Dharani
Men 24 Hrs Hormonal Cycle: ఆడవారికి పీరియడ్ సైకిల్ ఉన్నట్టే మగవారిలో కూడా హార్మోనల్ సైకిల్ ఉంటుందని.. దాని గురించి పూర్తిగా తెలుసుకుంటే దంపతుల మధ్య ఎలాంటి గొడవలు రావు అంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
Men 24 Hrs Hormonal Cycle: ఆడవారికి పీరియడ్ సైకిల్ ఉన్నట్టే మగవారిలో కూడా హార్మోనల్ సైకిల్ ఉంటుందని.. దాని గురించి పూర్తిగా తెలుసుకుంటే దంపతుల మధ్య ఎలాంటి గొడవలు రావు అంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
Dharani
పీరియడ్ సైకిల్.. రుతుస్రావం.. ఆడవాళ్ల జీవితంలో ఒక భాగం. ఒకప్పుడు 13వ ఏట నుంచి ఆడపిల్లల్లో రుతుస్రావ ప్రక్రియ ప్రారంభం అయ్యేది. అయితే మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి, రసయానాలు విరివిగా వాడి సాగు చేస్తున్న పంటలు ఇలా కారణాలు ఏవైనా నేటి కాలంలో ఆడపిల్లలు పట్టుమని 10 ఏళ్లు పూర్తి కాకుండానే మెచ్యూర్ అవుతున్నారు. ఇక అప్పటి నుంచి అంటే 10వ ఏట నుంచి సుమారు 40 ఏళ్ల పాటు అనగా ఆడవారికి 50 ఏళ్లు పైబడే వరకు ప్రతి నెల పీరియడ్స్ వస్తుంటాయి. 3-5 రోజులు ఉంటాయి. ఆ సమయంలో కొందరికి విపరీతమైన రక్తస్రావం, కడుపునొప్పి, వెన్ను నొప్పి, కాళ్లు, చేతులు లాగడం, వాంతులు, వికారం వంటి సమస్యలతో బాధపడతారు. కొద్ది మంది అదృష్టవంతులకు మాత్రమే ఈ కష్టాలు ఉండవు. అదే సమయంలో హార్మోన్స్ చేంజ్ వల్ల మూడ్ స్వింగ్స్ విపరీతంగా ఉండి.. అకారణ కోపం, నీరసం, ఆకలి, నిద్ర వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక ఇది ప్రతి నెల జరిగే తంతు కాబట్టి.. ఈ సమస్యలన్ని మహిళల జీవితాల్లో భాగం అయిపోయి.. ఎంత ఇబ్బందిగా ఉన్నా ఆ తర్వాత వాటిని పెద్దగా పట్టించుకోరు.
రుతుస్రావం వల్ల సమస్యలు ఎన్ని ఉన్నా.. అది మహిళల ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటారు. ప్రతి నెల చెడు రక్తం బయటకు పోవడంతో.. వారి ఆరోగ్యం బాగుంటుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. మరి మహిళలకు అయితే ఇలాంటి రుతుస్రావ పీరియడ్ ఉంటుంది.. మరి మగాళ్లలో అంటే.. వారికి కూడా ఆడవాళ్లలానే హార్మోనల్ సైకిల్ ఉంటుంది అంటున్నారు నిపుణులు. అయితే మహిళలకు నెలకు ఒకసారి రుతుస్రావ సైకిల్ ఉంటే.. మగవారికి మాత్రం 24 గంటల హార్మోనల్ సైకిల్ ఉంటుందని చెబుతున్నారు.
దీని వల్ల ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్ర పోయే వరకు మగవారిలో రకరకాల ఎమోషన్స్ ఉంటాయి అంటున్నారు. సాధారణంగా ఉదయం లేవగానే మగవారిలోటెస్టోస్టెరాన్ హార్మోన్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఉండి.. చాలా యాక్టీవ్‌గా ఉంటారని.. ఆ సయమంలో పురుషులు చాలా ఉత్సాహంగా, ఎనర్జీటిక్‌గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. కానీ ఈజీగా కోపం వచ్చే అవకాశం ఉంటుంది కనుక.. ఆ సమయంలో ఎలాంటి డిస్కషన్స్ పెట్టకుండా ఉంటే మంచిది అంటున్నారు. ఉదయం సమయంలో మగవారు.. ఎలాంటి శారీరక శ్రమకు వెనకడుగు వేయరని చెబుతున్నారు.
ఇక మధ్యాహ్నం సమయానికి వచ్చే సరికి మగవారిలో టెస్టోస్టెరాన్ లెవల్స్ పడిపోయి.. మధ్యస్థాయికి చేరుకుంటాయిని.. ఆసయమంలో వారు ఎక్కువ ఏకాగ్రతతో ఉండి.. ఇతరులతో కమ్యునికేట్ అవ్వడానికి ఇష్టపడతారని చెబుతున్నారు. కనుక ఇలాంటి సమయంలో దేని గురించి అయినా చర్చించి నిర్ణయం తీసుకునే అంశాలు, సమస్యను పరిష్కరించుకునే పనులు చేపడితే.. మంచి రిజల్ట్ వస్తుంది అంటున్నారు నిపుణులు. ఇక రాత్రి సమయంలో టెస్టోస్టిరాన్ లెవల్స్ పూర్తిగా పడిపోతాయని.. ఆ సమయంలో మగవారు జస్ట్ రిలాక్స్ అవ్వాలని.. మూవీ చూడటం, బుక్ చదవడానికి ఆసక్తి చూపుతారని నిపుణులు చెబుతున్నారు.
ఆ సమయంలో సరదాగా కూర్చుని మాట్లాడుకోవాడానికి.. చిన్న చిన్న హెల్ప్ అడగానికి ఎంతో అనుకూలం అని చెబుతున్నారు. ఈ చిన్న బయోలాజికల్ అంశం తెలుసుకోవడం వల్ల .. మీ బంధం మరింత మెరుగుపడే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు. కాబట్టి మగవారి మూడ్ స్వింగ్స్ ఏ సమయంలో ఎలా ఉంటాయో తెలుసుకుని.. దానికి తగ్గట్టుగా వారితో ప్రవర్తిస్తే.. చాలా వరకు దంపతుల మధ్య సమస్యలు రావని అంటున్నారు నిపుణులు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
Men have 24 hrs Hormonal cycle whereas women has monthly once.
Pain of men is ignored always. pic.twitter.com/KK1MO7Yg7M
— Fan of Bhavna (@right2men) July 16, 2024