iDreamPost
android-app
ios-app

నిద్రించే భంగిమల బట్టీ మనిషి వ్యక్తిత్వం చెప్పొచ్చు! ఎలా అంటే..

Sleeping Position: మన ఆరోగ్యంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుందనే సంగతి అందరికి తెలిసింది. ఇలాంటి నిద్ర గురించి అనేక ఆసక్తికరమైన అంశాలు ఉంటాయి. అలానే తాజాగా నిద్రకు విషయంలో కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Sleeping Position: మన ఆరోగ్యంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుందనే సంగతి అందరికి తెలిసింది. ఇలాంటి నిద్ర గురించి అనేక ఆసక్తికరమైన అంశాలు ఉంటాయి. అలానే తాజాగా నిద్రకు విషయంలో కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

నిద్రించే భంగిమల బట్టీ మనిషి వ్యక్తిత్వం చెప్పొచ్చు! ఎలా అంటే..

మనిషి జీవించడానికి గాలి,నీరు, ఆహారం ఎంతో ముఖ్యం. వీటితో పాటు నిద్ర కూడా చాలా ప్రధానమైనది.  అందుకే సరైన నిద్రలేకపోతే.. మనిషి అనారోగ్యం పాలవుతాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా మనిషికి నాణ్యమైన నిద్ర అనేది ఎంతో అవసరం. మనిషికి రోజూకు ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరిగా ఉండాలని వైద్యులు చెబుతుంటారు. రోజంతా..కష్టపడి పని చేసి.. రాత్రి సమయంలో నిద్రిస్తుంటారు. ఇది ఇలా ఉంటే…నిద్రకు ఉపక్రమించిన తరువాత వివిధ రకాల భంగిమల్లో నిద్రిస్తుంటారు. ఈ భంగిమలు మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయట. మరి.. ఎలానో ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

మన ఆరోగ్యంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుందనే సంగతి అందరికి తెలిసింది. ఇలాంటి నిద్ర గురించి అనేక ఆసక్తికరమైన అంశాలు ఉంటాయి. అలానే తాజాగా నిద్రకు విషయంలో కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మనం నిద్రపోయే భంగిమను బట్టి.. మన వ్యక్తిత్వాన్ని చెప్పేయవచ్చని కొందరు మానసిక నిపుణులు అంటున్నారు. సాధారణంగా ప్రతీ ఒక్కరూ ఒకే విధానంలో నిద్రపోరు. కొందరు బోర్లతిరిగి పడుకుంటే.. మరికొందరు వెల్లికలా, ఇంకొందరు ఎడమవైపునకు తిరిగి, అలాగే మరికొందరు కుడివైపునకు తిరిగి, కాళ్లు ముడుచుకుని, తల కింద చెయ్యి పెట్టు, బిగుసుకుని , ఇలా ఎవరి కంఫర్ట్ కు తగినట్లు వారికే నిద్రపోతుంటారు. ఈ క్రమంలోనే నిద్రించే వ్యక్తులు వేసే భంగిమలను బట్టి వారి వ్యక్తిత్వాలను చెప్పొచ్చునని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

వెల్లికల్లా పడుకునేవారు, బోర్లా పడుకునేవారికి ఎక్కువ స్వేఛ్చ ఉంటుందట. అలాంటి వారిని స్వేచ్ఛా పక్షి అని అనవచ్చు. వీరు నలుగురిలోనూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని భావిస్తుంటారు. ఇక బోర్లా పడుకునేవారికి మరో రకమైన మనసత్వం ఉంటుంది. వీరి సంకుచిత స్వభావం కలిగి ఉంటారు. అవసరమైతేనే ఇతరులతో మాట్లాడతారని అధ్యాయనాలు చెబుతున్నాయి. ప్రతీ పనిలోనూ అలసత్వం, ఎలాంటి లక్ష్యం లేకపోవడం అనేది వీరిలో కనిపిస్తుందట.

అలానే ఒకవైపునకు తిరిగి రెండు కాళ్లు ముడుచుకుని పడుకునేవారు స్వార్ధ పరులట. అంతేకాకుండా వీరిలో అసూయ, పగ, ప్రతీకారాలు ఎక్కువ ఉంటాయని చెబుతున్నారు.  అంతేకాక ఇలాంటి వారు ప్రతీ పనిని చూసి భయపడటమే కాక, వాటికి దూరంగా పారిపోతారు. అలాగే వీరు త్వరగా ఇతరుల దగ్గర మోసపోతారని అధ్యాయనాల్లో వెల్లడైంది. పక్కకు తిరిగి కాళ్లు ముడుచుకుని పడుకునే వారు చాలా కష్టపడి పనిచేస్తారట. అలాగే వీరు చాలా సున్నితమైన మనస్సు కలిగి ఉంటార. దీంతో చిన్న చిన్న విషయాలకే తెగ బాధపడిపోతుంటారు. ఈ భంగిమలో నిద్రించే వారిలో అసంతృప్తి కూడా ఎక్కువేని అధ్యాయనాలు చెబుతున్నాయి.

ఇక కుడిచెయ్యి తలకింద పెట్టుకుని కుడివైపునకే తిరిగి పడుకునేవారి ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుందట. వీరి ఎంచుకునే పనుల్లో విజయం సాధిస్తారంట. అంతేకాక అందరూ వెళ్లే దారిలో కాకుండా కొత్తగా దారిలో వెళ్లేందుకు ప్రయత్నం చేస్తుంటారు. వీరికి అధికారం, డబ్బు దండిగా ఉండటమే కాకుండా.. ఇంకా సంపాదించాలనే కోరికలు ఉంటాయి. ఎడమ చెయ్యి తలకింద పెట్టుకుని.. ఎడమవైపునకు తిరిగి పడుకునేవారికి మంచి గుణాలు ఎక్కువగా ఉంటాయి. పెద్దలను, తోటివారిని గౌరవించడమే కాక, పనిలో నిబద్దత ఉంటారంట. అయితే ఆత్మవిశ్వాసం మాత్రం తక్కువగా ఉన్నా.. ఇక వీరిలో ఓ స్పెషల్ ఎట్రాక్షన్ క్రియేటివిటీ ఉంటుందంట. ఇది కేవలం ఓ అధ్యాయనం ఆధారంగా ఇవ్వడం జరిగింది. మీరు ఎలాంటి వ్యక్తితం కలిగిన  వారో చెక్ చేసుకోండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి