భారత దిగ్గజం సౌరవ్ గంగూలీని గుర్తుకుతెచ్చాడు ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్. అచ్చం దాదా స్టైల్లో బ్యాటింగ్ చేస్తూ అందర్నీ సర్ప్రైజ్ చేశాడు.
భారత దిగ్గజం సౌరవ్ గంగూలీని గుర్తుకుతెచ్చాడు ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్. అచ్చం దాదా స్టైల్లో బ్యాటింగ్ చేస్తూ అందర్నీ సర్ప్రైజ్ చేశాడు.
సౌరవ్ గంగూలీ.. ఈ పేరు వింటే చాలు ఒకప్పుడు ప్రత్యర్థి బౌలర్లు భయపడేవారు. అగ్రెషన్‌కు మారుపేరైన దాదాతో ఎవరైనా పెట్టుకుంటే ఇక వాళ్ల అయిపోయినట్లే. తనను గెలికిన వారికి బ్యాట్‌తో పాటు మాటలతో, చేతలతోనూ ఆన్సర్ ఇచ్చేవాడు గంగూలీ. ఇక గంగూలీని బౌలర్లు రెచ్చగొడితే వారి ఖేల్ ఖతం అనేలా ఉండేది. పేసర్లు, స్పిన్నర్లు అనే తేడాల్లేకుండా క్రీజు వదిలి బయటకొచ్చి సిక్సుల మీద సిక్సులు కొట్టేవాడు దాదా. అతడు కొట్టిన కొన్ని షాట్స్ అయితే ఏకంగా స్టేడియం అవతల పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతగా బ్యాటింగ్‌లో గంగూలీ డామినేషన్ ఉండేది. అతడికి ఆఫ్ సైడ్ బాల్ పడితే పండగే అన్నట్లు ఉండేది.
ఆఫ్ సైడ్ పడిన బాల్స్‌ను తప్పకుండా బౌండరీలకు తరలించేవాడు గంగూలీ. అందుకే అతడ్ని ‘ఆఫ్ సైడ్ గాడ్’ అని ముద్దుగా పిలిచేవారు. ఆఫ్ సైడ్ ఎంతమంది ఫీల్డర్లను పెట్టినా గ్యాప్‌లో నుంచి బాల్‌ను ఫోర్‌గా మరల్చడం దాదాకు వెన్నతో పెట్టిన విద్య. అయితే గంగూలీ రిటైరయ్యాక అతడిలా ఆఫ్ సైడ్ చెలరేగి బ్యాటింగ్ చేసే లెఫ్టాండర్లు తగ్గిపోయారు. ఉన్నంతలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఇది మరోమారు ప్రూవ్ అయింది. నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వార్నర్ ఇది మరోమారు నిరూపించాడు.
వన్డే వరల్డ్ కప్-2023లో భాగంగా డచ్ టీమ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వార్నర్ (73 నాటౌట్) బీస్ట్ మోడ్‌లో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఒక ఓవర్లో అతను వరుసగా మూడు బౌండరీలు బాదాడు. ఇవన్నీ ఆఫ్ సైడే రావడం విశేషం. వార్నర్ కొడుతున్నాడని చెప్పి మరింత మంది ఫీల్డర్లను ఆఫ్ సైడ్ మోహరించినా ఆ వైపే టార్గెట్ చేసుకొని గ్యాప్స్ క్రియేట్ చేసుకొని మరీ బౌండరీలు బాదాడు వార్నర్. ఈ ఇన్నింగ్స్ ద్వారా లెజెండరీ క్రికెటర్ గంగూలీని వార్నర్ గుర్తు చేశాడని ఫ్యాన్స్ అంటున్నారు. మరి.. గంగూలీ మాదిరిగా వార్నర్ కొట్టిన షాట్స్ మీకెలా అనిపించాయో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రోహిత్ సేనకు BCCI వార్నింగ్.. ఆ పనులు చేస్తే ఊరుకోబోమంటూ..!