iDreamPost
android-app
ios-app

ఒకే మ్యాచ్​తో రికార్డులెన్నో.. మ్యాడ్ మ్యాక్స్ ఆడితే ఇలాగే ఉంటుంది బాస్!

  • Author singhj Published - 10:33 AM, Wed - 8 November 23

తన బ్యాట్ గర్జిస్తే ఎలా ఉంటుందో మరోమారు చూపించాడు మ్యాక్స్​వెల్. ఆఫ్ఘానిస్థాన్​పై అతడు ఆడిన ఇన్నింగ్స్​కు క్రికెట్ లవర్సే కాదు సీనియర్ క్రికెటర్లు కూడా ఫిదా అయిపోయారు. ఇదేం బాదుడ్రా బాబు, ఇదేం కొట్టుడ్రా సామి అంటూ షాకయ్యారు.

తన బ్యాట్ గర్జిస్తే ఎలా ఉంటుందో మరోమారు చూపించాడు మ్యాక్స్​వెల్. ఆఫ్ఘానిస్థాన్​పై అతడు ఆడిన ఇన్నింగ్స్​కు క్రికెట్ లవర్సే కాదు సీనియర్ క్రికెటర్లు కూడా ఫిదా అయిపోయారు. ఇదేం బాదుడ్రా బాబు, ఇదేం కొట్టుడ్రా సామి అంటూ షాకయ్యారు.

  • Author singhj Published - 10:33 AM, Wed - 8 November 23
ఒకే మ్యాచ్​తో రికార్డులెన్నో.. మ్యాడ్ మ్యాక్స్ ఆడితే ఇలాగే ఉంటుంది బాస్!

గ్లెన్ మ్యాక్స్​వెల్.. ఈ పేరు వింటేనే బౌలర్లు భయపడిపోతారు. ముఖ్యంగా స్పిన్నర్లు అతడి పేరు చెబితేనే బౌలింగ్​ చేసేందుకు వెనుకాడతారు. పేస్, స్పిన్​ అనే తేడాల్లేకుండా భారీ షాట్లతో విరుచుకుపడతాడు మ్యాక్సీ. అయితే స్పిన్నర్లను మాత్రం ఊచకోత కోస్తాడు. అలాంటి మ్యాక్స్​వెల్ మరోమారు తన బ్యాట్ పవర్ ఏంటో చూపించాడు. ఆఫ్ఘానిస్థాన్​ టీమ్​తో మంగళవారం జరిగిన మ్యాచ్​లో విధ్వంసక ఇన్నింగ్స్​తో చెలరేగాడు. 128 బంతుల్లో ఏకంగా 201 రన్స్ చేసి నాటౌట్​గా నిలిచాడు. ఓటమి ఫిక్స్ అనుకున్న దశ నుంచి మ్యాచ్​ను ఆఫ్ఘాన్ చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు. ఒక దశలో 91/7తో ఉన్న ఆసీస్.. మ్యాక్సీ మ్యాడ్ బ్యాటింగ్ కారణంగా మరో 19 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ఛేజ్ చేసేసింది.

ఆఫ్ఘాన్​పై తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన మ్యాక్స్​వెల్ ఎన్నో రికార్డులను బ్రేక్ చేశాడు. డబుల్ సెంచరీతో అదరగొట్టిన అతను ఈ మ్యాచ్​లో నమోదు చేసిన కొత్త రికార్డులు ఇవే..

వరల్డ్ కప్​లో ఛేజింగ్​లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్​గా మ్యాక్స్​వెల్ (201 నాటౌట్) నిలిచాడు. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్ బ్యాట్స్​మన్ ఆండ్రూ స్ట్రాస్ (158) పేరు మీద ఉండేది.

 వన్డే క్రికెట్ హిస్టరీలో ఛేజింగ్​ పర్సనల్ బెస్ట్ స్కోరు చేసిన బ్యాటర్​ అయ్యాడు మ్యాక్సీ. గతంలో ఈ రికార్డు పాకిస్థాన్ ఓపెనర్ ఫకర్ జమాన్ (193) పేరిట ఉండేది.

50 ఓవర్ల ఫార్మాట్​లో ఛేజింగ్​లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆసీస్ బ్యాటర్ మ్యాక్స్​వెలే. ఇంతకుముందు షేన్ వాట్సన్ (185) పేరిట ఉన్న రికార్డును నిన్నటి మ్యాచ్​లో బ్రేక్ చేశాడు మ్యాడ్ మ్యాక్స్.

 వన్డే ప్రపంచ కప్ చరిత్రలో ఛేదనలో డబుల్ సెంచరీ చేసిన ఫస్ట్ బ్యాట్స్​మన్​గా నిలిచాడు మ్యాక్స్​వెల్.

 వన్డే వరల్డ్ కప్ హిస్టరీలో డబుల్ సెంచరీ బాదిన మూడో బ్యాటర్​గా మ్యాక్సీ నిలిచాడు. ఇంతకుముందు 2015 ప్రపంచ కప్​లో జింబాబ్వేపై క్రిస్ గేల్ (215) చేశాడు. కివీస్ బ్యాటర్ మార్టిన్ గప్తిల్ విండీస్​పై 237 రన్స్ చేశాడు.

 వన్డే క్రికెట్​లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ (128 బంతుల్లో) చేసిన రెండో ఆటగాడు మ్యాక్స్​వెల్. 2022లో భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్​పై 126 బంతుల్లోనే ద్విశతకం బాదాడు.

 50 ఓవర్ల ఫార్మాట్​లో ఛేజింగ్​లో నమోదైన ఏకైక డబుల్ సెంచరీ మ్యాక్స్​వెల్​దే కావడం విశేషం.

 బ్యాటింగ్ ఆర్డర్​లో 6 లేదా అంతకంటే తక్కువ స్థానంలో వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్​గా మ్యాక్సీ నిలిచాడు. 1983 ప్రపంచ కప్​లో కపిల్ దేవ్ జింబాబ్వే మీద చేసిన 175 రన్స్ ఇప్పటిదాకా అత్యధికం.

 వన్డే క్రికెట్​లో ఇప్పటిదాకా 11 డబుల్ సెంచరీలు నమోదవ్వగా.. ఛేజింగ్​లో వచ్చిన ఏకైక డబుల్ సెంచరీ మ్యాక్స్​వెల్​దే.

 50 ఓవర్ల ఫార్మాట్ చరిత్రలో 8వ వికెట్​కు అత్యధిక రన్స్ (మ్యాక్స్​వెల్- కమిన్స్ 202 పరుగులు) పార్ట్​నర్​షిప్ నమోదు. సౌతాఫ్రికా ప్లేయర్లు ఆండ్రూ హాల్-జస్టిన్ కెంప్ కలసి 2006లో భారత్​పై చేసిన 138 రన్స్ రికార్డు బ్రేక్ అయింది.

 వరల్డ్ కప్​లో ఆసీస్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్​గా మ్యాక్స్​వెల్ నిలిచాడు. డేవిడ్ వార్నర్ (178)ను అతడు దాటేశాడు.

 ఈ మెగా టోర్నీలో మ్యాక్స్​వెల్ చేసిన రెండో సెంచరీ ఇది. మొదటిది ఫాస్టెస్ట్ సెంచరీ కాగా.. రెండోది ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఛేజింగ్​లో చేసినది కావడం విశేషం.

ఇదీ చదవండి: మ్యాక్స్‌వెల్‌ విధ్వంసంపై జక్కన్న పోస్ట్‌ వైరల్‌.. మ్యాడ్‌ అంటూ