకోలేక క్కడి బడితే.. అక్కడ ఫ్రూట్ జ్యూస్ లు ఎక్కువగా తాగేస్తున్నారు. కానీ, ఇలా తాగడం వలన అనేక ఆరోగ్య సమస్యలతో పాటు.. డేంజర్ లో పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఆ డేంజర్ సమస్యలేమిటంటే..

Health News: ఇప్పటికే ఎండలు తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. ఎక్కడపడితే అక్కడ జ్యూస్ సెంటర్ల డిమాండ్ బాగా పెరిగిపోయింది. పైగా బయట తిరిగే వారు ఈ ఎండల వేడిని తట్టుకోలేక క్కడి బడితే.. అక్కడ ఫ్రూట్ జ్యూస్ లు ఎక్కువగా తాగేస్తున్నారు. కానీ, ఇలా తాగడం వలన అనేక ఆరోగ్య సమస్యలతో పాటు.. డేంజర్ లో పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఆ డేంజర్ సమస్యలేమిటంటే..

  • Published Apr 09, 2024 | 6:59 PMUpdated Apr 09, 2024 | 6:59 PM
వామ్మో బయట ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నారా?.. ఎంత ప్రమాదమో తెలుసా?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన ఎండలు మండిపోతున్నాయి. భగభగ మంటూ సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.  అసలు ఉదయం 7 గంటల నుంచే విపరీతమైన ఎండ పెట్టేయడంతో ప్రజలు బయటకు రావలంటేనే భయపడుతున్నారు. అంతేకాకుండా.. మరి కొన్ని రోజుల్లో ఈ ఎండలు కాస్తా..  తీవ్ర ఎండలుగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయంటూ వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఈ ఎండల్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. చిన్న పిల్లు వృద్ధలు వంటి వారు అవసరమైతే తప్ప అనవసరంగా బయట తిరగవద్దని హెచ్చరించింది. దీంతో పాటు ఒకవేళ పని మీద ప్రజలు బయటకు వెళ్లవలసి వచ్చినప్పుడు గొడుగు, తలపై టోపీలు పెట్టుకోవాలని చెబుతున్నారు. అలాగే వైద్య నిపుణులు కూడా ఈ వేసవిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ తీసుకోవాలని, మంచి నీళ్లు ఎక్కువగా తాగాలని  సూచిస్తున్నారు. దీంతో ఇప్పటికే పని మీద బయటకు వెళ్తున్న చాలామంది ఈ ఎండల వేడి తట్టుకోలేక ఎక్కడి బడితే.. అక్కడ ఫ్రూట్ జ్యూస్ లు ఎక్కువగా తాగేస్తున్నారు. కానీ, ఇలా తాగడం వలన అనేక ఆరోగ్య సమస్యలతో పాటు.. డేంజర్ లో పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నాారు. మరి ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇప్పటికే ఎండలు తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. ఎక్కడపడితే అక్కడ జ్యూస్ సెంటర్ల డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఇక పనుల నిమిత్తం బయట తిరిగే చాలామంది ప్రజలు ఈ  ఎండల వేడిని తట్టుకోలేక ఏదైనా చల్లని జ్యూస్ ను తాగాడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలోనే ఎక్కడబడితే అక్కడ.. రకరకాల ఫ్రూట్ జ్యూస్ లను ఎక్కువగా తాగేస్తుంటారు. అయితే ఇలా ఎక్కడి బడితే అక్కడ బయట ఫ్రూట్ జ్యూస్ లను తాగడం వలన అనేక ఆనారోగ్య సమస్యలతో పాటు ..చాలా డేంజర్ లో పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. ఎండల తీవ్రతను అదనుగా తీసుకున్న కొందరు జ్యూస్ సెంటర్ల నిర్వాహకులు.. కుళ్లిపోయిన ఫ్రూట్స్, అపరిశుభ్రమైన ఐస్ ఉపయోగించి జ్యూసులు చేస్తుంటారు.

పైగా ఆ ఫ్రూట్స్ పై దుమ్ము, ధూళి వంటివి ఉంటాయి. ఇక జ్యూస్ సెంటర్ వాళ్లు వాటిని శుభ్రంగా చేయకుండా.. తయారు చేస్తూ కస్టమర్లకు ఇచ్చి వారి ప్రాణాలతో చెలగాటమాడుతారు. ఇక కస్టమర్లకు కూడా ఎండ నుంచి ఉపశమనం లభించేందుకు ఈ చల్లటి ఫ్రూట్ జ్యూస్ నే అమృతంలా ఎగబడి తాగేస్తుంటారు. కానీ, ఇలా శుభ్రం లేని, కుళ్లుపోయిన ఫ్రూట్స్‌తో చేసిన జ్యూసులు తాగడం వల్ల ప్రజలు గొంతు నొప్పి, జలుబు, దగ్గు వంటి రకరకాల ఇన్ఫెక్షన్‌లకు గురయ్యే అవకాశం ఉందని, దీని వలన హాస్పిటల్ చూట్టూ తిరుగుతూ.. వేలకు వేలు పోయాల్సి ఉంటుదని  ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఇక నుంచి  బయట జ్యూస్ సెంటర్లలో జ్యూసులు తాగేటప్పుడు వాళ్లు ఎలాంటి ఫ్రూట్స్ ఉపయోగిస్తున్నారో కాస్త గమనించి మంచింది. కానీ వీలైనంత మేరకు బయట జ్యూసులను పూర్తిగా మానేసి ఇంట్లో చేసుకొని తాజాగా తాగాడం మేలు అని నిపుణులు సూచిస్తున్నారు. మరి, బయట ఫ్రూట్ జ్యూస్ ల వల్ల వచ్చే డేంజర్ సమస్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి